Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు అపురూప ఆకర్షణలు ! (పార్ట్ -2)

బెంగుళూరు అపురూప ఆకర్షణలు ! (పార్ట్ -2)

బెంగుళూరు మహా నగరంలో అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు కలవు. సాధారణంగా వీటిని ప్రతి ఒక్కరూ తమ సందర్శనలో చూసి ఆనందిస్తారు. అయితే, అతి త్వరగా పర్యాటకులు వెళ్ళని ఆకర్షణీయ, ఆసక్తి కల ప్రదేశాలు కలవు. వాటిలో కొన్నిటిని పరిశీలిద్దాం.

రంగ శంకర
బెంగుళూరు లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు' రంగ శంకర' ఒక మంచి థియేటర్. రోజుకి ఒక నాటకం అనే పాలసీ తో దీని యాజమాన్యం దీనిని నడుపుతోంది. ఈ థియేటర్ ను ప్రముఖ సినీ నటుడు , డైరెక్టర్ అయిన శంకర్ నాగ్ రూపొందించగా, ఇపుడు దీనిని అరుంధతి నాగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజూ ఒక షో నడుస్తుంది. సోమవారాలు థియేటర్ కు సెలవు రోజు. స్టేజి నాటకాలను అభిమానించేవారు రంగ శంకర థియేటర్ నిర్వహణను ప్రశంసిస్తారు. దేశంలోని డ్రామా థియేటర్ లలో రంగ శంకర ఒకటి. ఇక్కడ బాలీవుడ్ స్టైల్ డాన్స్ లు అనుమతించరు. ఈ థియేటర్ బెంగుళూరు లోని జే.పి నగర్ ౩వ క్రాస్ లో కలదు.

చౌడయ్య మెమోరియల్ హాల్
చౌడయ్య ఒక గొప్ప వయోలిన్ విద్వాంసుడు. ఈ కళాకారుడి జ్ఞాపకార్ధం ఈ థియేటర్ ను నిర్మించారు. ఈ వయోలిన్ కళాకారుడి పేరుపై నిర్మించిన ఈ థియేటర్ వయోలిన్ ఆకారంలో వుంటుంది. ఈ థియేటర్ లో కూడా నాటకాలు, డాన్స్ ప్రోగ్రాం లు జరుగుతాయి.
చౌడయ్య మెమోరియల్ హాల్ బెంగుళూరు లోని మల్లేస్వరం 2 వ మెయిన్ రోడ్ లో కలదు.

వెంకటప్ప ఆర్ట్ గేలరీ
కళా ప్రియులకు బెంగుళూరు లోని వెంకటప్ప ఆర్ట్ గేలరీ తప్పక చూడవలసిన థియేటర్. ఈ ప్రదేశం ఒక మ్యూజియం గా కూడా ప్రదర్శించ బడుతోంది. సేకరించబడిన అనేక కళాకారుల పెయింటింగ్ లు ఇక్కడ ప్రదర్శిస్తారు. వీటిలో ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ లు కూడా కలవు. మథుర, ఖజురాహో ల నుండి కూడా కొన్ని పురాతన రాతి శిల్పాలను, సింధు నాగరికతకు చెందిన కొన్ని కలాక్రుతులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. వెంకటప్ప ఆర్ట్ గాలరీ కస్తుర్బా రోడ్ లోని కబ్బన్ పార్క్ లో కలదు.

గాలరీ ఎస్ కే ఇ
దీనిని సునితా కుమార్ ఏమ్మర్ట్ గాలరీ లేదా ఎస్ కే ఇ గాలరీ అంటారు. దీనిలో ఆధునిక ఇండియన్ ఆర్ట్ ప్రదర్శిస్తారు. ఈ గాలరీ ని మన దేశంలోని వారే కాక విదేశాలనుండి కూడా కళాకారులు వచ్చి చూస్తారు. ప్రదర్శనా వస్తువులు, కళాభిమానులలో ఆలోచనను, ఉత్సుకతను ప్రేరేపిస్తాయి. ప్రసిద్ధ ఆర్టిస్ట్ లు అయిన భారతి ఖేర్, సుదర్శన్ శెట్టి ల పెయింటింగ్ లు కూడా కలవు. ఈ గాలరీ లంగ్ఫోర్డ్ టౌన్ లోని బెర్లీ స్ట్రీట్ లో కలదు.

గాలరీ టైం అండ్ స్పేస్
ఈ గాలరీ ని సామాన్యులకు నేటి రోజులలో ఆర్ట్ దాని ప్రాధాన్యత లను గురించి తెలియ చెప్పేందుకు స్థాపించారు. ఒక చారిత్రాత్మక బంగాళా పక్కనే కల ఈ గాలరీ కళా ప్రశంసల కోర్సులకు, ఆర్టిస్ట్ డైలాగ్స్ కు, ఫిలిం స్క్రీనిన్గ్స్ , గ్రూప్ చర్చలకు ఉపయోగిస్తారు. ఈ గాలరీ లవేల్లె రోడ్ లో కలదు.

నేషనల్ గాలరీ అఫ్ మోడరన్ ఆర్ట్
ఈ కళా సంస్థ మైసూరు రాజ కుటుంబానికి చెందినది. సుమారు 3.5 ఎకరాల భూమి లో వుంది. సుమారు 500 పైగా ప్రదర్శక కళాకృతులు కలిగి వుంది. దీనిలో రాజ రవి వర్మ, జామిని రాయ్, అమ్రిత షేర్ గిల్, రవీంద్రనాథ్ టాగోర్ వంటి ప్రసిద్ధ కళాకారుల చిత్రాలు చూడవచ్చు. వీటితో పాటు ఆధునిక కళాకారుల పెయింటింగ్ లు కూడా కలవు. ఈ ప్రదేశంలో ఫిలిం స్క్రీనింగ్ , డాన్స్ ప్రోగ్రాం, కళాకారుల ఆకృతుల చర్చలు జరుగుతాయి. ఇది పాలస్ రోడ్ లోని మనిక్యవేలు భవనంలో కలదు.

బెంగుళూరు పర్యటనలో ఇంకా సమయం ఉందనుకుంటే...

లాల్ బాగ్ గ్లాస్ హౌస్

చారిత్రాత్మక గార్డెన్, లాల్ బాగ్ సందర్శించండి. దీనిలోని గ్లాస్ హౌస్ ను మైసూరు పాలకుడు హైదర్ అలీ నిర్మించాడు. లాల్ బాగ్ సుమారు 188 ఎకరాల విస్తీర్ణంలో ఉంటంది. లాల్ బాగ్ లో ప్రధాన ఆకర్షణ గ్లాస్ హౌస్. లండన్ లోని క్రిస్టల్ పాలస్ నమూనా లో రూపొందించారు. దీనిలో ప్రతి సంవత్సరం రెండు మార్లు పూవులా ప్రదర్శన అతి వైభవంగా జరుగుతుంది.

కబ్బన్ పార్క్
బెంగుళూరు ను గార్డెన్ సిటీ అంటారు. దానికి కారణం కబ్బన్ పార్క్. అధికారికంగా దీనిని శ్రీ చమరాజేంద్ర పార్క్ అంటారు. ఇది సుమారు ౩౦౦ ఎకరాల విస్తీర్ణంలో అనేక వృక్షాలు తో కలదు. సాయంత్రం అయ్యేసరికి స్థానికులు ఇక్కడ వేగవంతమైన కాలి నడకలు చేయటం చూస్తారు.

బెంగుళూరు అపురూప ఆకర్షణలు !

బెంగుళూరు టర్ఫ్ క్లబ్
అదృష్టం ఉందా ? అయితే వెంటనే బెంగుళూరు టర్ఫ్ క్లబ్ కు వెళ్ళండి. సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో కల ఈ టర్ఫ్ క్లబ్ లో సంవత్సరం పొడవునా గుర్రపు పందేలు నడుస్తాయి. ముందుగా రేస్ షెడ్యూల్ చూసుకోండి. అక్కడ అందరూ తమకు ఇష్టమైన గుర్రాలపై పందేలు కాసి ఆనందిస్తూ వుంటారు. మీరు కూడా వారిలో ఒకరైపొండి. ఇక్కడ అంతా హై సొసైటీ వారే. అధిక మొత్తాలలో కూడా బెట్టింగ్ లు జరుగుతాయి. కొంత సొమ్ము ఖర్చుపెట్టి ఉత్సాహం ఉరకలు వేయించండి. గుర్రం పై స్వారీ చేయాలని ఉందా ? ధనికుల ఆట అయిన పోలో అదండీ. లేదా ఈ క్లబ్ నడిపే శిక్షణా తరగతులలో చేరి ఆనందించండి.
బెంగుళూరు టర్ఫ్ క్లబ్ రేస్ కోర్స్ రోడ్ లో కలదు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+