షోలాపూర్ జిల్లాలోని ప్రధాన కేంద్రమైన బర్షి నందు భాగ్వంత్ దేవాలయం ఉంది. భారతదేశంలో భగ్వ౦త్ పేరున హిందూ దేవుడైన మహావిష్ణునకు నిర్మించిన ఒకే ఒక్క దేవాలయమని నమ్ముతారు.800 ఏళ్ళ క్రితం 1245 లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. భారతదేశంలోని ఈ ప్రాంతంలో నిర్మించిన అనేక దేవాలయాల వలె ఈ దేవాలయం కూడా శాస్త్రీయ హేమండ్పతి వాస్తు శైలిలో నిర్మించారు.నాలుగు దిక్కులలో నాలుగు ప్రత్యేక ద్వారాలను కల్గిన విశిష్టత ఈ దేవాలయానికి ఉంది. కాగా, ప్రధాన ద్వారం తూర్పు దిక్కున వుంది.నల్ల రాతిలో చెక్కబడిన విష్ణుమూర్తి విగ్రహం చేతులలో చక్రం, గద, శంఖం కల్గి ఉంటుంది. ఈ దేవాలయం లో అయన భార్య లక్ష్మీదేవి విగ్రహం,శివలింగాన్ని కూడా చూడవచ్చు. భృగుమహర్షి పాదముద్రలను కూడా ఇక్కడ భద్రపరిచారు.ఇక్కడ ప్రతి రోజు ధూప్ ఆరతి, కాకడ ఆరతి, మహాపూజ దూప్ ఆరతి అనే కొన్ని పూజలు నిర్వహించబడతాయి.ఆషాడ౦, కార్తిక ఏకాదశి పర్వదినాలు ఎంతో అకుంఠీత విశ్వాసంతో జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications