Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పొల్లాచి

పొల్లాచి - మార్కెట్ల యొక్క స్వర్గం

29

దక్షిణ భారత దేశం లోని తమిళనాడు రాష్ట్రం లోని కోయంబత్తూర్ జిల్లలో పొల్లాచి కలదు. దక్షిణ కోయంబత్తూర్ లో కల పొల్లాచి, జిల్లాలో రెండవ అతి పెద్ద టవున్ గా చెప్పబడుతోంది. ఈ ప్రదేశం పశ్చిమ కనుమలకు సమీపంలో వుండటంతో సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా వుండటం మాత్రమే కాక మంచి అందమైన ప్రదేశాలు కూడా కలిగి వుంది. సుందరమైన ఈ ప్రదేశం సినిమాలు తీసే వారికి ఆసక్తి కరమైనది. గత కొద్ది సంవత్సరాలలో సుమారుగా 1500 చిత్రాల వరకూ ఇక్కడ నిర్మించారు.

పొల్లాచి సమీపం లో టూరిస్ట్ ప్రదేశాలు

పొల్లాచి లో ని సుబ్రమణ్య టెంపుల్ బాగా ప్రసిద్ధి చెందినది. పొల్లాచి లో కల బెల్లం మార్కెట్ ఆసియా ఖండం లోనే పెద్దది. ఇక్కడి కూరల మార్కెట్ కేరళ ప్రాంతానికి ప్రధాన సరఫదారుగా వుంటుంది. పశువులు, ఐరన్ మార్కెట్లు కూడా దక్షిణ ఇండియాలో పెద్దవి. ఇంతేకాక, ఇక్కడ అనేక డాములు కలవు.

ఈ డాములలో నిరార్ డాం, అజియార్ డాం, మీన్కర డాం, శోలైయర్ డాం మరియు పెరువారిపల్లం డాం లు ప్రసిద్ధి చెందినవి. ఈ టవున్ లో అనేక టెంపుల్స్ కూడా కలవు. వాటిలో రామలింగ సౌదేశ్వరి అమ్మన్ టెంపుల్, సుబ్రమణ్య స్వామి టెంపుల్,మాసాని అమ్మన్ తిరుకొయిల్, అలగునాచి అమ్మన్ టెంపుల్, తిరుమూర్తి టెంపుల్,సులక్కల్ మరింమన్ తిరు కొయిల్, శ్రీ వేలాయుధ స్వామి తిరుకొయిల్ , ఎచనారి వినయగర్ తిరుకొయిల్, అమ్బరంపలయం దర్గా మరియు అరుల్మిగు ప్రచండ వినయగర్ టెంపుల్ ప్రసిద్ధి చెందినవి.

ఈ పట్టణం అజియార్ సిద్దా శ్రమం , అనైమలై విల్డ్లిఫే సంక్చురి, టాప్ స్లిప్, వల్పరాయి, మసానిఅమ్మన్ టెంపుల్, అమరావతి డాం మరియు క్రొకోడైల్ పార్క్ లకు సమీపంగాకూడా వున్నది.

ఈ ప్రదేశ చరిత్రలోకి వెళితే

పోల్లచికి పురాతన పేరు 'పోరుల్ ఆచి' అంటే సహజ సంపద మరియు అభివృద్ధి కల ప్రదేశం అని అర్ధం. ఈ టవున్ ను కులోత్తుంగ చోళ - 3 పాలనలో ముడి కొండ చోళ నల్లూర్ అనేవారు. 8 వ శతాబ్దానికి చెందిన పురాతన సుబ్రమణ్య టెంపుల్ ఈ ప్రాంత దేవాలయాలలో బాగా ప్రసిద్ధి చెందినది. చరిత్రలో ఒకప్పుడు ఇది ఒక శివ టెంపుల్ గా కూడా వుండేది. ఈ ప్రాంతాన్ని 'పోరుల్ అచ్చ' అంటే ధనిక ప్రభుత్వ ప్రదేశం అని కూడా అనేవారు. పొల్లాచి మార్కెట్ ను 'పొల్లాచి సంధాయి' అనేవారు. చరిత్రలో సంపదగల ప్రదేశం గా పేరొందినది.

పొల్లాచి ఎలా చేరాలి

పొల్లాచి కి సమీప ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్. ఇక్కడ నుండి దేసీయంగాను, విదేశాలకు విమానాలు కలవు. పొల్లాచి బస్సు స్టాండ్ నుండి సమీప ప్రదేశాలకు బస్సులు కలవు. పొల్లాచి కి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ సమీపం.

వాతావరణం

పొల్లాచి వాతావరణం సంవత్సరం పొడవునా ఒక మోస్తరు కాలాలు కలిగి వుంటుంది. అయినప్పటికీ ఈ ప్రదేశ సందర్శనకు వర్షాకాలం మరియు వింటర్ లు సూచించ దగినవి.

పొల్లాచి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పొల్లాచి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పొల్లాచి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పొల్లాచి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం సమీప నగరాలు, పట్టణాల నుండి పొల్లాచి కి ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు కలవు. రెగ్యులర్ టాక్సీ లు కూడా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ మార్గం పొల్లాచ్చి రైలు స్టేషన్ ప్రధాన లైన్ తో కలుపబడి వుండటం చేత అనేక రైళ్ళు దీని ద్వారా వెళతాయి. కనుక పొల్లాచి చేరేందుకు ట్రైన్ కూడా ఎంపిక చేయవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పోల్లచ్చికి సమీప ఎయిర్ పోర్ట్ కోయంబత్తూర్ లో 40 కి.మీ.ల దూరంలో కలదు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లు మరియు బస్సు లు పొల్లాచి కి దొరుకుతాయి. టాక్సీ లు సుమారు రూ. 600 చార్జీ తీసుకుంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Sun
Check Out
27 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon