Search
  • Follow NativePlanet
Share
» »హైద‌రాబాద్ టూ త‌మిళ‌నాడు.. ఆల‌యాల‌ సంద‌ర్శ‌న‌కు ఐఆర్‌సీటీసీ టూర్

హైద‌రాబాద్ టూ త‌మిళ‌నాడు.. ఆల‌యాల‌ సంద‌ర్శ‌న‌కు ఐఆర్‌సీటీసీ టూర్

తమిళనాడు అంటేనే ప్ర‌సిద్ధ‌, చారిత్ర‌క‌ పుణ్యక్షేత్రాలకు నిల‌యమ‌ని అంద‌రికీ తెలిసిందే. అలాంటి రాష్ట్రంలోని శ్రీ రంగం ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం సహా ప‌లు దేవాలయాలను జీవితంలో ఒక్క‌సారైనా ద‌ర్శించుకోవాల‌ని చాలామంది అనుకుంటారు. అయితే, ఈ ఆల‌యాల‌ను ఒక్క ట్రిప్‌లో చూడాలంటే సాధ్యంకాదేమో అనే సందేహంతో అలాంటివారు వెన‌క‌డుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీ ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని ప‌రిచ‌యం చేసింది. ఆ టూర్ ప్యాకేజీ పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం!

త‌మ ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు ఐఆర్‌సీటీసీ నిత్యం ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంది. తాజాగా ట్రెజర్స్​ ఆఫ్​ తమిళనాడు పేరుతో ఐఆర్​సీటీసీ తీసుకొచ్చిన టూర్ ప్యాకేజీతో ఇప్పుడు మ‌రోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాల సంద‌ర్శ‌కుల కోసం హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ ట్రెజ‌ర్స్ ఆఫ్ త‌మిళ‌నాడు ప్యాకేజీని ఆపరేట్​ చేస్తోంది. ఈ టూర్​లో తమిళనాడులోని కుంభకోణం, రామేశ్వరం, మధురై, తంజావూరు లాంటి ప్ర‌సిద్ధ ప్ర‌దేశాల‌ను, ఆల‌యాల‌ను చూసే అవ‌కాశం ఉంది.

మొత్తంగా ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉన్న ఈ జ‌ర్నీ జీవితంలో మ‌ర్చిపోలేని జ్ఞాప‌కాల‌ను అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ, 39,850, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.30,500, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.26,800గా ధ‌ర‌లు ఉన్నాయి. అలాగే, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ రూ.26,800, విత్​ అవుట్​ బెడ్​ రూ.22,600గా ధ‌ర‌లు నిర్ణయించారు.

Tamilnadu Temples

ఫ్లైట్ 6E 2073పై ప్ర‌యాణం మొద‌లు..

హైదరాబాద్‌లోని విమానాశ్ర‌యం నుంచి మొదటి రోజు ఫ్లైట్ 6E 2073పై ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. అలా సాయంత్రానికి తమిళ‌నాడులోని తిరుచ్చి విమానాశ్రయం చేరుకుంటారు. త‌ర్వాత అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు సిబ్బంది తీసుకువెళ‌తారు. రాత్రికి అక్కడే విడిది ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్​ఫాస్ట్ పూర్త‌యిన‌ తర్వాత అక్క‌డి నుంచి శ్రీరంగం ఆలయం, జంబుకేశ్వర ఆలయ సంద‌ర్శ‌న ఉంటుంది. అక్క‌డి నుంచి మధ్యాహ్నం తంజావూరుకు చేరుకుంటారు.

అక్కడి బృహదీశ్వర ఆలయ సంద‌ర్శ‌న చేసుకుంటారు. త‌ర్వాత‌ కుంభకోణంకి బయలుదేరి, అక్కడ ఐరావతేశ్వర ఆలయ అందాన్ని ఆస్వాదిస్తూ గ‌డిపేస్తారు. ఆ రాత్రికి కుంభకోణంలోని హోటల్​లో విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు ఉంటాయి.

ఇక్క‌డ అడుగుపెట్ట‌డంతో..

మూడ‌వ‌ రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ చేసిన త‌ర్వాత అక్క‌డ నుంచి చిదంబరానికి వెళ‌తారు. అక్కడ నటరాజ స్వామి ఆలయాన్ని సంద‌ర్శించిన అనంత‌రం గంగైకొండ చోళపురం చేరుకుంటారు. అక్క‌డి చారిత్ర‌క నిర్మాణాల సంద‌ర్శ‌న ఉంటుంది. అలా మధ్యాహ్నానికి తిరిగి కుంభకోణం చేరుకుని, భోజనం త‌ర్వాత కుంభకోణం ప‌ర్య‌టిస్తారు. ఇక్క‌డి స్థానిక ఆలయాల‌యిన కాశీ విశ్వనాథర్, సారంగపాణి, ఆది కుంభేశ్వర ఆలయాల‌ను సంద‌ర్శించి, రాత్రికి కుంభకోణంలోనే విడిది చేస్తారు.ఇక‌ నాలుగ‌వ‌ రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ అనంత‌రం చెక్ అవుట్ చేసి, రామేశ్వరం బ‌య‌లుదేరుతారు. మధ్యాహ్నం రామేశ్వ‌రంలోని రామనాథస్వామి ఆలయాన్ని చంద‌ర్శించి, రాత్రికి రామేశ్వరంలోనే బస చేస్తారు.

ఐద‌వ రోజు ఉదయాన్నే దనుష్కోటి, అబ్దుల్ కలాం మెమోరియల్‌ని సందర్శించిన తర్వాత మధురైకి ప‌య‌న‌మ‌వుతారు. రాత్రికి అక్క‌డే విడిది చేస్తారు. ఇక టూర్‌లో చివ‌రి రోజు మీనాక్షి అమ్మవారి దర్శనం త‌ర్వాత అక్క‌డి నుంచి మధురై ఎయిర్ పోర్టుకు బ‌య‌లుదేరుతారు. అక్కడి నుంచి ఫ్లైట్​లో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవ‌డంతో టూర్ ముగుస్తుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+