బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లేదా బిట్స్ పిలాని విద్యా సంస్ధను 1964 లో స్ధాపించారు. ఇది దేశంలోని ప్రధాన విద్యా సంస్ధలలో ఒకటిగా పరిగణించబడుతోంది. దీనిని పారిశ్రామిక వేత్తలైన బిర్లాలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అందించిన సైన్స్, టెక్నాలజీ మరియు మోడర్నైజేషన్ అనే దేశ నిర్మణ పధకం క్రింద స్ధాపించారు. బిట్స్ పిలాని కేంపస్ లో సైన్స్ మరియు సాంప్రదాయ వారసత్వాల కలయిక ఒక అపురూప ప్రత్యేకత. అభివృధ్ధే ధ్యేయంగా దీని నిర్వహణలో ఆధునికత మరియు సాంప్రదాయాలు రెండూ ప్రతిబింబిస్తాయి.
కేంపస్ లో చూడదగినవి అంటే గొప్పదైన బిట్స్ టవర్. ఇది ప్రధాన భవంతిలో ఒక భాగం. ఇక్కడకు వచ్చిన వారు డామాలలోని స్ధానిక రుచికర ఆహారాలు తింటారు. యువ విద్యార్ధుల ఉత్తేజాన్ని వెలువరించే సమయమైన కాలేజీ పండుగలు ఏడాదికి మూడు సార్లు జరుగుతాయి. ఈ సమయంలో బయటివారు కేంపస్ సందర్శించి ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications