Search
  • Follow NativePlanet
Share
» »శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా ?

శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా ?

తిరుపతి ఏడుకొండలపై నివాసుడైన విశ్వమందున్న అనేక భక్తులకు, కల్పతరువుగా, వరాలవేల్పుగా అందరికీ తెలుసు. తల నీలాల నుంచి క్యూలో దర్శనం దాకా ప్రతివారీ జీవితంలోను మరపురాని దృశ్యాలుగా మనసులోచెరగని ముద్రవేస్తాయి

శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం మమందరం గమనించే వుంటాం. తిరుపతి వెళ్ళినప్పుడల్లా స్వామివారి దర్శనం చెసుకొనటానికి వెళ్ళినప్పుడు అది మనం గమనిస్తూ వుంటాం. అసలు శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు?ఆంతర్యం ఏమిటి?

ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుని దేవాలయం విశ్వవిఖ్యాతమైనది.ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో వుంది.ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శిస్తుంటారు.భగవంతుడు శ్రీనివాసుడుకి తమ ముడుపులు, కానుకలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు.తిరుపతి ఏడుకొండలపై నివాసుడైన విశ్వమందున్న అనేక భక్తులకు, కల్పతరువుగా, వరాలవేల్పుగా అందరికీ తెలుసు. తల నీలాల నుంచి క్యూలో దర్శనం దాకా ప్రతివారీ జీవితంలోను మరపురాని దృశ్యాలుగా మనసులో చెరగని ముద్ర వేస్తాయి.

తిరుపతి లడ్డు అనే పేరు వినగానే ఆ మధురమైన రుచి మనకి టక్కున జ్ఞాపకం వస్తుంది. తిరుపతి చేరగానే లక్షలాదిమంది భక్తుల గోవిందా..గోవిందా.. అనే చైతన్యపు పిలుపులు మనకి వినిపిస్తూ వుంటాయి.ఆ మంత్రం అప్రయత్నంగా మన నోట కూడా పలకడం ప్రారంభిస్తుంది. తిరుపతి వెళ్ళటం భక్తిలోనే కాదు, సంస్కృతిలో కూడా ఒక భాగం అనిపిస్తుంది.శ్రీ వేంకటేశ్వరుని లీలా విశేషాలు, భక్తులు అద్భుత అనుభవాలు చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు కదా!

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం క్రింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు.దీని వెనకనున్న ఆంతర్యమేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా ?

ఇది కూడా చదవండి: తిరుమలలో అద్భుతమైన సహజ శిలాతోరణం గురించి మీకు తెలుసా?

ఈ నెలలో టాప్ 8 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. శ్రీ అనంతాళ్వార్

1. శ్రీ అనంతాళ్వార్

శ్రీవారి కైంకర్యంలో తరించిన భాక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్ శ్రీ తిరుమల కొండ క్రింద శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివశించారు.ఈయన స్వామివారికి రోజుకూడా పూలమాలలు సమర్పించేవారు.

pc:youtube

2.పుష్పమాల కైంకర్యం

2.పుష్పమాల కైంకర్యం

అనంతాళ్వార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులలో అగ్రగణ్యుడు.భగవత్ రామానుజుల ఆజ్ఞ మేరకు స్వామికి పుష్పమాల కైంకర్యం చేయటానికి తన జీవితాన్నే అంకితం చేసాడు మరి.

pc:youtube

3. పూలతోట

3. పూలతోట

స్వామికి పూలమాలను అల్లటానికి ఆయన ఒక పూలతోటను పెంచదలచాడు.అయితే ఆ పూదోట పెంపకానికి సరిపడా నీరందించటానికి ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని చెరువును తవ్వటం మొదలుపెడతాడు.

pc:youtube

4. ఇతరుల సహాయం

4. ఇతరుల సహాయం

ఏమాత్రం తీసుకోకుండా తానూ తన ధర్మపత్ని మాత్రమే చెరువును తవ్వాలని సంకల్పం చేసుకుని కార్యం ఆరంభిస్తారు. అనంతాళ్వార్ గడ్డపారతో మట్టిని త్రవ్విస్తే అతని భార్య గంపలలో ఎత్తుకుని వెళ్లి దూరంగా ఆ మట్టిని పోసేది.

5. పన్నెండేళ్ళ బాలుడు

5. పన్నెండేళ్ళ బాలుడు

ఆ సమయంలో ఆమె నిండు చూలాలు.ఆమె పరిస్థితిని చూసిన వేంకటేశ్వరుడు వారిరువురికి సహాయపడటానికి ఒక పన్నెండేళ్ళ బాలుని రూపంలో అక్కడికి వస్తారు. ఆ గర్భిణికి సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని పారబోయటంలో సహాయపడతాడు.

pc:youtube

6. గునపం

6. గునపం

ఈ విషయం తెలుసుకున్న అనంతాళ్వార్ కోపంతో ఆ బాలుని పైకి గునపాన్ని విసురుతాడు. ఆ గునపం బాలుని గడ్డానికి తగిలి రక్తం స్రవిస్తుంది. అంతలోనే ఆ బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్లి కనపడకుండా దాక్కుంటాడు.

pc:youtube

7. గడ్డం వద్ద రక్తం కారుట

7. గడ్డం వద్ద రక్తం కారుట

శ్రీవారి ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహంలో గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆ విషయాన్ని అనంతాళ్వార్ కి తెలియజేస్తారు. జరిగిన దానిని గురించి ఆలోచిస్తూ ఆలయానికి చేరుకున్న అనంతాచార్యులు గర్భాలయంలోని మూలమూర్తి గడ్డం నుండి రక్తం వస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోతారు.

pc:youtube

8. పచ్చకర్పూరం

8. పచ్చకర్పూరం

తమకి సాయం చేయటానికి వచ్చిన బాలుడు సాక్షాత్తూ వేంకటేశ్వరుడని గ్రహించి కన్నీళ్ళతో స్వామి పాదాలపై పడతాడు.తనని మన్నించమని కోరుతూనే గాయం వలన స్వామికి కలుగుతున్న బాధ ఉపశమించటం కోసం అక్కడ పచ్చకర్పూరం అడ్డుతాడు.

pc:youtube

9. చందనం

9. చందనం

అలా ఆయన ప్రతీరోజూ చల్లదనం కోసం గాయమైన చోట గడ్డానికి చందనం రాసి ఆ తరువాత పచ్చ కర్పూరం పెట్టేవారు. అలా స్వామివారి మూల మూర్తికి గడ్డం క్రింద పచ్చకర్పూరం పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది. అప్పటినుంచి స్వామివారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం అద్దుతారు.

రోజులో కాసేపు మాత్రమే కనిపించే దేవాలయం ! ఎక్కడుందో మీకు తెలుసా?

pc:youtube

10. మహాద్వారం

10. మహాద్వారం

ఇప్పటికీ మనం అనంతాళ్వార్ స్వామివారి మీదికి విసిరిన గునపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేల్లాడుతూ వుండటం చూడవచ్చును.

pc:youtube

11. అనంతాళ్వార్ బృందావనం

11. అనంతాళ్వార్ బృందావనం

శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనక వైపు వుంటుంది.మనం అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు.

pc:youtube

12. ఆంతర్యం

12. ఆంతర్యం

శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికొకసారి శ్రీ అనంతాళ్వార్ బృందావనానికి వెళ్తూ వుంటారు. అదండీ శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరంలో వున్న ఆంతర్యం.

pc:youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+