హిమాచల్ ప్రదేశ్ లో ని సరహన్ లో నివాసముంటున్న హిందువులకి ఈ భీమకాళీ టెంపుల్ ప్రధానమైన పుణ్యక్షేత్రం. దాదాపు 800 ఏళ్ళ క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తారు. విలక్షణమైన భారతీయ మరియు బౌద్ధుల నిర్మాణ శైలితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తెలవారు జామున ఇంకా సాయంత్రం 'అరతి' వేళల్లో మాత్రమే ఈ పురాతన ఆలయం భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణం లో నే మరియొక చిన్న ఆలయాన్ని 1943 లో నిర్మించారు. ఈ ఆలయం లో భీమకాళీ అమ్మవారిని కన్యస్త్రీ గా వర్ణింపచేసే ప్రతిమని ప్రతిష్టించారు. ఈ కాంప్లెక్స్ లో ఉన్న మరో రెండు ఆలయాలు రఘునాథుని ఆలయం మరియు భైరోన్ యొక్క నర్సింగ్ ఆలయం . భారత దేశం లో నే శక్తి పీఠ్ ల లో అలాగే పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ భీమకాళీ ఆలయం పేరొందింది. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం, వివాహ సౌఖ్యాలకి అలాగే దీర్ఘాయువుకి పూజింపబడే శివుడి భార్య అయిన సతీ దేవి ఎడమ చెవి ఇక్కడే పడిపోయింది అని పురాణాలూ చెబుతున్నాయి. అలాగే మరికొన్ని గాధలు, మహర్షి బ్రహ్మగిరి కమండలం లో భీమకాళీ అమ్మవారు మొట్ట మొదట దర్శనమిచ్చారని చెబుతున్నాయి .ప్రధాన పండుగ అయిన దసరా పండుగని ఇక్కడ ఘనం గా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications