Search
  • Follow NativePlanet
Share
» »శశికళ జైలు నుండి ఎక్కడెక్కడకు వెళ్ళిఉండవచ్చనే అనుమానాలు మీకు తెలుసా?

శశికళ జైలు నుండి ఎక్కడెక్కడకు వెళ్ళిఉండవచ్చనే అనుమానాలు మీకు తెలుసా?

అక్రమాస్తుల కేసులో కర్ణాటకలో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళపై ఆరోపణలు ముమ్మరం చేశారు.

By Venkatakarunasri

అక్రమాస్తుల కేసులో కర్ణాటకలో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళపై ఆరోపణలు ముమ్మరం చేశారు. లంచమిచ్చి కారాగారంలో శశికళ ప్రత్యేక సదుపాయాలు పొందుతున్నారని ఆరోపణలకు తగ్గ సాక్ష్యాధారాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. తాజాగా శశికళ జైలు నుంచి బయటకు వెళ్లి తిరిగి లోనికి వస్తున్న దృశ్యాలను కర్ణాటక అవినీతి నిరోధక విభాగానికి అందించారు.

నల్లరంగు కుర్తా వేసుకొని చేతిలో బ్యాగు పట్టుకొని శశికళ జైలులోకి దర్జాగా వస్తున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అక్రమాస్తుల కేసులో జయలలిత నెచ్చెలి అయిన శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్‌ జైల్లో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, రూ. రెండు కోట్ల మేర లంచాలు ముట్టజెప్పి జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని, వీఐపీ తరహాలో జైలులో ఆమెకు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. తన ఆరోపణలను సాక్ష్యంగా జైలు ప్రవేశద్వారంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను బట్టి సాధారణ దుస్తుల్లో శశికళ జైలు లోపలికి దర్జాగా వస్తున్న దృశ్యాలు వున్నాయి. ఆమెకు రక్షణగా ఇద్దరు పురుష గార్డులు కూడా ఉన్నారు.

శశికళ జైలు నుంచి ఏఏ ప్రదేశాలకు వెళ్ళారో సోషల్ నెట్వర్క్ ల్లో చర్చలు జరుగుతున్నాయి.

శశికళ జైలు నుండి బయటికి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లిందనే అనుమానాలు చూద్దాం.

 షాపింగ్

షాపింగ్

శశికళ జైలు నుంచి బయటికి వెళ్లి షాపింగ్ చేసుంటారని అనుమానం. వాస్తవానికి శశికళ షాపింగ్ ఎక్కడెక్కడ వెళ్లివుండవచ్చో చూద్దాం.

ఫోరం మాల్

ఫోరం మాల్

బెంగుళూరులో ముఖ్యమైన మాల్స్ లో ఫోరం మాల్ ఒకటి. ఈ మాల్ కర్ణాటక సరిహద్దుకు హోసూర్ కు కలపబడిన రహదారిపై ఉంది. పరప్పన అగ్రహారం కోరమంగళ సమీపంలో వుంది. ఇక్కడకు అరగంటలో చేరుకోవచ్చును. ఈమె ఇక్కడకు వెళ్లివుంటారని అనుమానాలు వున్నాయి. ఇది అందరూ బిజీగా వుండే బహిరంగ ప్రదేశం కాబట్టి చాలామంది ప్రజలు శశికళను అంతగా గుర్తించరు అనుకునే అవకాశం వుండవచ్చును.

 గరుడా మాల్

గరుడా మాల్

బెంగుళూరులోని మరొక ముఖ్యమైన మాల్ గరుడా మాల్. ఇది మగ్రాత్ రోడ్ లో వున్న ఫేమస్ మాల్. మే 2005 లో నిర్మించబడిన ఈ ప్రదేశం 126000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. శశికళ ఇక్కడకు వస్తుందని అనుమానించటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుండి పరప్పన అగ్రహారం కేవలం 45ని మాత్రమే.

యు బి సిటీ

యు బి సిటీ

16 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి వున్న యు బి సిటీ బెంగళూరు లోని అతి పెద్ద వాణిజ్య సముదాయం. రాష్ట్రం లోకెల్లా పొడవైన భవనం గా దీనికి ఖ్యాతి వుంది. ఈ ఆకాశ హర్మ్యం బ్రిగేడ్ రోడ్డు - ఎం జీ రోడ్డు కూడలి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో విట్టల్ మాల్యా వీధి లో వుంది.యు బి సిటీ లో యు బి టవర్, కామెట్, కాన్బెర్రా, కాన్కర్డ్ అనే పేర్లున్న నాలుగు భవనాలున్నాయి. కర్ణాటక లోని మొదటి విలాసవంతమైన సముదాయం ఇది. విలాసవంతమైన రిటైల్, వాణిజ్య - సర్వీస్ద్ అపార్ట్మెంట్ల కలగూరగంప అయిన ఈ సముదాయం లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడారు, అన్ని ప్రధాన బ్రాండ్ లు ఒకే వేదిక లో దొరుకుతాయి.

యు బి టవర్ లో కార్యాలయాలు, కామెట్ లో సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, కాన్బెర్రా, కాన్కార్డ్ ల లో క్రింది అంతస్తుల్లో చిల్లర దుకాణాలు, పై అంతస్తుల్లో కార్యాలయాలు వుండేలా రూపొందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఓక్ వుడ్ ఇళ్ళు ఈ యు బి సిటీ లో చెప్పుకోదగిన ప్రత్యేకత. ఇటాలియన్ నుంచి చైనీస్ దాకా అన్ని రకాల రుచులూ ఇక్కడ దొరుకుతాయి.800 సీట్లుండే ఆమ్ఫి థియేటర్ తో పాటు 1100 కార్లు పట్టే పార్కింగ్ స్థలం కూడా వుంది. భవనం పై కప్పు మీద ఏర్పాటైన హేలీపాడ్ వల్ల ఇక్కడికి విమానాశ్రయం నుంచి వాయు మార్గంలో అయిదు నిమిషాల్లో చేరుకోవచ్చు. విస్తారంగా వుండి ఆకట్టుకునే ఈ భవన సముదాయం మిమ్మల్ని మొదటి చూపు లోనే ఆకర్షిస్తుంది.

 మంత్రి మాల్

మంత్రి మాల్

ఈ మాల్ అగ్రహారం నుండి సుమారు 1 గంట దూరంలో ఉంది. ఇక్కడ సమావేశాలు కూడా జరుపుతారు. ఈ మాల్ మల్లేశ్వరంలో వుంది. భారతదేశంలో అతిపెద్ద మాల్స్ లో ఇది ఒకటి.

ఫోనిక్స్ మార్కెట్ సీటీ

ఫోనిక్స్ మార్కెట్ సీటీ

ఇది బెంగుళూరులోని అతిపెద్ద మాల్స్ లో ఒకటి. ఈ మాల్ మహాదేవపురంలో ఉంది మరియు 1400,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. సోషల్ నెట్ వర్క్ లు ఈ అగ్రహారం నుండి సుమారు 1 గంట దూరంలో ఉన్న ఫోనిక్స్ మార్కెట్ సీటీలో శశికళ గురించి వ్యాఖ్యానాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

ఓరియన్ మాల్

ఓరియన్ మాల్

ఓరియన్ మాల్ కొంచెం దూరం కాబట్టి ఇక్కడకు శశికళ వెళ్ళడానికి తక్కువ అవకాశం ఉందని చెప్పబడింది కానీ సోషల్ నెట్ వర్క్ లు చెరసాల నుండి బయటికి వచ్చి ఇంతదూరం వెళ్ళటానికి అవకాశం లేదని అంటున్నారు.

 లాల్ బాగ్, బెంగళూరు

లాల్ బాగ్, బెంగళూరు

సోషల్ నెట్ వర్క్ లు కామెడీగా జైలు నుంచి ఉద్యానవనాలకు అని రాస్తున్నారు. అటువంటి ఉద్యానవనాలలో లాల్ బాగ్ ఒకటి.

లాల్ బాగ్, బెంగళూరు

లాల్ బాగ్, బెంగళూరు

ఈ ఉద్యానవనం బెంగుళూరు యొక్క దక్షిణాన ఉన్నది.బొటానికల్ గార్డెన్ అని పిలుస్తారు.పచ్చని బొటానికల్ గార్డెన్ గా ప్రసిద్ధి చెందింది. లాల్ బాగ్ అంటే 'ఎరుపు తోట'. ఈ ఉద్యానవనం హైదర్ ఆలీచే నిర్మించబడింది. ప్రసిద్ధ రాజు ఉద్యానవనాలను నిర్మించాలనే ఉద్దేశ్యంతో అతని కుమారుడు టిప్పు సుల్తాన్ చే నిర్మించబడింది.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

కొంతమంది శశికళ చెన్నైకి ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు అని చెప్తున్నారు. జైలులో శశికళకు రాజభోగాల వ్యవహారంపై సీసీటీవీ కెమెరా దృశ్యాలు చర్చనీయాంశంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X