Search
  • Follow NativePlanet
Share
» »మదురై మీనాక్షి అమ్మను దర్శించి, ఈ ప్రదేశాలు చూడకపోతే చాలా మిస్ అవుతారు..

మదురై మీనాక్షి అమ్మను దర్శించి, ఈ ప్రదేశాలు చూడకపోతే చాలా మిస్ అవుతారు..

భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం. భారతదేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన నగరం. ఈ నగరం పర్యాటకులను ఆకర్షిచే విషయంలో మాత్రం ముందుటుంది.

భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం. భారతదేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన నగరం. ఈ నగరం పర్యాటకులను ఆకర్షిచే విషయంలో మాత్రం ముందుటుంది. మధురైని తరచుగా ది సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తారు. ఈ నగరానికి ఉత్తర దిక్కున సిరుమలై హిల్స్ మరియు దక్షిణాన నాగమలై హిల్స్ ఉన్నాయి. ఈ నగరానికి మదురై అనే పేరు 'మధుర' అనే మాట నుండి వొచ్చింది. మధుర అంటే 'తీపి' అని అర్థం. ఈ నగరం మీద శివుడు దివ్యమైన తేనె వర్షం కురిపించాడని చెపుతారు.

తమిళనాడు రాష్ట్రం దేవాలయాలకు పుట్టినిల్లు. అలా వెంటనే గుర్తొచ్చే దేవాలయాల్లో మధురైలోని మీనాక్షి దేవాలయం, చిదంబారంలోని నటరాజస్వామి దేవాలయం, కంచిలోని కామాక్షి దేవాలయం.అత్యంత ఎత్తైన గోపురాలతో నిర్మితమై ఉన్న దేవాలయాలతో నిండి ఉంది.

మధురై అనగానే మీనాక్షిఅమ్మవారి ఆలయం గుర్తువస్తుంది. ఆ ఆలయం వైగై నది ఒడ్డున ఉంది. నేడు ఈ అందమైన నగరం ఒక ప్రసిద్ద వాణిజ్య మరియు విద్యా కేంద్రంగా ఉద్భవించింది. మదురై ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక ప్రదేశం.

అలా దేవాలయాలే కాకుండా చల్లటిప్రదేశాలు ఈ రాష్ట్రం సొంతం.సెలవుల్లో సేదతీరాలంటే దక్షిణభారతదేశంలో వెంటనే గుర్తొచ్చేవి ఊటీ, కొడైకెనాల్ ఎర్కాడ్ లాంటి సీతల ప్రదేశాలు. ఎక్కడికి వచ్చే పర్యాటకులను తమ అందాలతో కట్టి పడేస్తాయి ఈ ప్రాంతాలు. ఇంకా ఈ రాష్ట్రంలో జలపాతాలు, అడవులు ఇలా ఎన్నో ఉన్నాయి. వాటి గురంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అలగార్ కోవిల్:

అలగార్ కోవిల్:

అలగార్ కోవిల్ మదురైకి సుమారు 20కిమీ దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంది. ఈ ఆలయంలో రాతి శిల్పాలకు, చెక్కడాలకు ప్రసిద్ధి. విష్ణు మూర్తి వివిధ భంగిమల్లో అద్భుతరూపం కలిగి ఉన్నాడు. మదురై చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాల్లో తప్పక చూడాల్సిన వాటిలో ఈ అలగార్ కోవిల్ ఒకటి.

Photo Courtesy: TAMIZHU

మీనాక్షి అమ్మన్ టెంపుల్:

మీనాక్షి అమ్మన్ టెంపుల్:

మీనాక్షి అమ్మన్ దేవాలయం లేదా మీనాక్షి దేవాలయంలో మీనాక్షి రూపంలో పార్వతిదేవీ, శివుడు కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం కేవలం మదురైలోనే కాదు, దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయం. పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడు పార్వతీ దేవిని కళ్యాణమాడుటకు ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెబుతారు.

Photo Courtesy: Jorge Royan

గాంధీ మ్యూజియం:

గాంధీ మ్యూజియం:

భారత దేశంలో ఉన్న ఐదు గాంధీ మ్యూజియంలలో ఒకటి మదురైలో ఉంది. ఈ మ్యూజియంలో గాంధీకి సంబంధించిన అనేక వస్తువులు ఇక్కడ భద్రపరిచినట్లు చెబుతారు. ఈ మ్యూజిలో గాంధీకి సంబందించిన అనేక ఫోటోలు ఉన్నాయి. దీన్ని పురాతన ప్యాలెస్ లో ఎర్పరచారు. గాంధీ మరణంతో ఈ ప్యాలస్ ను మ్యూజియంగా మార్చబడింది.

Photo Courtesy: Vegpuff

గోరిపలయం దర్గా:

గోరిపలయం దర్గా:

మదురై నగరంలో గోరిపలయం దర్గా ఒక పెద్ద మసీదు. ఈ దర్గా వాగాయి నదికి ఉత్తర దిశలో ఉంది. ఈ దర్గాను 13వ శతాబద్దంలో తిరుమలై నాయక్ నిర్మించారు. ఈ దర్గాలో ఇద్దరు ముస్లిం ప్రవక్తల సమాధులు ఉన్నాయి. ఈ దర్గా ప్రత్యేతక ఏంటంటే 70అడుగుల వ్యాసంతో 20 అడుగుల పొడవుతో ఒకే రాతితో నిర్మిపబడ్డాయి. ప్రతి సంవత్సరం ఉర్స్ పండగ ఘనంగా జరుపుకుంటారు.

Photo Courtesy: Wasifwasif

తిరుమలై నాయకర్ ప్యాలెస్:

తిరుమలై నాయకర్ ప్యాలెస్:

తిరుమలైన నాయకర్ ప్యాలెస్ ను 16వ శతాబ్దంలో ఇండో సార్సెనిక్ శైలిలో తిరుమలై నాయకర్ నిర్మించాడు. ఈ ప్యాలెస్ లో తిరుమలైన నాయకర్ మరియు సిలాపతికరంలకు సంబంధించిన లైట్ మరియు సౌండ్ షో ఒకటి చూపుతారు. ఈ ప్యాలెస్ గోడలపై శ్రీ మహావిష్ణువు మరియు శివుడి యొక్క జీవిత గాధలు చెక్కబడి ఉన్నాయి.ఈ ప్యాలస్ యొక్క శిల్పశైలి అద్భుతంగా ఉంటుంది.

Photo Courtesy: Jomesh

పజముదిర్ చోలై:

పజముదిర్ చోలై:

శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి ప్రసిద్ది చెందిన ఆలయం పజముదిర్ చోలై ఆలయం. ఈ ఆలయం అలగర్ కోయిల్ వద్ద సోలైమలై కొండపై భాగంలో ఉంది. ఈ ఆలయంలోని శ్రీ సుబ్రమణ్య స్వామి వారు రోజూ సాయంత్రం బంగారు రథంపై ఊరేగుతారు.

Photo Courtesy: Raji.srinivas

వైగై నదీ:

వైగై నదీ:

మదురై వైగై నది ఒడ్డున ఉంది.వైగై నదీతీరాన ఉన్న వృక్షముల నుండి వచ్చే మనసును పరవశింపజేసే మారుతం కారణంగా సంగకాలంలో ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. వైగైనది నగరం మధ్యగా ప్రవహిస్తూ నగరాన్ని రెండు సమాన భాగాలుగా విభజించినట్లు ఉంటుందీ సుందర పవిత్ర చారిత్రాత్మక నగరం.

Photo Courtesy: Paulthy

అతిసాయం థీం పార్క్:

అతిసాయం థీం పార్క్:

అతి సాయం థీం పార్క్ మదురైకి సుమారు 5కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పార్క్ మదురై-దిండిగల్ హైవేలో పరవాయి వద్ద కలదు. సుమారు 70ఎకరాల స్థలంలో ఈ పార్క్ ను విస్తరించారు. ఈ పార్క్ లో వివిధ రకాల ఆటలు , నీటి ఆటలు, వాటర్ రైడ్ ఈ పార్క్ లో ఒక విశేషం. ఈ పార్క్ ను సుమారు 2000 సంవత్సరంలో ఏర్పరచారు. దీనిని క్వీన్ ఆఫ్ ఇండియన్ థీం అని పిలుస్తారు.

Photo Courtesy : commons.wikimedia.org

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+