Search
  • Follow NativePlanet
Share
» »ఎపి లో ఈ శివాలయాలను మీరెప్పుడైనా విన్నారా ?

ఎపి లో ఈ శివాలయాలను మీరెప్పుడైనా విన్నారా ?

By Mohammad

భారతదేశం లో ఉన్నన్ని ఆలయాలు బహుశా ప్రపంచంలో మరేదేశంలో కనిపించవేమో ! ఇవి(గుడులు) ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. శివుడు, విష్ణుమూర్తి (అయన అవతారాలు), అమ్మవారి ఆలయాలు వీటిలో ప్రముఖమైనవి మరియు ప్రధానమైనవి. తమిళనాడు, కేరళ లో మురుగన్ (సుబ్రమణ్య స్వామి) ఆలయాలను ఎక్కువగా దర్శిస్తుంటారు భక్తులు.

మనకు ఉన్న ప్రత్యేక అలవాటు .. ఎక్కడెక్కడి ఆలయాలనో తెలుసుకొని అక్కడికి వెళ్లి దర్శించడం. కానీ, మన రాష్ట్రంలో ఉన్న ఆలయాల సంగతి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అంతేలే ఎక్కడో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకొనెంత టైం మన దగ్గర ఉన్న ఆలయాల వద్దకు వచ్చేసరికి సన్నగిల్లిపోతుంది. మీకోసం ఎపి లోని కొన్ని ప్రత్యేకమైన శివాలయాలు గురించి ఈ వ్యాసం ... చూసి దర్శించండి.

భీమవరం సోమేశ్వర ఆలయం

భీమవరం సోమేశ్వర ఆలయం

చిత్ర కృప : PV Bhaskar

భీమవరం సోమేశ్వర ఆలయం

భీమవరం లోని సోమేశ్వర ఆలయం 2 కిలోమీటర్ల దూరంలోని గునుపూడి లో కలదు. ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని స్టళ్లపురాణంలో చెప్పబడింది. చంద్రుడి పేరుమీద ఇక్కడి స్వామివారిని సోమేశ్వర స్వామి అని అంటారు. ఈ ఆలయ ప్రత్యేకత విషయానికి వస్తే, అమావాస్య నాడు చంద్రుడు బూడిద లేదా గోధుమ రంగులోనూ మరియు పౌర్ణమి నాడు తెలుపు రంగులోనూ కనిపిస్తాడు.

ఇది కూడా చదవండి : ఏపీలోని పంచారామ క్షేత్రాలు !

కోటిపల్లి సోమేశ్వర స్వామి

కోటిపల్లి సోమేశ్వర స్వామి

చిత్ర కృప : Mana Temples

కోటిపల్లి సోమేశ్వర స్వామి

తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలంలో కోటిపల్లి గ్రామం కలదు. ఇక్కడ శివుని ఆలయం ప్రసిద్ది చెందినది. ఇందులో శివలింగం తక్కువ ఎత్తు కలిగి ఉంటుంది. ద్రాక్షారామం (10 కి. మీ) నుండి కోటిపల్లి కి ప్రతిరోజూ ఆర్డినరీ సర్వీస్ బస్సు నడుస్తుంది. ఈ క్షేత్రం లో ఏమి చేసిన కోటి ఫలితాల్ని ఇస్తుందని భక్తుల నమ్మకం.

ఇది కూడా చదవండి : ద్రాక్షారామం - పురాణాలపుట్ట !

యాగంటి బసవన్న

యాగంటి బసవన్న

చిత్ర కృప : Sanju189

యాగంటి బసవన్న

యాగంటి కర్నూలు జిల్లాలోని బనగానపల్లె లో చేరువలో కలదు. ఇక్కడ ఉమామహేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందినది. ఆలయ గర్భగుడికి ఎదురూగా బసవన్న(నంది) విగ్రహం ఉంటుంది. వీరబ్రహేంద్రస్వామి కాలజ్ఞానంలో రాసినట్లు నంది విగ్రహం అంతకంతకు పెరిగిపోతుందని, కలియుగాంతంలో లేచి రంకె వేస్తాడని చెప్పబడింది. ఇప్పుడు అచ్చం అలాగే నంది విగ్రహం పెరిగిపోతుందని పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : యుగాంతంతో ముడిపడి ఉన్న క్షేత్రం !

ఉమారామలింగేశ్వర స్వామి

ఉమారామలింగేశ్వర స్వామి

చిత్ర కృప : Surya Prakash

ఉమారామలింగేశ్వర స్వామి

ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా లోని గొల్లప్రోలు తాలూకాలోని దుర్గాడ లో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం కలదు. ఇక్కడి ప్రత్యేక ఏమిటంటే శివలింగం మీద చిన్న రాయి. ఆ రాయిని గంగమ్మ గా భావించి పూజిస్తారు భక్తులు.

గుడిమల్లంలోని శివ రూపం

గుడిమల్లంలోని శివ రూపం

చిత్ర కృప : Gudimallam

గుడిమల్లం

దేశంలోనే ... కాదు కాదు ప్రపంచములోనే అరుదైన శివలింగం గుడిమల్లం. ఇది చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలో కలదు. దీనిని క్రీ. పూ. 1 వ శతాబ్దంలో ఆంధ్రా శాతవాహనులు నిర్మించారు. దీని చరిత్ర కావాలంటే కెహెద్రగిరి మ్యూజియం వెళ్లి తెలుసుకోవచ్చు. గర్భగుడి లోని శివలింగం లింగరూపంలో కాకుండా మానవరూపంలో వేటకు వెళుతున్న మహావేటగానివలె ఉన్నాడు.

ఇది కూడా చదవండి : గుడిమల్లం - ప్రపంచములోనే అరుదైన శివలింగం !

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+