ఒంటెల సఫారిలో ఇసుక దిబ్బల మీద ఒంటెల పై స్వారి చేయడమే కాక, ఎడారి లో బయట విడిది చేయడం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఈ సఫారీ జ్వలించే ఎడారి వైభవ అన్వేషణకు ఒక అద్భుత మార్గం. పర్యాటకులు ఇక్కడ రాత్రి పూట బస కూడా చేయవచ్చు.ఇటువంటి సాహస యాత్రలు ఒకరి సాహస స్థాయిని బట్టి రెండు రోజులు నుండి ఒక నెల వరకు విస్తరించి ఉండవచ్చు. ఇలాంటి యాత్రలలో అనుభవజ్ఞులైన ట్రావెల్ ఎస్కార్టులు పర్యాటకులతో ఉంటారు. ఒంటెల స్వారీలు, ఎడారిలో బసచేయడం వంటివి కఠినమనిపించినప్పటికీ వినోదాన్ని, పులకరింతను ఇస్తాయి.



Click it and Unblock the Notifications