ఖందర్ కోట సవాయి మాధో పూర్ లోని ఖందర్ తాలూకా లో గల ఖందర్ కోట తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణ. ఇది ప్రధాన నగరానికి 40 కి. మీ. దూరంలో గల పురాతన కోట. ఇది సుప్రసిద్ద అభయారణ్య౦ రణథంబోర్ నేషనల్ పార్క్ కు దగ్గర లో ఉంది.పొడవైన కొండ పై గల ఈ కోటకు మూడు పెద్ద ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.
క్లిష్టమైన స్థానంలో ఉన్న ఈ కోటపై ఏ సైన్యాలు అంత సులభంగా దండెత్తి వశపరచుకోలేకపోయేవి.ఖందర్ కోట ను పాలించిన వారిలో ఒక రాజు తను పోరాడిన ప్రతి యుద్ధాన్ని గెలిచాడు. ఈ కోటను పాలించిన రాజవంశాలలో మేవార్ సిసోడియా వంశస్తులు ఒకరు.తర్వాతి కాలంలో మొఘలాయిలు వీరిని ఓడించి కోటను వశపరచుకున్నారు.
ఈ కోట లోపలి నిర్మాణంలో హనుమాన్ దేవాలయం, చతుర్భుజ దేవాలయం, రాణి దేవాలయం, గోబింద్ దేవిజీ దేవాలయం, జగత్పాల్జి దేవాలయం, జయంతి మాత దేవాలయం అనే ఏడు దేవాలయాలు ఉన్నాయి. అదనంగా రెండు కుంటలు, ఏడు చెరువులతో బాటుగా ప్రాంగణం లోపల అనేక జల వనరులు ఉన్నాయి.



Click it and Unblock the Notifications