Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రూప నగర్

రూప నగర్ – ఇండస్ వాలీ నాగరికత కు నిలువెత్తు సాక్ష్యం !

16

రూప నగర్ ను గతంలో రోపార్ అనేవారు. ఈ పురాతన పట్టణం సట్లేజ్ నదికి ఎడమ ఒడ్డున కలదు. ఈపేరు, 11 వ శతాబ్దం లో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజ రోకేశార్ కుమారుడు, యువరాజు రూప సేన్ పేరుగా పెట్టారు. ఇండస్ వాలీ నాగరికత వెల్లడైన ప్రధాన నగరాలలో ఇది ఒకటి. పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలు ఇక్కడ ఆరు వివిధ కాలాల నాగరికతలను బహిర్గతం చేసాయి. ఈ కలాక్రుతులను అన్నింటినీ భద్ర పరచటానికి గాను పురావస్తు శాఖ ఇక్కడ ఒక ప్రత్యేక మ్యూజియం నిర్మించింది. రూప నగర్ లో చూడవలసిన ఆకర్షనలలో ఇది ఒకటి.

రూప నగర్ లోను, చుట్టుపట్ల చూడదగిన ప్రదేశాలు

రాష్ట్ర సరిహద్దులో తూర్పు భాగాన కల రూప నగర్ సట్లేజ్ నది మరియు శివాలిక్ కొండల మధ్యన కలదు. ఈ సిటీ లో అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. వాటిలో ఆనందపూర్ సాహిబ్, భక్రా నంగల్ డాం , జతేశ్వర్ మహాదేవ టెంపుల్ మరియు కిరాత్పూర్ సాహిబ్ ప్రధానమైనవి. రూప నగర్ టూరిజం లో పర్యాటకులు సమీపంలో కల మరికొన్ని ఆసక్తికర ప్రదేశాలు చూడవచ్చు. రాష్ట్ర రాజధాని చండి ఘర్ ఇక్కడ నుండి కొద్ది గంటల ప్రయాణం ఒకటి లేదా రెండు రోజులలో రెండూ చూడవచ్చు. ఇంకనూ సిమ్లా 125 కి.మీ.లు కసౌలి 88 కి.మీ. ల దూరంలోను కలవు.

సిటీ ఆకర్షణలు

ఇక్కడ వివిధ పండుగలు ఎంతో ఉత్సాహంతో, ఆసక్తి కరంగా వివిధ మతాలవారు జరుపుకుంటారు. అన్నిటి కంటే పెద్ద పండుగ హాల్ల మొహాల్ల, ఆనంద్ పుర సాహిబ్ లో జరిగే ఈ పండుగ హోలీ తర్వాత అతి ఘనంగా నిర్వహిస్తారు. మూడు రోజులు జరిగే ఈ ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా సిక్కులు హాజరు అవుతారు. చివరి రోజున, నిహాన్గులు గా చెప్పబడే సిక్కు యోధులు వారి సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆయుధాలను చేపట్టి హోల్ ఘర్ ఫోర్ట్ వైపు నడుస్తూ గంగ ఒడ్డున నాట్యాలు చేస్తారు. ఈ పట్టణంలో రుచి కర స్థానిక ఆహారాలు అందించే అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు అనేక రోడ్ సైడ్ డాబాలు కలవు. ఈ వివిధ అంశాలు రూప నగర్ ను ఒక మంచి పర్యాటక ప్రదేశంగా చేసాయి.

రూప నగర్ ఎలా చేరాలి

నేషనల్ హై వే 21 ఈ సిటీ గుండా ప్రయాణిస్తుంది కనుక రోడ్డు మార్గంలో పంజాబ్ లోని అన్ని ప్రదేశాల నుండి ఇక్కడకు చేరవచ్చు. రూప నగర్ కు చండిఘర్ 17 కి. మీ.లు, దేశ రాజధాని న్యూ ఢిల్లీ 297 కి.మీ.లు దూరంలో వుంటాయి. అమ్రిత్సర్, చండి ఘర్, న్యూ ఢిల్లీ లలో ఎయిర్ పోర్ట్ లు కలవు. ట్రైన్ మార్గంలో వివిధ నగరాలనుండి రూప నగర్ తేలికగా చేరవచ్చు.

రూప నగర్ సందర్శనకు అనుకూల సమయం

రూప నగర్ లో వాతావరణం ఉత్తర భారత దేశం లోని ఇతర ప్రాంతాల వలెనే, వేడి వేసవులు, వర్శాకాలాలు చల్లదనం, శీతాకాలం అతి చల్లదనంతోను వుంటుంది. రూప నగర్ సందర్శనకు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ అనుకూలమైనది.

రూప నగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రూప నగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రూప నగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రూప నగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం సమీప నగరాల నుండి ప్రభుత్వ బస్సు లు లేదా ప్రైవేటు టాక్సీ లలో రూప నగర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం రూప నగర్ నుండి పంజాబ్ లోని వివిధ ప్రాంతాలకు, దేశం లోని ప్రధాన భాగాలకు వివిధ రైళ్ళు నడుస్తాయి. ఇది నేరుగా న్యూ ఢిల్లీ , హిమాచల్ ప్రదేశ్ లకు ప్రధాన రైళ్ళ తో కలుపబడి వుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం రూప నగర్ కు సమీప అంతర్జాతీయ విమానాశ్రయం పంజాబ్ లోని అమ్రిత్సర్ లో కలదు. ఇది సుమారు 200 కి. మీ. ల దూరంలో ఉంటుది. రోడ్డు మార్గంలో 4 గంటల ప్రయాణం లో చేరవచ్చు. చండి ఘర్ ఎయిర్ పోర్ట్ 55 కి.మీ.ల దూరంలో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue