Search
  • Follow NativePlanet
Share
» »హటకేశ్వరం ఆలయం, శ్రీశైలం !!

హటకేశ్వరం ఆలయం, శ్రీశైలం !!

ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది. హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురు దారిలో పాలదార-పంచదారలు ఉన్నాయి. ఇక్కడే ఆదిశంకరాచార్యుడు చాలాకాలం తపస్సు చేసినది.

By Mohammad

హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లిఖార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిసరాలలోని శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు.

చరిత్ర

పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు) లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి.

ఒక చిన్న కథ

హటకేశ్వరం క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు ... మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప గురించి కూడా తప్పని సరిగా చెప్పుకోవలసి వస్తుంది. నిస్వార్ధమైన సేవతో ... అనితర సాధ్యమైన భక్తితో సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన కేశప్ప, శ్రీ శైలం సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప ... తన వృత్తిని చేసుకుంటూనే, శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు.

హటకేశ్వరం ఆలయం, శ్రీశైలం !!

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

శివయ్య దర్శనానికి వెళ్లే వారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ ... దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ వుండేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. ఇది సహించలేకపోయిన ఇరుగుపొరుగువారు ... ఓ రాత్రి వేళ అతని కుండలను పగులగొట్టడమే కాకుండా, కుండలను తయారు చేసే 'అటికె'ను కూడా పాడు చేశారు.

తెల్లారగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబోమన్నాడు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. అటికె పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడిపోయాడు. ఎలాగైనా అటికెను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనుగా భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు.

అమ్మడానికి కుండలు లేవు ... తయారు చేయడానికి అటికె లేదు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన కేశప్ప, ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటికె పై శివుడు ప్రత్యక్షమై, లోపలోకి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలి వెళ్ళిన కేశప్పకి అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా ... సంతృప్తిగా వడ్డించాడు.

శివుడు అటికెలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా' పిలవబడి కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహా భక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు.

హటకేశ్వరం ఆలయం, శ్రీశైలం !!

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

విశేషాలు

ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది. హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురు దారిలో పాలదార-పంచదారలు ఉన్నాయి. ఇక్కడే ఆదిశంకరాచార్యుడు చాలాకాలం తపస్సు చేసినది. ఒక బండపై అయన కాలిముద్రలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకముల మూలికలు, తేనె మరియు సరస్వతి ఆకు లభిస్తాయి.

హటకేశ్వర ఆలయం ఎలా చేరుకోవాలి ?

హటకేశ్వర ఆలయం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో కలదు.

రోడ్డు ప్రయాణం

శ్రీశైలం దేశం లోని ప్రధాన పట్టణాల కు రోడ్ మార్గం లో చక్కగా కలుపబడి వుంది. అనేక ప్రభుత్వ బస్సులు కలవు. అయినప్పటికీ, మీరు బస్సు టికెట్ల ని ముందుగా రిజర్వు చేసుకోవటం సూచించ తగినది.

రైలు ప్రయాణం

శ్రీశైలం కు రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ గుంటూరు - హుబ్లి లైన్ పై కల మర్కాపూర్ లో కలదు. శ్రీశైలం కు ఇది సుమారు 85 కి. మీ.ల దూరం లో కలదు. బస్సు లేదా ప్రైవేటు టాక్సీ ల లో శ్రీశైలం చేరవచ్చు. బస్సు ప్రయాణం చవక.

విమాన ప్రయాణం

శ్రీశైలం పట్టణానికి ఎయిర్ పోర్ట్ లేదు. సమీప విమానాశ్రయం 201 కి. మీ. ల దూరం లో హైదరాబాద్ లో కలదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ దేశం లోని ఇతర ప్రధాన నగరాలకు, మరియు విదేశాలకు కూడా అనుసంధానించబడి వుంది. విమానాశ్రయం నుండి శ్రీశైలం కు టాక్సీ ల లో చేరవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+