17 వ శతాబ్దం లో కట్టిన పార్వతి దేవాలయంతో ఈ పార్వతి కొండ పూణే లోని చూడతగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ గణపతి, పార్వతి తదితర దేవతల విగ్రహాలు ఉన్నాయి. తొలినాళ్ళలో కేవలం పీష్వా రాజుల కోసం మాత్రమె కట్టిన ఈ గుడి తర్వాతి కాలం లో సామాన్యులకు కూడా ప్రవేశం కల్పించారు.పురాతన రాతి నిర్మాణంతో ఈ దేవాలయం కట్టబడింది. ఇక్కడ పూజలు చేసి ఆశీర్వాదం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.దగ్గరలో వుండే మ్యూజియం పేరు పార్వతి మ్యూజియం. పర్వతారోహకులకు పార్వతి కొండ మంచి ఆటవిడుపు.



Click it and Unblock the Notifications