Search
  • Follow NativePlanet
Share
» »సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయ రహస్యాలు

సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయ రహస్యాలు

గవి గంగాదేవి ఆలయం కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో గవి పురంలో ఉన్నది. బెంగళూరు నగర నిర్మాత కెంప గౌడ, గవి గంగాదేశ్వర గుహాలయం నిర్మించాడు. గుడిలో ప్రధాన దైవం శివభగవానుడు. ఇందులో అరుదుగా కనిపించే,

గవి గంగాదేవి ఆలయం కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో గవి పురంలో ఉన్నది. బెంగళూరు నగర నిర్మాత కెంప గౌడ, గవి గంగాదేశ్వర గుహాలయం నిర్మించాడు. గుడిలో ప్రధాన దైవం శివభగవానుడు. ఇందులో అరుదుగా కనిపించే, పూజించే అగ్ని దేవుని విగ్రహం ఉన్నది. ఈ అగ్ని దేవుని విగ్రహంతో పాటు మరో 33 విగ్రహాలు కూడా గుహాలయంలో ఉన్నాయి. ఒకే రాతి తో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళ, వాస్తు శైలి కలిగి ఉంది.

బెంగళూరులో ఉన్న వారికి ఈ ఆలయం గురించి తెలుసుంటుంది. కర్ణాటకలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయ దర్శనానికి విచ్చేస్తుంటారు. ఈ ఆలయంలోని అనేక అపురూపమైన సంగతులు చాలా మందికి తెలియదు. ఇంతట ప్రసిద్ది చెందిన దేవస్థానం గురించి మనం తెలుసుకుందాం..

గుహలోపల శివుడు

గుహలోపల శివుడు

గుహలోపల శివుడు వెలసి ఉంటాడు కనుక శివుని తలలో గంగను అలంకరించుకోవడం వల్ల ఈ ఆలయానికి గవి గంగాధరేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఇంకా ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఒక పక్కగా చిన్న గుంత ఉంది. ఇందులో నిత్యం గంగాజలం ఊరుతూ ఉంటుంది. గంగా ప్రవాహం ఉండటం వల్లే ఇక్కడ దక్షిణామూర్తి గంగాధరేశ్వరుడిగా కొలువయ్యాడని ప్రతీతి.

PC:Raj.shimoga

ఈ గవి గంగాధరుడిని దర్శించడం వల్ల

ఈ గవి గంగాధరుడిని దర్శించడం వల్ల

ఈ గవి గంగాధరుడిని దర్శించడం వల్ల ఆత్మలింగాన్ని దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఆలయం 16వ శతాబ్ధంలో నిర్మితమైనది. భారత దేశంలోని రాతి కట్టడాల్లో గవి గంగాధరేశ్వరుడి ఆలయం ఒకటిగా చెప్పవచ్చు.

PC: Manjeshpv

ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏక శిలా శిల్పాలున్నాయి.

ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏక శిలా శిల్పాలున్నాయి.

ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏక శిలా శిల్పాలున్నాయి. ఈ ఆలయాన్ని ఏక శిలా రాతితో కట్టడం జరిగింది. ఈ ఆలయం ఒకే నల్లరాతితో చెక్కిన అత్యధ్బుత శిల్ప కళాఖండం.

PC: Manjeshpv

పూర్వకాలంలో

పూర్వకాలంలో

పూర్వకాలంలో బరద్వాజ్ ముని గౌతమ మహర్షి ఇద్దరూ ఇక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది. వారు ఇద్దరూ వేకువ జామునే వారణాసిలో పూజ ముగించుకుని మధ్యహన సమయంన గవిపురంలో పూజ చేసుకుని, సాయంత్రానికల్లా శివగంగలో మూడు సార్లు పూజను చేసేవారు.

PC:Dineshkannambadi

ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని

ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని

ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని చెబుతుంటారు. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ ముఖంగా ఉండటం విశేషం. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కుడివైపున ఆశీనురాలై పూజలందుకుంటోంది.

Photo Courtesy : Dineshkannambadi

 ప్రతి మకర సంక్రాంతి రోజున

ప్రతి మకర సంక్రాంతి రోజున

బెంగళూరులో గవి గంగాధరేశ్వర స్వామి సన్నిధానంలో ప్రతి మకర సంక్రాంతి రోజున సూర్య రశ్మి శివలింగాన్ని స్పర్శిస్తుంది. ఈ సుందర ద్రుశ్యాన్ని చూడటానికి ప్రజలు చుట్టుపక్కల నుండి వచ్చి వీక్షిస్తుంటారు. స్వయంగా సూర్యుడే ఈ సంక్రాంతి రోజున సాయంత్రం 5గంటల నుండి 5.20నిముషాల మద్యలో సూర్యుడు శివలింగాన్ని స్పర్శించి పూజిస్తాడు. ఈ ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 : 30 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 : 30 వరకు ఈ గుహాలయాన్ని దర్శించవచ్చు.

PC: youtube

ఈ శివాలయంలో శివున్ని దర్శించాలంటే ముందుగా

ఈ శివాలయంలో శివున్ని దర్శించాలంటే ముందుగా

ఈ శివాలయంలో శివున్ని దర్శించాలంటే ముందుగా నందీశ్వరున్ని దర్శించి తర్వాత ఆయన కొమ్ముల మద్య నుండి శివున్ని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. నందీశ్వరుడు హిందూ దర్మానికి ప్రతీకగా ఉన్నాడు. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి మరొకటి సుదర్శన చక్రానికి నిదర్శనంగా చెబుతారు.

PC: youtube

లింగరూపంలో ఉన్న పరమేశ్వరున్ని దర్శించాలంటే

లింగరూపంలో ఉన్న పరమేశ్వరున్ని దర్శించాలంటే

లింగరూపంలో ఉన్న పరమేశ్వరున్ని దర్శించాలంటే, ముందుగా నందీశ్వరున్ని పువ్వులతో పూజించి తర్వాత ఎడమ చేతి వేళ్ళను ఆయన కొమ్ములపై ఉంచి గోపురంపై తల వుంచి నందీశ్వర కొమ్ముల మద్య నుండి శివ దర్శనం ఏకాగ్రతతో చేసుకోవాలి. ఇలా దర్శించడం వల్ల మనం కోరిన కోరికలు నిజం అవుతాయి.

PC: youtube

గవి గంగాధరేశ్వర ఆలయంలో

గవి గంగాధరేశ్వర ఆలయంలో

గవి గంగాధరేశ్వర ఆలయంలో రెండు స్వరంగాలున్నాయి. ఒకటి కాశీ నుండి రావడానికి మరొకటి శివగంగకు వెళ్ళడానికి. పూర్వం భరద్వాజముని, గౌతమ మహర్షి కాశీ నుండి స్వరంగ మార్గం గుండా గవి పురానికి వచ్చి ఇక్కడ పూజ ముగించుకుని తిరిగి సాయంత్రం పూజకు శివగంగకు స్వరంగం గుండా వెళ్లేవారని మన పురాణాలు చెబుతున్నాయి.

Photo Courtesy : Dineshkannambadi

భారతదేశంలో

భారతదేశంలో

భారతదేశంలో ప్రాచీన గ్రుహాంతర దేవాలయాలలో గవి గంగధేశ్వర దేవాలయం ఒకటి.

PC: Pavithrah

ఆలయ విశిష్టత:

ఆలయ విశిష్టత:

ఈ ఆలయంలోని ఉద్భవ మూర్తి యందు ఒక విశిష్టత ఉన్నది. అదేంటంటే లింగ భాగం వేరుగా సోమ సూత్రం వేరుగా ఉంటుంది. లింగ భాగం అనగా పరమేశ్వరునికి ప్రతీక. అయితే సోమ సూత్రం పార్వతీ దేవి అని చెప్పవచ్చు.

PC: Pavithrah

ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు

ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు

ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు లింగరూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడ శివలింగాన్ని దర్శిస్తే, కైలాసంలోని పార్వతీపరమేశ్వరులను దర్శించినంత పుణ్యం కలుగుతుంది భక్తుల నమ్మకం. ఏకాంతంగా ఒకే దేవాలం ఉంటే దానిని దేవాలయం అనరు. ఈ ఆలయంలో గణపతి, సుబ్రమణ్యేశ్వర స్వామి, చండికేశ్వర, నందీశ్వర, పార్వతీదేవి, నవగ్ర ఉపాలయాలు వంటి పరివార దేవుళ్ళు ఉన్నారు.

PC: youtube

గర్భ గుడి ప్రాకారం చుట్టూ ఇంద్రాణి,

గర్భ గుడి ప్రాకారం చుట్టూ ఇంద్రాణి,

గర్భ గుడి ప్రాకారం చుట్టూ ఇంద్రాణి, వారాహి, వైష్ణవి, చాముండి, కౌమారి, మహేశ్వరి, బ్రాహ్మీ మొదలైన సప్తమాతృకల ఏకశిలా విగ్రహాలున్నాయి.

PC: youtube

కార్తీక మాసంలో ఇక్కడ

కార్తీక మాసంలో ఇక్కడ

కార్తీక మాసంలో ఇక్కడ స్వామికి విశేష అలంకారాలు, వివిధ రకాల అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మాఘమాసంలో బ్రహ్మరథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటితో పాటు విశిష్ట దుర్గాహోమాలు, చండికా హోమాలు, రుద్రాభిషేకాలు, నవగ్రహ శాంతులూ మొదలైన కార్యక్రమాలను ప్రతి రెండు సంవత్సరాలకొకసారి నలభూ ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు.

PC: Manjeshpv

 ప్రాతహ: కాలంలో

ప్రాతహ: కాలంలో

ప్రాతహ: కాలంలో కాశీలో పూజచేసి స్వరంగ మార్గాన గౌతమ ముని, భరద్వాజ మునులు మద్యహ్నాం గవి పురానికి వచ్చే వారు. మద్యహ్నాం పూజ ముగించుకుని, తిరిగి సాయంత్రం శివ గంగకి ఈ ఆలయం స్వరంగ మార్గం ద్వారా వచ్చేవారు.

PC: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

గవి గంగాధరేశ్వరుడిని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులోని ప్రధాన బస్ స్టేషన్, రైల్వేస్టేషన్లు ఎదురెదురుగానే ఉంటాయి. అక్కడి నుండి లోకల్ బియంటిసి బస్సుల్లో ప్రయాణించి రామకృష్ణ ఆశ్రమం దగ్గర దిగి, ఈ ఆలయానికి నడిచి వెళ్లొచ్చు. విమాన మార్గంలో : ఎకిర్ పోర్ట్ కి సుమారు 35కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

PC: youtube

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+