చత్తి పద్ షాహీ గురుద్వారా ఉండటం వల్ల శ్రీనగర్ లో రైనావారి సిక్కులకు ఒక పవిత్రమైన గమ్యస్థానంగా పరిగణిస్తారు. ఒక ప్రధాన ధార్మిక ప్రదేశమే కాకుండా చత్తి పద్ షాహీ గురుద్వారా ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కూడా. ఆరవ సిక్కు గురువు అయిన హర్ గోబింద్ సింగ్ ఈ గురుద్వారా నిర్మించాడని నమ్ముతారు. సిక్కు భక్తులు ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం కోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. గురు హర్ గోబింద్ సింగ్ కాశ్మీర్ మొత్తం ప్రయాణించారని మరియు రాష్ట్ర వ్యాప్తంగా అతను బోధించిన ప్రతి చోటా గురుద్వారాలు నిర్మించారని చెప్పబడుతున్నది. శ్రీనగర్ లోని చత్తి పద్ షాహీ గురుద్వారా ఇలాంటి ప్రదేశాల్లో ఒకటని భావిస్తున్నారు.
హరి పర్బత్ కోట లేదా మొఘల్ కోటకు దక్షిణాన ఉన్న ఈ గురుద్వారా సిక్కు సమాజంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. చత్తి పద్ షాహీ గురుద్వారా రాష్ట్రంలోని అన్ని గురుద్వారాలలో అతి ముఖ్యమైన గురుద్వారా గా పరిగణించబడుతుంది. అన్ని వైపులా కొండలు ఉండటం వల్ల రైనావారి సంవత్సరం పొడువునా ఆహ్లాదమైన చల్లని ఉష్ణోగ్రత తో ఉంటుంది.



Click it and Unblock the Notifications