Search
  • Follow NativePlanet
Share
» »వైజాగ్ నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలంటే ఇక్క‌డికి వెళ్లండి!

వైజాగ్ నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలంటే ఇక్క‌డికి వెళ్లండి!

వినోద‌భ‌రిత‌మైన రోజు గ‌డ‌వాలంటే వైజాగ్ వెళ్లాలి. ఫైవ్ స్టార్ హోట‌ల్స్ నుంచి మిరుమెట్లుగొలిపే నైట్ క్ల‌బ్‌ల‌వ‌ర‌కూ ఇక్క‌డ లేనిది లేదు. మ‌రీ ముఖ్యంగా స్నేహితులతో కలిసి స‌ర‌దాగా స‌మ‌యం గ‌డ‌పాలంటే మాత్రం ఈ అంద‌మైన తీర ప్రాంత న‌గ‌రం మీకు వేదిక‌నే చెప్పాలి. ఈ నగరంలోని అనేక క్లబ్‌లు, బార్‌లు నైట్ లైఫ్ పరంగా అనేక స‌రికొత్త అనుభవాల‌ను మీకు ప‌రిచ‌యం చేస్తుంది. ఉల్లాసభ‌రిత‌మైన‌ రాత్రి కోసం ఎదురుచూసేవారి కోసం విశాఖ న‌గ‌రం నిత్యం ఆహ్వానం ప‌లుకుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే విశాఖ ప‌ర్యాట‌క అందాల‌ను ఆస్వాదించాల‌నుకునేవారు ఇక్క‌డి నైట్ లైఫ్‌ను మిస్స‌వ్వ‌కుండా ఉండాలంటే ఈ స్పాట్‌ల‌ను అస్స‌లు మిస్స‌వ్వొద్దు.

Vizag

ఐరన్ హిల్

మీరు వైజాగ్ సిటీలో క్రాఫ్ట్ బీరు రుచిని ఆస్వాదించాల‌నుకుంటే మాత్రం ఐరన్ హిల్‌లో అడుగుపెట్ట‌కుండా వెళ్లొద్దు. ఏపీలోని మొట్ట‌మొద‌టి మైక్రో బ్రూవ‌రీగా చెప్పుకునే వైజాగ్ సిగ్నేచ‌ర్ బ్రూలుతోపాటు స్థానిక రుచుల‌ను టేస్ట్ చేస్తూ.. ఇక్క‌డి కాక్‌టెయిల్‌ను ఆస్వాదిస్తే ఆ మాయాజాలాన్ని మాటల్లో చెప్ప‌లేం. ఇక్క‌డి ఫ్రూట్ జూస్‌ల‌తో నోరూరించే లాగర్లు, బీర్లు తాజాగా తయారుచేసిన పానీయాలతో రూపొందించే ఆర్డ‌ర్ మీకు స‌రికొత్త అనుభ‌వాన్ని చేరువ చేస్తాయి. లోక‌ల్‌లో ల‌భించే ఐదు విభిన్న వంటకాలతో మీ ముందుకు వ‌చ్చే డిష్ జీవితంలో గుర్తుండిపోయేలా చేస్తాయి. విన‌సొంపైన డీజే మీ మ‌న‌సుకు అధ‌న‌పు ఆహ్లాదాన్ని చేరువ చేస్తుంది.

సిటీ లైఫ్‌లో స‌రికొత్త అనుభ‌వాన్ని పొందాలంటే మాత్రం వైజాగ్‌లోని సిరిపురంలో ఉన్న‌ MYZ - UNOకి వెళితే స‌రిపొతుంది. బెల్జియం నేపథ్య ఉన్న‌ మైక్రోబ్రూవరీతోపాటు భారతీయ, కాంటినెంటల్ రుచులను మిళితం చేసే ఫ్యూజన్ వంటకాలతో ఈ ప్రదేశం విభిన్న రుచులను అందిస్తుంది. తాజా బీర్‌తోపాటు స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి విదేశాల‌ నుండి దిగుమతి చేసుకున్న వైన్లు మీకు స‌రికొత్త అనుభూతుల‌ను ప‌రిచ‌యం చేస్తాయి. MYZ - UNO వైజాగ్ కచేరీల‌తో జీవితంలో మ‌ర్చిపోలేని మ్యూజిక్ నైట్ లైఫ్‌ను అందిస్తాయి. మ్యారేజ్ డే, బ‌ర్త్‌డే లాంటి ప్రత్యేక సందర్భాల‌లో MYZ - UNO సరైన గమ్యస్థానంగా గుర్తింపు పొందింది.

Vizag

వైజాగ్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ బీచ్ రోడ్‌లోని విలాసవంతమైన పబ్ QUBAA. మీరు రాత్రిపూట డ్యాన్స్ చేయాలనుకుంటూ ఎంజాయ్ చేయాల‌నుకుంటే మాత్రం ఇదే సరైన స్పాట్ అని చెప్పొచ్చు. QUBAA విశాలమైన డ్యాన్స్ ఫ్లోర్‌తో జీవితంలో మ‌ర్చిపోలేని వాతావరణాన్ని అందిస్తూ.. అధునాతనమైన, శక్తివంతమైన మ్యూజిక్ సిస్ట‌మ్‌తో మిమ్మ‌ల్ని అక‌ట్టుకుంటుంది. బార్‌లో ఆల్కాహాల్ రుచుల‌ను ఆస్వాదిస్తూ.. సరికొత్త డిష్‌ల‌ను రుచిచూడ‌డంతోపాటు బాలీవుడ్, హాలీవుడ్ హిట్ సాంగ్స్‌ను వింటూ ప్ర‌శాంత‌మైన క్ష‌ణాల‌ను గడిపేందుకు ఇది స‌రైన వేదిక‌.

మీరు క్రీడా ప్రియులైతే మాత్రం విశాఖ‌లోని Tap The Sports Barలో అడుగుపెట్ట‌డం అస్స‌లు మిస్స‌వ్వొద్దు.
కొన్ని రుచికరమైన ఆహారాన్ని టేస్ట్ చేస్తూ.. విన‌సొంపైన‌ సంగీతాన్ని ఆస్వాదించడానికి Tap The Sports Bar సరైన ఎంపిక‌. ఇది వరుణ్ బీచ్ ఐనాక్స్ బిల్డింగ్‌లో ఉంది. సౌకర్యవంతమైన ఫర్నిచర్‌తో ఆధునిక తాజా డిజైన్‌తో ఇది సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. మీరు ప్ర‌శాంత‌మైన స‌మ‌యాన్ని గ‌డ‌పాల‌నుకుంటే మాత్రం Tap The Sports Bar మీకు ఆహ్వానం ప‌లుకుతుంది.

More News

    Read more about: vizag andhra pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+