Search
  • Follow NativePlanet
Share
» »రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. కొత్త‌గా మూడు వందే భారత్​ ట్రైన్స్ లాంచ్​...

రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. కొత్త‌గా మూడు వందే భారత్​ ట్రైన్స్ లాంచ్​...

రైలు ప్ర‌యాణికుల‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ శుభవార్త‌ను మోసుకొచ్చారు. నేడు (శ‌నివారం) ప్ర‌ధాని కొత్తగా మరో 3 వందే భారత్​ ట్రైన్ల‌ను ప్రారంభించారు. ఈ ట్రైన్స్ స్వ‌యంగా ప్ర‌ధాని జెండా ఊపి ప్రారంభించారు. ఇప్ప‌టికే దేశంలో వందేభార‌త్ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానులు అందుకుంటుండ‌గా, కొత్త‌గా మ‌రో మూడు వందేభార‌త్ ట్రైన్ల‌ను లాంచ్ చేశారు. వాటి టైమింగ్స్ ఏంటీ, ఎక్క‌డినుంచి ఎక్క‌డివ‌ర‌కు వంటి వివ‌రాల‌న్నీ ఇప్ప‌డు తెలుసుకుందాం. నూత‌న ప‌ద్ద‌తుల‌తో ప్రారంభ‌మ‌యిన వందే భారత్ ట్రైన్స్ ప్రజలకు అత్యంత వేగం, అన్నీ సౌక‌ర్యాల‌తో ప్ర‌యాణించేందుకు అవ‌స‌ర‌మైన అన్నీ మార్గాల‌ను అందిస్తున్నాయి. కొత్తా ఏర్ప‌డిన ఈ ట్రైన్స్ ఇప్ప‌డు ఉత్తర్​ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి మూడు రాష్ట్రాలకు సేవలను అందించ‌నున్నాయ‌ని ప్రభుత్వం ఇచ్చినా ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

కొత్త వందే భారత్ ట్రైన్ రూట్స్‌..

కొత్త‌గా లాంచ్ అయిన ఈ మూడు వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌లు మీరట్-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై-నాగర్ కోయిల్ మార్గాల్లో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మీరట్ సిటీ-లక్నో వందే భారత్ రెండు నగరాల మధ్య ప్రస్తుత వేగవంతమైన రైలుతో పోలిస్తే ప్రయాణీకులకు గంట స‌మాయాన్ని ఆదా చేసేంద‌కు ఇది ఉప‌యోగ‌డప‌డుతుంది. ఇక‌, చెన్నై ఎగ్మోర్-నాగర్​కోయిల్ వెళ్లే వందే భారత్ ట్రైన్‌ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని 2 గంటలకు పైగా సమయాన్ని ఆదా చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు మధురై-బెంగళూరు వందే భారత్ ట్రైన్ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని గంట 30 నిమిషాలు ఆదా చేయ‌డంలో ముందుంటుంది.

Good news for train passengers New three Vande Bharat trains launch

ట్రైన్స్ టైమింగివే..

02671 అనే నెంబ‌ర్‌గ‌ల మధురై జంక్షన్-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ స్పెషల్ ట్రైన్‌..

20671 / 20672 అనే నెంబ‌ర్‌గల మధురై జంక్షన్-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్​ప్రెస్​ ట్రైన్ల బుకింగ్స్ ఇప్పుడు ప్రారంభ‌మ‌య్యాయి.

02627 అనే నెంబ‌ర్‌గల డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-నాగర్ కోయిల్ వందే భారత్ స్పెషల్ ట్రైన్. 20627/20628 అనే నెంబ‌ర్‌గ‌ల చెన్నై సెంట్రల్-నాగర్ కోయిల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రెగ్యులర్ సర్వీస్ ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది.

చెన్నై ఎగ్మోర్-నాగర్​కోయిల్ వందేభారత్ రైలు

ఈ వందేభార‌త్ ఎక్స్రెస్ ట్రైన్ తమిళనాడు రాష్ట్రంలో 726 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచ్చి, పెరంబలూరు, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై వంటి 12 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మీనాక్షి అమ్మన్ ఆలయం, మధురై, కన్యాకుమారిలోని కుమారి అమ్మన్ ఆలయానికి ప్రయాణించే యాత్రికులకు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

vande bharat

మధురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్

కొత్త‌గా లాంచ్ అయిన వందే భారత్ ట్రైన్‌ తమిళనాడులోని నిత్యం రద్దీగా ఉండే ఆలయ నగరం మధురైని కర్ణాటక రాష్ట్ర రాజధాని కాస్మోపాలిటన్ నగరం బెంగళూరుతో క‌ల‌ప‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

మీరట్ సిటీ-లక్నో వందే భారత్ ఎక్స్​ప్రెస్​

ఈ వందేభార‌త్ ట్రైన్ మీర‌ట్‌, ల‌క్నోలోని దిగంబర్ జైన్ ఆలయం, మానసా దేవి మందిర్, సూరజ్​కుండ్​ ఆలయం, అఘర్నాథ్ ఆలయం వంటి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లాలని ఉంటే త‌క్కువ స‌మ‌యంలో అక్క‌డికి చేరుకోవ‌చ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+