Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పొన్నాని

పొన్నాని - కోస్తా తీరంలో పూర్తి విశ్రాంతి

13

కేరళలోని మలప్పురం జిల్లాలో పొన్నాని ఒక చిన్న సుందరమైన పట్టణం. పడమటి దిశగా అరేబియా సముద్రంచే చుట్టుముట్టబడిన ఈ పట్టణం మలబార్ కోస్తా తీరంలో ఒకప్రధాన మత్స్య కేంద్రం. పొడవైన బీచ్ లకు మరియు అనేక మసీదులకు పేరుగాంచింది. ఈ పట్టణం దక్షిణ భారత దేశంలోని పురాతన ఓడరేవు అయిన మలబార్ ఓడరేవు వాణిజ్య మరియు వ్యాపారాలకు ఎంతో ఎంతో తోడ్పడింది.

పొన్నాని పట్టణాన్ని దక్షిణ భారత దేశ మక్కా పట్టణం అని కూడా అంటారు. చాలా శతాబ్దాలనుండి ఇది ఒక ఇస్లామిక్ విద్యా కేంద్రంగా కలదు. ఈ ఓడరేవు పట్టణం కేరళ లోని అతిపెద్ద రెండవ నది భారత పూజ ఒడ్డున కలదు. ఈ పట్టణం హిందువులకు మరియు ముస్లింలకు కూడా పవిత్రమైనదే. చక్కటి మత సామరస్యత కలిగి వుంటారు.

విశిష్ట చరిత్రలు మరియు విభిన్న వారసత్వాలు

పొన్నాని కి శతాబ్దాల చరిత్ర కలదు. ఈ పట్టణం లోని జుమా మసీద్ బ్రిటిష్ చరిత్రకారుడు విలియం లోగాన్ వ్రాసిన మలబార్ మేనువాల్ లో కూడా కలదు. ఒకప్పుడు ఈ పట్టణం మలబార్ కు రెండవ రాజధాని గా ఉండేది. సమూతిరి రాజులకు అధికార నివాసం గా కూడా వుండేది. భారత దేశ స్వాతంత్ర పోరాట చరిత్ర లో కూడా దీనికి ఒక స్థానం కలదు. చాలామంది పోరాట యోధులు ఈ చిన్న పట్టణం నుండి వచ్చినవారే.

ఈ ద్దక్షినాది ఓడరేవు పట్టణ ప్రధాన ఆకర్షణలు పొన్నాని జుమా మసీద్ , లైట్ హౌస్ , ఫిషింగ్ హార్బర్ మరియు సరస్వతి హిందూ టెంపుల్. భరతపూజ మరియు తిరూర్ నదులు అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం లో పొన్నాని కి అలల తాకిడి అధికంగా ఉంటుంది. బియ్యం కాయల్ ఆక లేక్ పొన్నాని లో మరొక ఆకర్షణ.

పొన్నాని ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. రోడ్డు మరియు రైలు మార్గాలు కలిగి ఉంది. ఈ చిన్న సాంస్కృతిక మరియు చారిత్రక పట్టణం పర్యాటకులకు అమిత ఆనందాన్ని ఇవ్వగలదు.

పొన్నాని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పొన్నాని వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పొన్నాని

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పొన్నాని

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం పొన్నాని పట్టణం కోచి - కోజికోడ్ రోడ్డు మార్గంలో కలదు. ఈ పట్టణం నుండి కోజికోడ్ 80 కి.మీ. దూరంలో కలదు. అనేక బస్సులు మరియు టాక్సీ లు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కుట్టిపురం సమీప రైలు స్టేషన్. ఇది పొన్నాని కి 20 కి.మీ.ల దూరంలో కలదు. అయితే, ఇక్కడ అన్ని రైళ్ళు ఆగవు కనుక పర్యాటకులు తిరూర్ లేదా కోజికోడ్ రైలు స్టేషన్ కు చేరటం మంచింది. ఈ రెండు ప్రదేశాల నుండి పొన్నాని కి టాక్సీ లు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పొన్నాని కి సమీపంలో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇది సుమారు 60 కి.మీ. ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం నుండి దేశంలోని అనేక నగరాలకు విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుండి పొన్నాని కి టాక్సీ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun