పాలి జిల్లాలో సుక్రి నది ఒడ్డున సోజత్ పట్టణం కలదు. ఈ పట్టణం పురాతన కాలంలో తమ్రావతిగా పిలువబడింది. ఈ ప్రదేశంలో ఒక కోట మరియుసెజాల్ మాత దేవాలయం, ఛతుర్ భుజ్ దేవాలయం, చాముండ మాత దేవాలయం కలవు. ఇక్కడ గోరింటాకు సాగు అధికం.
దీనిని ఒక ఔషధ మొక్క లేదా శరీరంపై అందమైన డిజైన్ల కొరకు వాడతారు. మహిళలు సాధారణంగా దీనిని చేతులకు, కాళ్ళకు పెట్టుకొని ఎర్రగ పండితే చూసి ఆనందిస్తారు. ఇపుడు ఇది టాటూయింగ్ అనే పేరుతో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. మౌంట్ అబు వెళ్ళే వారు ఈ ప్రదేశానికి వచ్చి ఆనందించి వెళతారు.
పర్యాటకులు పీర్ మస్తాన్ దర్గా, రామ్ దేవ్ జీ దేవాలయం, దేసూరి మరియు కుర్కి కోట లను కూడా సోజత్ లో చూడవచ్చు. ఈ ప్రదేశం శ్రీ క్రిష్ణుడిని జీవితాంతం పూజించిన కవయిత్రి మీరాబాయ్ పుట్టిన ప్రదేశం.



Click it and Unblock the Notifications