Search
  • Follow NativePlanet
Share
» »తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?

తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?

తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు.

By Mohammad

తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ .... !

ఇది కూడా చదవండి : తిరుమల గురించి నమ్మశక్యం కాని 10 నిజాలు !

ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు.

వైకుంఠ గుహ

వైకుంఠ గుహ

ఇంతకీ ... ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, తిరుమల కొండలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాలలో చెప్పబడటం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామే ఆ గుహలో దాక్కునేవారట.

చిత్ర కృప : Tatiraju.rishabh

వైకుంఠ గుహ చరిత్ర

వైకుంఠ గుహ చరిత్ర

ఇక్కడ చెప్పబోయే గాధ అప్పుడెప్పుడో త్రేతాయుగం నాటిది. అదేమంటే, రావణాసురుడు అపహరించుకొని పోయిన సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు వానర సేనతో కలిసి అడవిబాట పట్టారు. అప్పుడు వారు వెంకటాద్రి అనే దివ్య గిరికి చేరుకున్నారు. అప్పుడు అక్కడ వారికి ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేస్తూ కనిపించింది. రాముణ్ణి చూసిన అంజనాదేవి ఆనందపడుతూ .. నమస్కరిస్తూ ... రండి అని ఆహ్వానించింది.

చిత్ర కృప : Raja Ravi Varma

వైకుంఠ గుహ చరిత్ర

వైకుంఠ గుహ చరిత్ర

ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసిన రామలక్ష్మణులు అంజనాదేవి కుటీరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. అయితే వెంట వచ్చిన వానరసేన మాత్రం వేంకటాద్రిలోని అన్ని ప్రదేశాలను తిరుగుతూ ఉండగా, శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ కొంత మంది వానరుల కంటపడింది. వెలుగులు చిమ్ముతూ ఈ గుహ కనిపించడంతో వానరులందరూ అందులోకి వెళ్లి చూడగా ప్రకాశిస్తున్న మహానగరం కనిపించింది.

వైకుంఠ గుహ చరిత్ర

వైకుంఠ గుహ చరిత్ర

అక్కడ వానరులకు ఎంతోమంది స్త్రీ, పురుషులు కనిపించారు. వారందరూ శంఖు చక్రాలను ధరించి మల్లెపూవువలె తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంకాస్త లోపలికి వెళ్ళి చూడగా నగరం మధ్యలో సూర్యకాంతిలో వెలిగిపోతున్న ఒక దివ్యవిమానం కనిపించింది.

వైకుంఠ గుహ చరిత్ర

వైకుంఠ గుహ చరిత్ర

సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న ఆ దివ్య విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషుని వేయి పడగల పై పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు.

వైకుంఠ గుహ చరిత్ర

వైకుంఠ గుహ చరిత్ర

ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఆ ఆశ్చర్యము నుండి తెరుకొనే లోపే ఆ గుహ మాయమయింది.. జరిగిన విషయాన్ని మిగితా వానరసేనలకు చెప్పగా, సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అయితే వారికి అక్కడ ఎంత వెతికినా ఆ గుహ జాడ తెలియలేదు.

చిత్ర కృప : Dinesh Kumar (DK) Follow

వైకుంఠ గుహ చరిత్ర

వైకుంఠ గుహ చరిత్ర

వెంటనే జరిగిన విషయాన్ని శ్రీరామచంద్రులకు చెప్పుకున్నారు. అప్పుడు వానరులతో రాముడు - "మీరు తిరుమల కొండలను చూడడమే మహా అదృష్టం. శ్రీనివాసుడు తిరుమల గిరులలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. కేవలం ఆ గుహ ఒక్కటే కాదు ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ఆయన అన్ని చోట్లా ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు." అని అన్నాడు.

చిత్ర కృప : edtigerxyz

వైకుంఠ గుహ చరిత్ర

వైకుంఠ గుహ చరిత్ర

"విశ్రాంతి కోసం అప్పుడప్పుడు శ్రీనివాసుడు వైకుంఠ గుహలో సేదతీరుతుంటారు. అలాంటి గుహలోకి వెళ్ళడం ఎవరికైనా అసాధ్యమే" అని శ్రీరాముడు వివరించాడట. తిరుమల కొండలలో ఇప్పటికీ అలాంటి ఎన్నో గుహలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు.

చిత్ర కృప : Jayashree B Follow

వైకుంఠ గుహ చరిత్ర

వైకుంఠ గుహ చరిత్ర

పురాణాలు కూడా తిరుమల గిరులలో ఉన్న గుహల గురించి పేర్కొన్నాయని . . మఠాధిపతులు, స్వామీజీ లు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వీటి గురించి ప్రస్తావించారని చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేదతీరుతాడో ఆయనకొక్కరికే తెలుసని ... ఇది వినటం తప్ప, చూడటానికి ఆ భాగ్యము కలగదని, ఒకవేళ కలిగిన ఎవరికి ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టమని అంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+