హంది ఖో అనేది పంచామారి అటవీ ప్రాంతం లో కల ఒక జలపాతం. ఇది ఒక కొండపై నుండి సుమారు 300 అడుగుల ఎత్తునుండి పడుతుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం లో జలపాతాల హోరు శబ్దాన్ని ఒక సంగీతం లా వినవచ్చు. స్థానికుల మేరకు, హంది ఖో ప్రదేశం లో గతం లో ఒక సరస్సు వుండేది. అయితే, ఒక రాక్షుసుడు విష నాగు రూపం లో దానిని కాపాడేవాడు.
ఒక సారి భగవాన్ శివుడికి ఈ విశానాగు కి మధ్య పోరాటం జరిగి ఆ ఘర్షణకు సరస్సు ఎండిపోయి ఒక పెద్ద గొయ్యి గా మారింది. ఆ గొయ్యి ఒక కుండ మాదిరిగా వుండటం వలన హంది అనే పేరు పొందింది. పంచామారి ప్రజలు దీనిని అంది ఖో అనే వారు. కాల క్రమేనా ఇది హండి ఖో గా మారింది. హంది ఖో దాని అద్భుత అందాలకు ప్రసిద్ధి గాంచినది.



Click it and Unblock the Notifications