Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పోర్ట్ బ్లెయిర్

పోర్ట్ బ్లెయిర్ - అండమాన్ రాజధాని!

28

పోర్ట్ బ్లెయిర్, కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు రాజధాని. ఇది దక్షిణ అండమాన్ ద్వీపంలో కలదు. పోర్ట్ బ్లెయిర్ లో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటూ వర్షాలు పడే సరికి మంచి సెలవుల విశ్రాంతి ప్రదేశంగా మారిపోతుంది. ఈ ప్రదేశాన్ని దేశీయులే కాక విదేశీయులు సైతం బాగా ఇష్టపడతారు. ఈ దీవిలో కొన్ని ప్రాంతాలు విదేశీయులకు రిజర్వు చేయబడి ఉంటాయి.

పోర్ట్ బ్లెయిర్ అనేక కారణాలుగా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది భారతీయ త్రి సేవా దళాలకు ప్రధాన కార్యాలయంగా పని చేస్తుంది. అంటే, ఇక్కడ భారతీయ వైమానిక దళం, నౌకాదళం మరియు కోస్ట్ గార్డులు అధికంగా కావలి ఉంటారు. ఆహ్లాదకరమైన కొన్ని బీచ్ లకు, సెలవుల ప్రదేశాలకు నిలయంగా ఉండి పర్యాటకులకు ఆనందం కలిగిస్తుంది. అంతేకాక, ప్రసిద్ధి చెందిన కాలా పాని జైలు కూడా కలిగి ఉంది. కాలా పాని అంటే నల్లని నీరు జైలు అని అర్ధం . ఇది 1800 ల సంవత్సరంనుండి ప్రసిద్ధి చెందినది.

కాలాపాని జైలును 1800 ల సంవత్సరంలో బ్రిటీష్ వారు భారతీయ రాజకీయ ఖైదీలను, స్వతంత్ర పోరాటంలో బంధించేందుకు నిర్మించారు. ఈ జైలులో ఆనాటి బ్రిటీష్ అధికార్లు ఖైదీలను వివిధ రకాలుగా హింసించేవారని ప్రజలు చెప్పుకొనే వారు.

పోర్ట్ బ్లెయిర్ లో ఉన్నపుడు మీరు ప్రఖ్యాత మెరైన్ పార్క్ తప్పక చూడాలి. సముద్ర కార్యకలాపాలు, సముద్ర జీవితం, సుమారు 150 చిన్న చిన్నదీవులకు తిరగటం మొదలైనవి ఉంటాయి. సముద్ర జీవితంపై మీకు గల ఆసక్తిని బట్టి మీ టూర్ మరింత పెంచుకోవచ్చు లేదా కొద్ది గంటలకు తగ్గించుకోవచ్చు కూడాను.

సెల్యులర్ జైలుకు సమీపంలోనే అండమాన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. దీనిలో అద్భుతమైన నీటి క్రీడలు అంటే పారా సెయిలింగ్, వాటర్ స్కూటర్స్, పెడల్ బోట్ల్, కయాకింగ్ వంటివి చేయవచ్చు. వాణిజ్యపర అంశాలేకాక, అండమాన్ దీవులలో నీటి క్రీడలు మిమ్మల్ని ప్రకృతికి మరింత సన్నిహితం చేస్తాయి.

వాతావరణం మరింత ఆనందం కలిగిస్తుంది. పోర్ట్ బ్లెయిర్ నగరం పర్యాటకులకు అత్యుత్తమ ప్రయాణ సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడి వీర సావర్కార్ విమానాశ్రయం నుండి కోల్ కటా, భువనేశ్వర్ మరియు చెన్నైలకు తరచుగా చేరవచ్చు. అంతేకాక, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ ఫెర్రీ ప్రయాణాలను కూడా అందిస్తుంది.

 

 

 

పోర్ట్ బ్లెయిర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పోర్ట్ బ్లెయిర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పోర్ట్ బ్లెయిర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పోర్ట్ బ్లెయిర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అండమాన్ మరియు నికోబార్ దీవులు రోడ్డు ద్వారా ప్రయాణించలేము. అయితే, అక్కడకు చేరిన తర్వాత అండమాన్ ట్రంక్ రోడ్డు అండమాన్ దీవి అంతా పర్యటించేలా చేస్తుంది. ఆ రోడ్డు అక్కడి జన సాంద్రత కల పట్టణాలు, బీచ్ లు, మెయిన్ ఓడరేవు అయిన పోర్ట్ బ్లెయిర్ జెట్టీ మరియు వీర సావర్కార్ విమానాశ్రం నుండి ఫొయనిక్స్ బే జెట్టీ లకు ప్రయాణింప చేస్తుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    There is no railway station available in పోర్ట్ బ్లెయిర్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఇండియాలో పేరొందిన విమాన సంస్ధలు వారంలో అనేక మార్లు చెన్నై, భువనేశ్వర్ మరియు కోల్ కటా లననుండి పోర్ట్ బ్లెయిర్ వీర్ సావర్కార్ విమానాశ్రయానికి విమానాలు నడుపుతున్నాయి. అతి త్వరలోనే ముంబై నుండి కూడా విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ కు రెండు లేదా రెండున్నర గంటలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed