తిప్పగొండన హళ్ళి రిజర్వాయర్ చూసే పర్యాటకులు మంచినబెలె డ్యామ్ కూడా చూడాలి. ఈ డ్యామ్ అర్కావతి నదిపై నిర్మించబడింది. తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్ వలెనే మంచినబెలే డ్యామ్ కూడా మాగడి పట్టణ సాగునీటి అవసరాలకు నిర్మించబడింది. దీనిని మంచనబేలె లేదా మంచిన బెలె అని కూడా అంటారు. సాగు ప్రదేశాన్ని ధోరే సాలు లేదా నది ఒడ్డు అని కూడా అంటారు.
నగర హడావిడి జీవితంనుండి కొద్ది సేపు దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో బాగుంటుంది. ఒక పిక్ నిక్ స్పాట్ గా అనేక పక్షులను గమనిస్తూ ఆనందించవచ్చు. బెంగుళూరుకు 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ డ్యామ్ చేరాలంటే మాగడి రోడ్ పై ప్రయాణించాలి. సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications