పీచి లో ఉన్న ప్రశాంతత ను కలిగించే అనేకమైన ప్రదేశాలలో ఈ పీచి వైల్డ్ లైఫ్ సాంచురి ఒకటి. పలల్లిల్లి మరియు నేల్లింపతి అడవులని కలుపుకునే ఈ సాంచురి 125 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నది. 19 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం ప్రైవేటు ప్రాపర్టీ గా ఉండేది. 1958 వ సంవత్సరం నుండి ఈ ప్రాంతాన్ని సాంచురి గా పరిగణించారు.
త్రిశూర్ నుండి ఈ ప్రాంతం 23 కిలో మీటర్ల దూరంలో ఉంది. వైల్డ్ లైఫ్ సఫారీ కోసం వచ్చే వారి కంటే ఇక్కడ కనిపించే ఆకుపచ్చటి అడవుల అందాలని చూడడానికే వచ్చే పర్యాటకులు సంఖ్య ఎక్కువ. ఇక్కడున్న జలాశయం లో చేసే పడవ ప్రయాణంలో ఒడ్డున తిరిగే ఏనుగుల్ని చూసే అదృష్టం కూడా కలుగుతుంది. ఈ ప్రాంతం త్రిశూర్ నగరానికి చక్కగా అనుసంధానమై ఉంది. ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించడానికి ఎన్నో ప్రైవేటు బస్సులు అందుబాటులో కలవు.



Click it and Unblock the Notifications