బెంగుళూరు నగరం పలు ప్రదేశాలలో పవిత్ర రంజన్ మాసంలో రంజాన్ పండుగను అతి వైభవంగా జరుపుకుంటోంది. ప్రతి సాయంత్రం నగరంలో మనం అనేక మంది ముస్లిం సోదరులు ప్రార్ధనలు ముగించి తమ రంజాన్ ఉపవాసం విరమించేందుకు సిద్ధం అవుతూ పలు రకాల రుచికర ఆహారాల తయారీ దుకాణాల వద్ద తింటూ వుండటం లేదా పార్సెల్ కట్టింఛి తీసుకు వెళ్ళటం వంటివి చూస్తూనే ఉంటాము. ఇక ఈ ఆహారాలు తయారు చేసే వారు పోటీలు పది మరీ కస్టమర్ లకు అత్యంత రుచికర ఆహారాలు తయారు చేసి అందిస్తారు. ఘుమ ఘుమలాడే వాసనలు, వేడి వేడి ఆహారాలు, వివిధ రకాల రంగు రంగుల ఆహారాలు ప్రతి వారికి నోరు ఊరేలా చేస్తూ తక్షణం తినేసే లా కూడా చేస్తాయి. మరి ఈ రంజాన్ పండుగ సందర్భంగా అత్యంత రుచికర వీధి ఆహారాలు ఏమి తినాలి ? అవి ఎక్కడ దొరుకుతాయి ? అనేవి పరిశీలిద్దాం.

ఎం ఎం రోడ్, ఫ్రెజర్ టవున్
మాస్క్ రోడ్ లేదా ఎం ఎం రోడ్ గా పిలువబడే ఈ ప్రదేశం బెంగుళూరు సిటీ కి నడిబొడ్డున మెజిస్టిక్ కు సుమారు 7 కి. మీ. ల దూరంలో కలదు. ఈ రంజాన్ నెల అంతా ఈ వీధి పూర్తి బిజి. చల్లటి బెంగుళూరు వాతావరణానికి ఇక్కడ తయారు ఆయె వేడి వేడి ఆహారాలు తప్పక తినాల్సిందే. ఈ వీధి పూర్తిగా చిన్న చిన్న ఆహార దుకాణా లతో మసీదు చుట్టుపక్కల విస్తరించి వుంటుంది. సమీపంలోనే కొన్ని పెద్ద హోటళ్ళు , రెస్టారెంట్ లు కూడా కలవు. ఈ బిజి వీధిలో మొదటగా మీరు నడిచేందుకు అలవాటు పడాలి. ఆపై మంచి సువాసనల వేడి వేడి ఆహారాలు పొట్టకు పూర్తిగా తిని ఆనందించాలి. ఈ ఆహారాలు ప్రధానంగా మాంసాహార డిష్ లు గా తయారు చేస్తారు. కనుక ప్రతి మాంసాహారి వీటిని రుచి చూడకుండా ఉండలేడు.
Photo Courtesy: Devika

ఎం ఎం రోడ్, ఫ్రెజర్ టవున్ ఆహారాలు
ఇక్కడి దుకానాలలోని ఆహారాలలో సమోసా ల నుండి పత్తర్ కా ఘోస్ట్ అనబడే మాంసాహార వంటకం వరకూ లభిస్తాయి. వివిధ రకాల కబాబ్ లు, బిర్యానీలు, స్టాఫ్ పరోటాలు, రోల్స్ మరియు స్వీట్లు ప్రసిద్ధి. తీపి వంటకాలు రసమలాయి నుండి కప్ కేక్ వరకూ లభిస్తాయి. మరి వీధి ఫుడ్ కదా...చీప్ అనుకుంటున్నారా ? కానే కాదు ఒక్కొక్క డిష్ మీకు సుమారుగా రూ.200 వరకూ కూడా వుంటుంది.
Photo Courtesy: Lee Sam

రస్సెల్ మార్కెట్, శివాజీ నగర్
బెంగుళూరు లో ఆశ్చర్యం ఏమంటే, రంజాన్ నెలలో రుచికర వంటకాలు లభించే ప్రదేశాలు అనేకం కలవు. ఇఫ్తార్ ను ఘనంగా జరిపే ప్రదేశాలలో శివాజీనగర్ లోని రస్సెల్ మార్కెట్ ఒకటి. ఇది మెజెస్టిక్ కు సుమారు 5.3 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ హలీం అనే మాంసాహార వంటకం ప్రసిద్ధి.
Photo Courtesy: Amy Stephenson

రస్సెల్ మార్కెట్, శివాజీ నగర్
రస్సెల్ మార్కెట్ లో ఇరువైపులా అనేక దుకాణాలు వరుసగా వుంది మీకు అద్భుత తిండి వాతావరణం కలిగిస్తాయి. ఒక్క సాయంత్రంలో సుమారు వేయి స్టాఫ్ పరోటాలు విక్రయించే దుకాణాలు కూడా కలవు. ఇక్కడి ఆహారాలలో కబాబ్ లు, బిర్యాని లు ప్రసిద్ధి. సాయంత్రం 7 గంటలకు వేలేతే చాలు రుచి కర పాయ, శీక్ ఫల కబాబ్ లు, మతాన్ కూర్మాలు ఒంటె మాంసం మొదలైనవి లభిస్తాయి. అయితే ఇక్కడి ఆహాల రేట్ లు సమంజసమే. సెర్వింగ్ చాలా ఫాస్ట్. అన్నీ తిని వేడి కప్పు సులైమాన్ చాయ్ తాగటం మరువకండి సుమా !
Photo Courtesy: Shamaasa

తిలక్ నగర్
ఈ రంజన్ మాసంలో తిలక్ నగర్ ప్రదేశానికి తప్పక వెళ్లి రుచికర ఆహారాలు తినాల్సిందే. ఈ ప్రదేశం అంతా జయనగర్ మరియు జే పి నగర్ ముస్లిం సోదరుల తో కిక్కిరిసి వుంటుంది. ఈ ప్రదేశంలో సమోసా, రోటి, అనేక మామ్సాహారాలు దొరుకుతాయి.
Photo Courtesy: Kalyan Kanuri

తిలక్ నగర్
ఇక్కడ మీరు చికెన్ మరిఉ మతాన్ కబాబ్ లు తినటం మరువకండి. వివిధ రకాల బిర్యానీలు, కూర్మాలు కూడా లభిస్తాయి. బెంగుళూరు లోని ప్రతి ఇఫ్తార్ విందు ఒక విశిష్ట ఆహారం అందిస్తుంది. తీపి ఆహారాలలో గులాబ్ జామూన్ లు, జిలేబి లు , ఫెర్ని మొదలైనవి దొరుకుతాయి. Photo Courtesy: Reedz Malik

మరువలేని ఆహార రుచుల
మరువలేని ఆహార రుచుల అనుభూతులకు పైన చెప్పిన బెంగుళూరు లోని మూడు ప్రదేశాలు రంజాన్ మాసంలో తప్పక విహరించి తినాలి. మీరు స్వంత వాహనం లేదా ఆటో లలో పై ప్రదేశాలకు వెళ్ళవచ్చు. ఇవే కాక, బెంగుళూరు లో ఇంకనూ అనేక ప్రదేశాలలో చిన్నపాటి ఇఫ్తార్ దావత్ లు నోరూరే రుచుల ఆహారాలతో లభిస్తాయి. మరితప్పక ట్రై చేస్తారు కదూ...!
Photo Courtesy: Reedz Malik



Click it and Unblock the Notifications














