సిల్చార్ నుండి 137 కి మీ దూరం లో ఉన్న ఈ హిల్ స్టేషన్ కు రోడ్డు ద్వారా సులువు గా చేరుకోవచ్చు . ఈ మైబోంగ్ అనే పేరు కి అర్ధం దిమాస భాష లో పుష్కలమైన బియ్యం అని . మాహుర్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం దిమాస మరియు కచారి రాజ్యాల కు రాజధాని గా ఉండేది. ఈ హిల్ స్టేషన్ సందర్శన ఒకప్పటి రాచరికపు వైభవాన్ని గుర్తుకుతెస్తుంది.
మైబొంగ్ లో ని ప్రధాన ఆకర్షణలలో ఒకటి కచారి రాజ్యం యొక్క శిధిలాలు. ఇవి ఈ హిల్ స్టేషన్ యొక్క దక్షిణాన చూడవచ్చు. 12 వ శతాబ్దం లో నిర్మితమైన ఏక శిలా ఆలయాలు అయిన రామచండి టెంపుల్ మరియు లాంగ్ తైనీ నొహ్ టెంపుల్ లను తప్పక సందర్శించి తీరాలి. అంతే కాక, మైబొంగ్ జలపాతం తో పాటు ఇతర చిన్న చిన్న జలపాతాలని కూడా సందర్శించవచ్చు.



Click it and Unblock the Notifications