108 మీటర్ల ల పొడవు మరియు 38 మీటర్ల వెడల్పుతో శ్రీనగర్ లో చిన్న మొఘల్ ఉద్యానవనాలలో ఒకటి గా పరిగణించబడే చషం-ఎ-షాహీ ఉద్యానవనం,1632 లో స్థాపించబడిన ఒక పురాతన ఉద్యానవనం. “రాజ చలమ” (రాయల్ స్ప్రింగ్)అనే పేరుతో పిలవబడే ఈ తోట కాలువ, జలపాతాలు మరియు జలయంత్రాలు (ఫౌంటైన్లు) అని మూడు వేర్వేరు విభాగాలుగా విభజించబడింది.
ఈ తోట నెహ్రూ స్మారక ఉద్యానవనం సమీపంలో ఉంది. ఇది హిమాలయాలు మరియు దాల్ సరస్సు యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తుంది. కొన్ని అరుదైన జాతుల తో సహా ఇక్కడ వివిధ ఫలాలు మరియు పుష్పాలు పెరుగుతాయి. ఔషధ గుణం కలిగి ఉన్నదని నమ్మబడే ఈ తోట లో ప్రవహించే మంచినీటి చలమ పర్యాటకులను మరియు స్థానికులను విశేషంగా ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications