Search
  • Follow NativePlanet
Share
» »సావన్ దుర్గ - బెంగళూరు ట్రెక్కర్లకు స్వర్గం !

సావన్ దుర్గ - బెంగళూరు ట్రెక్కర్లకు స్వర్గం !

By Mohammad

సావన్ దుర్గ ప్రాంతంలో కల ఎత్తైన కొండలు, దేవాలయాలు మరియు ప్రకృతి దృశ్యాలు, ఈ ప్రదేశాన్ని తప్పక చూడదగిన ప్రదేశంగా చెబుతారు పర్యాటకులు మరియు సాహస యాత్రికులు. ఈ పట్టణం బెంగుళూరు నగరానికి 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి ఇండియాలో ఎక్కడినుండైనా సరే తేలికగా చేరుకోవచ్చు.

కొండలు మరియు కోటలగురించి చెప్పాలంటే....సావన దుర్గ అక్కడి కొండలైన కరిగుడ్డ మరియు బిలిగుడ్డల కారణంగా ప్రసిద్ధి కెక్కింది. కరిగుడ్డ అంటే నల్లకొండ అని, బిలి గుడ్డ అంటే తెల్ల కొండ అని అర్ధంగా చెపుతారు. ఈ కొండలు దక్కన్ పీఠభూమికి సుమారు 1226 మీటర్ల ఎత్తున ఉన్నాయి. గట్టి రాళ్ళు, గ్రానైట్, లేటరైట్ లతో ఈ కొండలు ఎక్కేందుకు చాలా కష్టపడాలి. కొన్ని పరికరాల సహాయంతో పైకి ఎక్కి అలసిపోవలసిందే. కాని సాహస క్రీడాభిమానులు అధిరోహణ విలువైనదని భావిస్తారు. కొండల పైభాగంలో పురాతన కోట శిధిలాలుంటాయి.

సావన్ దుర్గ కొండ వ్యూ

సావన్ దుర్గ కొండ వ్యూ

చిత్ర కృప :abhi.imag

రాక్ క్లైంబింగ్ లేదా ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి లేనివారు వీరభద్రేశ్వర స్వామి మరియు నరసింహ స్వామి దేవాలయాలు దర్శించవచ్చు. ఈ దేవాలయాలు కొండ కింది భాగంలోనే ఉన్నాయి. చుట్టూ ఉంటే సీనరీలు అద్భుతంగా ఉంటాయి. నడక సాగిస్తే ఎన్నో అరుదైన చెట్లను, పిట్టలను చూసి ఆనందించవచ్చు. చరిత్ర పరిశోధకులకు కావలసినన్ని కప్పబడిన ప్రదేశాలున్నాయి.

ఇది కూడా చదవండి : మరువలేని మరో లోకం .. మడికేరి !

బెంగుళూరు, మాగడి ప్రదేశాలనుండి అనేక బస్సులు సావనదుర్గ సమీపం వరకు ఉన్నాయి. జర్నీ సమయం రెండు గంటలు మాత్రమే. మాగడినుండి సావన్ దుర్గకు ఆటోలు, స్ధానిక బస్సులలో కూడా చేరవచ్చు.

కొండ దిగువన ఉన్న ఆలయం

కొండ దిగువన ఉన్న ఆలయం

చిత్ర కృప : Vinod

నరసింహ స్వామి దేవాలయం

ప్రశాంతత ను కోరుకొనేవారికి నరసింహ స్వామి ఆలయం చెప్పుకోదగ్గది. సావన్ దుర్గ కొండ లలో ఉన్న ఈ ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. కొండ దిగువ భాగంలో ఈ గుడి ఉంటుంది. సహజ రాతి విగ్రహ రూపంలో నరసింహ స్వామి కనపడతాడు.

సావండి వీరభద్రేశ్వర స్వామి ఆలయం

వీరభద్రేశ్వర స్వామి ఆలయం సావన్ దుర్గ లో చూడవలసిన మరొక ఆలయం. ఈ ఆలయం కూడా కొండ దిగువ భాగంలో, నరసింహ స్వామి ఆలయం అవతలివైపు ఉన్నది. గుడి లో వీరభద్రేశ్వర స్వామి కొలువై ఉంటాడు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం సరస్సు. పర్వతారోహకులు, గుహాన్వేషకులు ఈ ఆలయానికి చేరుకోవటానికి ఇష్టపడతారు.

రాక్ క్లైమ్బింగ్ చేస్తున్న సాహసికులు

రాక్ క్లైమ్బింగ్ చేస్తున్న సాహసికులు

చిత్ర కృప : Manish Chauhan

నరసింహ స్వామి ఆలయం మరియు సావండి వీరభద్రేశ్వర స్వామి ఆలయాల మధ్యలో సయ్యద్ గులాం ఖాద్రి సమాధిని సమయముంటే సందర్శించండి.

మంచినబెలె డ్యాం

నగర హడావిడి జీవనం నుండి కొద్దిసేపు సేదతీరాలనుకొనేవారికి మంచినబెలె డ్యాం తప్పక సూచించదగినది. ఇది పర్యాటకులకు పిక్నిక్ స్పాట్ గా సేవలందిస్తుంది. ఈ డ్యాం ను ఆర్కావతి నదిపై నిర్మించారు. బెంగళూరు నుండి 40 కి. మీ ల దూరంలో ఉన్న డ్యామ్ వద్ద పక్షుల విహారాలను గమనించవచ్చు. సమీపంలో తిప్పగొండన హళ్ళి రిజర్వాయర్ ను కూడా పర్యాటకులు చూడవచ్చు.

నదిలో విహరిస్తున్న పర్యాటకులు

డ్యాం వద్ద విహరిస్తున్న పర్యాటకులు

చిత్ర కృప : Manish Chauhan

సావన్ దుర్గ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సావన్ దుర్గ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, విదేశాల నుండి కూడా ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సావన్ దుర్గ చేరుకోవచ్చు.

రైలు మార్గం

సావన్ దుర్గ లో రైల్వే స్టేషన్ లేదు. బెంగళూరు సమీప రైల్వే స్టేషన్ గా ఉన్నది. యశ్వంతపూర్(YPR), బెంగళూరు(SBC) స్టేషన్ ల నుండి క్యాబ్ లేదా టాక్సీ ల ద్వారా సావన్ దుర్గ చేరుకోవచ్చు.

మాన్సూన్ లో సావన్ దుర్గ

మాన్సూన్ లో సావన్ దుర్గ

చిత్ర కృప : Pavithrah

బస్సు / రోడ్డు మార్గం

బెంగళూరు నుండి సావన్ దుర్గ కు తరచూ ప్రభుత్వ బస్సులు / ప్రవేట్ బస్సులు మరియు ప్రవేట్ వాహనాలు నడుస్తుంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+