జంజీరా కోట అతి పెద్దది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. కోట చుట్టూ అరేబియా సముద్రం ఉంటుంది. సిద్ది వంశస్ధుల పటిష్ట పాలనకు ఈ కోట ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కోట మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మురుద్ జంజీరాలో కలదు. ఈ కోట చాలా పటిష్టంగా నిర్మించబడింది. దుర్భేధ్యం కావటం వలన దీనిని ఎంతో మంది శత్రు రాజులు స్వాధీనం చేసుకొనలేకపోయారు. ఇంగ్లీష్, డచ్, పోర్చుగీస్, మరాఠాలు మొదలగువారు కూడా విఫలులయ్యారు. కోట కలపతో నిర్మించారు. శత్రువులనుండి రక్షణకు అవసరమైన ఆయుధ గిడ్డంగులు కూడా ఇక్కడ ఉంచేవారు. అరేబియా సముద్రం మధ్య ఉన్నప్పటికి దాని ఉప్పు గాలులు తగిలినప్పటికి కోట చెక్కు చెదరలేదు.



Click it and Unblock the Notifications