క్రీ.శ. 1400 లో నిర్మించబడ్డ జామా మసీదు శ్రీనగర్ లో అత్యంత పురాతన మసీదులలో ఒకటి. ఇది “శుక్రవారం మసీదు” గా సుప్రసిద్ధం. ప్రాచీన మసీదు కాలాంతరంలో ఎన్నో సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించబడింది. చివరి సారిగా మహారాజ ప్రతాప్ సింగ్ హయాం లో పునరుద్ధరించబడింది. ఈ ధార్మిక ప్రదేశం నిర్మాణం మహమ్మదీయ శైలి మరియు భారతీయ ముడి పదార్ధాల సంపూర్ణ సంగమం. బ్రిటిష్ భవనశిల్పుల చే అభివృద్ధి చేయబడిన ఈ నిర్మాణ శైలి ఇండో-సార్సెనిక్ నిర్మాణ శైలి గా పేరు గాంచింది. ఈ కారణం చేత, మసీదు యొక్క కొత్త భవంతి కి మహమ్మదీయ శైలి లో సాధారణంగా కనిపించే గుండ్రని గోపురం ఉండదు.
ఒక్కొక్కటి దేవదారు బోదె తో తయారు చేయబడిన 370 స్తంభాల ఆధారం తో ఉన్న ప్రార్ధనా మందిరం ఈ మసీదు యొక్క ప్రధాన ఆకర్షణ. మసీదు లోని ప్రశాంతత, చుట్టూ బజారుల్లోని హడావిడి మధ్య వ్యత్యాసం పర్యాటకులచే ప్రశంసలు పొందే లక్షణం. బహు విశాలమైన జామా మసీదుకి ఏక కాలం లో 30,000 మందికి వసతి అందించే సామర్ధ్యం ఉంది.



Click it and Unblock the Notifications