గాంధీ సాగర్ అభయారణ్యం, నీమచ్

హోమ్ » ప్రదేశములు » నీమచ్ » ఆకర్షణలు » గాంధీ సాగర్ అభయారణ్యం

గాంధీ సాగర్ అభయారణ్యం, ఇది , ప్రకృతి యొక్క అందానికి సాక్ష్యంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం; ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో నీమచ్ మరియు మంద్సూర్ ల ఉత్తర సరిహద్దుల మీద ఉన్నది. గాంధీ సాగర్ అభయారణ్యం 1974 లో గుర్తించబడింది మరియు 1983 లో గవర్నమెంట్ ఇంకా కొంత ప్రాంతాన్ని కలిపింది. ఈ అభయారణ్య మొత్తం ఏరియా 368.62 చ.కి.మీ. రాజస్తాన్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ఈ అభయారణ్యం పర్యాటకులకు మనోల్లాసాన్ని ఇస్తుంది అనటంలో సందేహం ఏమాత్రం లేదు.

చంబల్ నది మహాత్మా గాంధీ సాగర్ అభయారణ్యం గుండా వెళుతున్నది, దీనివలన ఇది రెండుగా విభజించబడుతున్నది. ఇందువలన సగభాగం నీమచ్ పడమటి వైపున మరియు మంద్సూర్ జిల్లా తూర్పు వైపుకు విభజన కావింపబడుతున్నది. ఇది పర్యాటకులకు ఒక ఆకర్షణీయమైన స్పాట్ గా ఉన్నది అనటంలో సందేహం లేదు.

Please Wait while comments are loading...