షిమ్లాకు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నతారాదేవి ఆలయం, షోఘిలోని ప్రఖ్యాతి గాంచిన ధార్మిక కేంద్రాలలో ఒకటి. తార పర్వతం పై ఉన్నఈ ఆలయం తారా మాతకు చెందినది. టిబెట్ బౌద్ధుల ముఖ్య దేవత తారదేవిని స్త్రీ శక్తి స్వరూపిణి దుర్గా మాత తొమ్మిది మంది తోబుట్టువులలో ఒకరిగా పరిగణిస్తారు.
ఈ ఆలయం 250 ఏళ్ళ క్రిందటిదని, ఈ దేవతావిగ్రహాన్ని పశ్చిమ బెంగాల్ నుండి సేన్ వంశపు రాజు ఇక్కడకు తీసుకుని వచ్చాడని విశ్వసిస్తారు. తారా మాత చెక్క విగ్రహాన్ని ఈ దేవాలయంలో వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా నెలకొల్పారు. శరన్నవరాత్రుల పండుగ కాలంలో, ప్రత్యేక ‘పూజ’ లేదా ప్రార్ధనలను ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications