Search
  • Follow NativePlanet
Share
» »సర్ధార్ సరోవర్ డాం - నర్మదా నది ఆభరణం !!

సర్ధార్ సరోవర్ డాం - నర్మదా నది ఆభరణం !!

సర్దార్ సరోవర్ డామ్ కి వచ్చే పర్యాటకులు నిర్మాణ దశలో ఉన్న వల్లభాయ్ పటేల్ భారీ కట్టడంతో పాటు .. దాని చుట్టుప్రక్కల కొన్ని ప్రకృతి ప్రదేశాలను చూసి ఆనందించవవచ్చు.

By Mohammad

గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సర్దార్ సరోవర్ డామ్. ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీని కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇంతకీ అంత ఖర్చు ఏ విగ్రహానికో అనుకుంటున్నారా ... ?? భారత దేశ 'ఉక్కుమనిషి' సర్ధార్ వల్లభాయ్ పటేల్.

ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ యొక్క భారీ కట్టడం తో పాటుగా డామ్ మరియు దాని చుట్టుప్రక్కల కొన్ని ప్రకృతి ప్రదేశాలను చూసి ఆనందించవవచ్చు. సాహస యాత్రలు ఇష్టపడే పర్యాటకులు నర్మదా నది గుండా ట్రెక్కింగ్ చేస్తూ విహరించవచ్చు. డాం ఆఫీసు వారు ఇక్కడ రకరకాల రంగుల పడవలలో బోటింగ్ విహారం చేయటానికి అనుమతి ఇస్తారు. ఇక్కడకి వస్తే ఏ ఏ ప్రదేశాలను చూసి ఆనందం పొదాలంటే ...

సర్ధార్ సరోవర్ డామ్

సర్ధార్ సరోవర్ డామ్

సర్ధార్ సరోవర్ కి వచ్చే పర్యాటకులు ముఖ్యంగా చూడవలసినది నర్మదా నది మీద కట్టిన అతి పెద్ద డామ్ సర్ధార్ సరోవర్ డామ్. ఈ డామ్ నర్మదా నది పుట్టిన ప్రదేశం నుండి 1163 కి. మీ. దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ డామ్ గుజరాత్ ప్రజలకు త్రాగు నీరు, సాగు నీరు మరియు విద్యుత్ సరఫరా ని అందిస్తుంది.

Photo Courtesy: Our Vibrant Gujarat

భారూచ్

భారూచ్

భారూచ్ పనే ప్రదేశం నర్మదా నది పుట్టిన ప్రాంతంలో కలదు. ఈ ప్రదేశం గురించి ఎన్నో గ్రంధాలలో పేర్కొనటం జరిగింది. స్కంద పురాణం ప్రకారం పూర్వం భారూచ్ గ్రామంలో మాతా లక్ష్మి దేవి ఉండేదని, ఆ తరువాత భ్రిగు మహర్షి ఈ గ్రామాన్ని సందర్శించాడని చెబుతారు. జైన మరియు బౌద్ధ మతాలు కూడా వాటి గ్రంధాలలో ఈ ప్రదేశం గురించి పేర్కొన్నారు.

Photo Courtesy: dipeshpatelpre

రత్నమహల్ స్లోత్ బేర్ సంక్చురి

రత్నమహల్ స్లోత్ బేర్ సంక్చురి

రత్నమహల్ స్లోత్ బేర్ సంక్చురి సరోవర్ డామ్ సమీపాన కలదు. ఈ ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళడానికి ఎవరూ కూడా సాహసించరు. పక్కన తోడు పెట్టుకొని వెళుతుంటారు పర్యాటకులు. ఈ సంక్చురి లో ఎలుగు బంట్లు, ప్రాణహాని కలిగించే క్రూర మృగాలు ఉన్నాయి. ఒక మంచి గైడ్ ని వెంటబెట్టుకొని గ్రూపులుగా వెళ్ళటం మంచిది అని నా అభిప్రాయం.

Photo Courtesy: Ryan Fernandéz

సమొత్ మల్సమొత్ ఎకో క్యాంపు సైట్

సమొత్ మల్సమొత్ ఎకో క్యాంపు సైట్

సమొత్ మల్సమొత్ ఎకో క్యాంపు సైట్ ను సర్ధార్ సరోవర్ డామ్ వెళితే తప్పక చూడదగిన ప్రదేశం. ఇక్కడ అందమైన టేకు చెట్లు కలవు. సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు ఈ ప్రాంతం లో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి చూస్తారు. సమొత్ మల్సమొత్ ఎకో క్యాంపు సైట్ విజిటర్లకి చక్కని భోజన సదుపాయాలు, చల్లని కూల్ డ్రింకులను అందిస్తున్నది. ఇక్కడ బస చేయాలనుకునే వారికి కాటేజ్ లు , వి ఐ పి గెస్ట్ హౌస్ లు కూడా కలవు.

Photo Courtesy: telugu native planet

శూలపనేస్వర్ వైల్డ్ లైఫ్ సంక్చురి

శూలపనేస్వర్ వైల్డ్ లైఫ్ సంక్చురి

శూలపనేశ్వర్ వైల్డ్ లైఫ్ సంక్చురి సర్దార్ సరోవర్ డామ్ వద్ద కలదు. ఇక్కడ సుమారు 575 రకాల జాతుల పూల మొక్కలు కలవు. అనేక వెదురు చెట్లు ఇతర వృక్షాలతో పచ్చగా వుంటుంది. ఈ సంక్చురి సుమారు 607.70 చ.కి.మీ.లలో కలదు. స్లోత్ బేర్, చిరుత లేడి, వంటి జంతువులను ఇక్కడ చూడవచ్చు.

Photo Courtesy: nau students' photo critic forum

విశాల ఖాది ఎకో క్యాంప్ సైట్

విశాల ఖాది ఎకో క్యాంప్ సైట్

విశాల ఖాది ఎకో క్యాంపు సైట్ నర్మదా నదికి 20 కి.మీ.ల దూరంలో కలదు. ఈ క్యాంపు సైట్ చుట్టూ కర్జాన్ అడవి, దేదియా పద అడవి, మరియు డాంగ్ అడవి ప్రదేశాలు కలవు. అడవిలో గల వాటర్ ఫాల్స్ ఈ ప్రదేశ అందాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఈ ప్రదేశం విజిటర్లకు అవసరమైన వసతి, కాటేజ్ లు ఏర్పరుస్తుంది. భోజన ప్రదేశాలు, ఒక టవర్, జంతువులను చూసే పరికరాలు మొదలైనవి కూడా ఈ క్యాంపు సైట్ ప్రత్యేకతలు.

Photo Courtesy: telugu native planet

చందోడ్

చందోడ్

చందోడ్ అనే పట్టణం నర్మదా, ఒర్సాంగ్ మరియు సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో కలదు. ఈ ప్రదేశంలో ఉన్న అనేక దేవాలయాల లో ప్రముఖంగా చూడవలసినది కాశి విశ్వనాథ మహాదేవ ఆలయం. ఈ ఆలయంలో లోపల అందమైన పెయింటింగ్, అబ్బురపరిచే చక్కని శిల్పాలు ఉన్నాయి.

Photo Courtesy: telugu native planet

కబీర్ వాడా

కబీర్ వాడా

కబీర్ వాడా నర్మాదా నది లో గల ఒక దీవిపై కలదు. ఈ ప్రదేశం చారిత్రకంగానే కాక, సుమారు 3 కి. మీ. వరకు కాలక్రమేణా విస్తరించిన అతి పెద్ద మర్రి చెట్టు కు ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి ఎక్కువగా ఒంటరి తనం కోరే పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి ప్రభుత్వం వారు బోటింగ్ సదుపాయం కల్పించారు.

Photo Courtesy: telugu native planet

కేవడియా కాలనీ

కేవడియా కాలనీ

కేవడియా కాలనీ సర్దార్ సరోవర్ డామ్, కేవడియా డామ్ నిర్మాణ పనుల నిమిత్తం కొరకు కట్టించినది. విజిటర్లు ఇక్కడ కూడా బస చేయవచ్చు.

Photo Courtesy: Ryan Fernandéz

కన్జేట ఎకో క్యాంపు సైట్

కన్జేట ఎకో క్యాంపు సైట్

కన్జేట ఎకో క్యాంపు సైట్ రతన్ మహల్ స్లోత్ బేర్ సంక్చురిలో కలదు. ఇక్కడ స్లోత్ బేర్ అధికం అయినప్పటికీ, పులులు, జంగల్ కాట్, సివెట్, జకల్, హైనా వంటి జంతువులను చూసి ఆనందించవచ్చు. ఇక్కడ కల అద్భుత వాతావరణం తప్పక అనుభవించాలి. పానం నది పుట్టినది ఇక్కడే. పర్యాటకులు, సాహసికులు బస చేయటానికి అనేక కాటీజీలు ఇక్కడ ఉన్నాయి.

Photo Courtesy: Ryan Fernandéz

రాజ్ ఫిప్లా

రాజ్ ఫిప్లా

రాజ్ పిప్లా అనే ప్రదేశం, సర్దార్ సరోవర్ డాం నుండి 36 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ రాజ్వంట్ పాలస్ కలదు. దీనిలో అనేక ఫిలిం కంపెనీ లు సంవత్సరం పొడవునా షూటింగ్ లు నిర్వహిస్తారు(హిందీ సినిమా షూటింగ్ లు అనేకం). మీరు ఇక్కడికి వెళితే ఏదో ఒక సినిమా షూటింగ్ తప్పక చూస్తారు.

Photo Courtesy: telugu native planet

సాగాయి - మల్సమోట్ ఎకో క్యాంపు సైట్

సాగాయి - మల్సమోట్ ఎకో క్యాంపు సైట్

ప్రకృతి ఒడి లో మమేకమైన సాగాయి - మల్సమోట్ ఎకో క్యాంపు సైట్ దాని అద్భుత వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. అందమైన టేకు అడవులు, అద్భుతమైన నినాయి వాటర్ ఫాల్స్ చల్లని వాతావరణంతో ఈ ప్రదేశం టూరిస్టులను ఆకర్షిస్తుంది. క్యాంపు సైట్ లో బస చేసేందుకు సౌకర్యాలు మెండుగా ఉన్నాయి.

Photo Courtesy: telugu native planet

జర్వాని ఎకో క్యాంపు సైట్

జర్వాని ఎకో క్యాంపు సైట్

జర్వాని ని ఎకో క్యాంపు సైట్, కేవడియా కాలనీలో నర్మదా డాం సైట్ వద్ద కలదు. ఈ ప్రదేశంలో ప్రకృతి ప్రేమికులు అనేక వన్య జంతువులను చూడవచ్చు. క్యాంపు సైట్ లో ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే ఫారెస్ట్ అధికారుల అనుమతి కావాలి. ఇక్కడ నుండి జర్వాని వాటర్ ఫాల్స్ నడక మార్గాన తేలికగా చేరవచ్చు.

Photo Courtesy: telugu native planet / Ryan Fernandéz

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద విగ్రహాన్ని భారతదేశంలో సుమారు 2500 కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీని నిర్మాణ సమయం మూడు సంవత్సరాలు. ఈ విగ్రహాన్ని 19 వేల చరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 597 అడుగుల ఎత్తులో కడుతున్నారు. ఇందుకోసం సుమారు 2500 టన్నుల ఇనుమును వెచ్చించనున్నారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా నిర్మిస్తున్న సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా మారబోతున్నది.

Photo Courtesy: Vinod Kumar

సర్దార్ సరోవర్ డామ్ ఎలా చేరుకోవాలి ??

సర్దార్ సరోవర్ డామ్ ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

సర్దార్ సరోవర్ కు వదోదర లేదా హార్ని లోని సివిల్ ఎయిర్ పోర్ట్ లు సమీపంగా ఉన్నాయి. ఇక్కడ నుండి దేశం లోని ప్రధాన నగరాలకు విమానాలు కలవు.

రైలు మార్గం

వడోదర రైల్వే స్టేషన్, సర్దార్ సరోవర్ కు సమీపంలో గల రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి దేశంలోని అనేక ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లు అందుబాటులో ఉంటాయి.

రోడ్డు మార్గం

ఈ సర్దార్ సరోవర్ డామ్ కి చేరాలంటే ముందుగా కేవడియా పట్టణానికి చేరుకోవాలి. ఈ పట్టణానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

Photo Courtesy: Veeresh Malik

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+