పాలరువి జలపాతాలు కేరళ – తమిళనాడు సరిహద్దులలో వుంటాయి. పాలరువి అంటే పాల ధార అని అర్ధం చెపుతారు. నురగలు కక్కే ప్రవాహాలు వెండి రంగులో చల్లని ధారలతో చూచే వారికి ఒక అద్భు తంగా అనిపిస్తుంది. పాలరువి కొల్లం కు 75 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ నీటి స్వర్గాన్ని చేరాలంటే 4 కి.మీ. దూరం ట్రెక్కింగ్ చేయాలి. తేన్మలై సందర్శకులకు ఇది ఒక ప్రత్యెక ఆకర్షణ. చుట్టూ ఉండే జలపాతాలు అడవులును ఎల్లప్పుడూ పచ్చటి ప్రాంతంగా ఉంచుతాయి. .ఈ ౩౦౦ అడుగుల జలపాతాలకి స్థానికులు నిర్వహించే టూర్లు కలవు. ఇక్కడి డివిజనల్ ఫారెస్ట్ నుండి మ్యాపులు, ఫోటోగ్రాఫులు పొందవచ్చు. ఎంతో ఆకర్షణీయమైన ఈ ప్రదేశం యువకులకు, జంటలకు మరియు కుటుంబాలకు తగిన విహార ప్రదేశం.



Click it and Unblock the Notifications