భారతదేశంలోని గ్రీనెస్ట్ రైల్వేస్టేషన్స్‌ను చూశారా?
పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య పరుగులు తీసే రైల్లో, కిటికీ పక్కన కూర్చుని, నచ్చిన పాటలు వింటూ, ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అందరూ కోరుకుంటారు. ఇలాంటి ప్రత్యేక అనుభూతులను అందించడంతో పాటు పర్యావరణానికి ఉపయోగపడే గ్రీన్ రైల్వే స్టేషన్‌లు ఇండియాలో ఉన్నాయి. ఈ వేసవిలో సరదాగా పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ గ్రీనెస్ట్ రైల్వేస్టేషన్లలో ప్రయాణించండి. ఎందుకంటే, ఈ రైల్వేస్టేషన్లు ప్రకృతితో మమేకమయ్యి ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య ట్రైన్ జర్నీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ఎవరైనా సరే ఎగిరి గంతేయాల్సింది. మరెందుకాలస్యం ప్రకృతితో కలిసి మీరు ప్రయాణం చేయాలనుకుంటే ఈ రైల్వేస్టేషన్స్‌లో ప్రయాణించాల్సిందే.

దూద్ సాగర్ రైల్వే స్టేషన్
గోవాలోని దూద్ సాగర్ రైల్వే స్టేషన్ దేశంలోని గ్రీన్ స్టేషన్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ రైల్వేస్టేషన్ గోవా సమీపంలో ఉంది. బ్రగంజా ఘాట్‌ల అందమైన దృశ్యాల నడుమ ఉంటుంది ఈ స్టేషన్. ఇక్కడి దూద్‌సాగర్ జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గోవాకి ట్రైన్ జర్నీ చేసేవారంతా ఈ అందమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు.

కత్గోడం రైల్వే స్టేషన్
ఇండియాలోని గ్రీన్ రైల్వేస్టేషన్లలో కత్గోడం రైల్వేస్టేషన్ ఒకటి. ఇది ఉత్తరాఖండ్‌లోని కత్గోడం రైల్వే స్టేషన్ డెహ్రాడూన్, కత్గోడంలను కలుపుతుంది. ఈ స్టేషన్ చుట్టూ శివాలిక్ కొండలు ఉంటాయి. ఈ స్టేషన్‌లో సోలార్ పవర్, వాననీటి సంరక్షణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ న్యూఢిల్లీ-కత్‌గోడం శతాబ్ది ఎక్స్‌ప్రెస్, లక్నో జంక్షన్-కత్గోడం ఎక్స్‌ప్రెస్, రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. పర్యావరణ ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే ఈ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్
ఇండియాలోని గ్రీన్ రైల్వేస్టేషన్లలో ఇప్పుడు హాప్లాంగ్ రైల్వేస్టేషన్ కూడా చేరింది. అస్సాంలోని డిమా హసావో జిల్లాలో పర్యావరణాన్ని పరిరక్షించే అందమైన హఫ్లాంగ్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ హఫ్లాంగ్‌ను గౌహతి, సిల్చార్‌లతో కలుపుతుంది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన అస్సాం కొండలు ఉంటాయి. రెన్యువబుల్ ఎనర్జీ ఉపయోగించడం, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి ఎన్విరాన్‌మెంటల్, సస్టైనబుల్ గైడ్‌లైన్స్‌ను అమలు చేస్తుంది. చుట్టూ ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులు ఎంతగానో ఆకట్టకుంటుంది.

సిమ్లా రైల్వే స్టేషన్
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా రైల్వే స్టేషన్ అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. అంతేకాదు గ్రీన్ రైల్వేస్టేషన్ల జాబితాలో కూడా చేరింది. ఈ స్టేషన్ చుట్టూ అందమైన పర్వతాలు, పచ్చని అడవులు ఉన్నాయి. అందుకే ఈ స్టేషన్ భారతదేశంలోని గ్రీన్ రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. చెట్లను నాటడం, సోలార్ ప్యానెల్‌లను అమర్చడం, రీసైక్లింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానాలు ఈ రైల్వేస్టేషన్‌లో అమలు చేస్తున్నారు. ఈ స్టేషన్‌లో భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఉంది. అందుకే ఈ స్టేషన్ పర్యాటక ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కార్వార్ రైల్వే స్టేషన్
కర్ణాటక, కార్వార్ నగరంలో కార్వార్ రైల్వే స్టేషన్ ఉంది. ఈస్టేషన్ బెంగళూరు, ముంబై రైలు మార్గంలో ఉంటుంది. ఈ నగరాన్ని కాశ్మీర్ ఆఫ్ కర్ణాటకగా పిలుస్తారు. ఈ స్టేషన్ జైపూర్, ఇండోర్, ఎర్నాకులం, కోయంబత్తూర్ వంటి ఇతర నగరాలను కూడా అనుసంధానిస్తుంది. ఈ రైల్వే స్టేషన్ సరిసరాల్లో అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు అంతేకాకుండా ఇక్కడి ప్రకృతి అందాలు, మనోహరమైన దృశ్యాలను ఇక్కడికి వచ్చే పర్యాటకులు వారి కెమెరాలలో బంధిస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications
















