Search
  • Follow NativePlanet
Share
» »మలై మహదేశ్వర స్వామి ఆలయం, చామరాజనగర్ !!

మలై మహదేశ్వర స్వామి ఆలయం, చామరాజనగర్ !!

ఇతిహాసాల మేరకు, మహదేశ్వరుడంటే శివ భగవానుడి అవతారంగా కొలుస్తారను. స్ధానికులు శివుడు ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడని ఇప్పటికి ఈ దేవాలయంలోని లింగంలో ఆవహించి ఉంటాడని విశ్వసిస్తారు.

By Mohammad

మలై మహదేశ్వర కొండల సందర్శనలో అందమైన శివ భగవానుడి దేవాలయం పెద్ద ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని ప్రకృతి ప్రియులు కూడా తప్పక చూడవలసినదే. అద్భుతమైన ఈ దేవాలయ కట్టడం దట్టమైన అడవుల సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంత సందర్శనలో మీ శరీరం మరియు ఆత్మ రెండూ కూడా ఆనందాలను అనుభవిస్తాయి. ఆటవిక దేవాలయం మలై మహదేశ్వర కొండలు మైసూర్ పట్టణానికి సుమారు 140 కిలో మీటర్ల దూరంలో చామరాజ్ నగర్ జిల్లాలో ఉంటాయి. ఈ కొండలు సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో కలవు. మహదేశ్వర దేవాలయం ఎంతో అందమైనది. చుట్టూ కొండలు, అడవులు ఉంటాయి.

మలై మహదేశ్వర కొండలు

మలై మహదేశ్వర కొండలు

చిత్రకృప : Tumkurameen

ఇతిహాసాల మేరకు, మహదేశ్వరుడంటే శివ భగవానుడి అవతారంగా కొలుస్తారను. స్ధానికులు శివుడు ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడని ఇప్పటికి ఈ దేవాలయంలోని లింగంలో ఆవహించి ఉంటాడని విశ్వసిస్తారు. దేవాలయంలో అద్బుతం అంటే అక్కడ కల నిరంతరం ప్రవహించే నీటి బుగ్గ ఇది భూమి లోపలినుండి పైకి వస్తుంది. దీని మూల స్ధానం ఇంతవరకు కనిపెట్టబడలేదు.

మలై మహదేశ్వర కొండల అడవులు గంధపు మరియు వెదురు చెట్లు కలిగి ఉంటాయి. ఇక్కడ వన్యప్రాణులైన ఏనుగులు, చిరుతలు, లేడి, జింక, మరెన్నో జంతువులుంటాయి. ఈ కొండలలోని కొన్ని భాగాలలో గతంలో ఖ్యాతి కెక్కిన బందిపోటు గంధద వీరప్పన్ తలదాచుకునేవాడు. బెంగుళూరు మరియు మైసూర్ లనుండి మలై మహదేశ్వర కొండలను బస్సులలో చేరవచ్చు. వీటినే ఎం ఎం హిల్స్ అని కూడా అంటారు.

మలై మహదేశ్వర దేవాలయ సముదాయం

మలై మహదేశ్వర దేవాలయ సముదాయం

చిత్రకృప : Vedamurthy J

మలై మహదేశ్వర కొండల సందర్శనలో అందమైన శివ భగవానుడి దేవాలయం పెద్ద ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని ప్రకృతి ప్రియులు కూడా తప్పక చూడవలసినదే. అద్భుతమైన ఈ దేవాలయ కట్టడం దట్టమైన అడవుల సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంత సందర్శనలో మీ శరీరం మరియు ఆత్మ రెండూ కూడా ఆనందాలను అనుభవిస్తాయి. ఆటవిక దేవాలయం మలై మహదేశ్వర కొండలు మైసూర్ పట్టణానికి సుమారు 140 కిలో మీటర్ల దూరంలో చామరాజ్ నగర్ జిల్లాలో ఉంటాయి. ఈ కొండలు సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో కలవు. మహదేశ్వర దేవాలయం ఎంతో అందమైనది. చుట్టూ కొండలు, అడవులు ఉంటాయి.

దేవాలయం గోపురం

దేవాలయం గోపురం

చిత్రకృప : Pavithrah

మలై మహదేశ్వర స్వామి తన పులి వాహనాన్ని అధిరోహించి ఈ ప్రాంతంలో తిరుగుతాడని ఈ కొండపైగల ప్రజలను, రుషులను రక్షించేందుకు అనేక మహిమలు చూపుతాడని స్ధానిక ప్రజలు విశ్వసిస్తారు. ఈ ప్రాంత తెగల ప్రజలు మలై మహదేశ్వర స్వామిని తమ కుటుంబ దైవంగా ఆరాధిస్తారు. వీరిలో కదుకూరుబస్, జేను కురుబలు, మొదలైనవారు ప్రధానులు.

చరిత్ర సాక్ష్యాల మేరకు మలై మహ దేశ్వరుడు 15 వ శతాబ్దిలో ఉండేవాడని విశ్వసిస్తారు. అంతేకాక హరదన హళ్ళి మఠానికి ఆయన 3 వ నేతగా కూడా నమ్ముతారు. ఈ ప్రదేశానికి వచ్చిన భక్తులు, ఇక్కడి సరస్సు అంతరగంగలో పవిత్ర స్నానాలు చేస్తారు.'

రథోత్సవాలు

రథోత్సవాలు

చిత్రకృప : Siddarth P Raj

ఇది కూడా చదవండి : 'భారత నయాగరా' ఎక్కడ ఉందో తెలుసా ?

దేవాలయం ఉత్సవాలు/ జాతరలు

  • అభిషేకం సాధారణ దినాలు : ఉదయం 5:30 AM - 7:30 AM, 10:30 AM -12:30 PM మరియు 6:30 PM - 8:30 PM.
  • జాతర మరియు ప్రత్యేక దినాలలో : ఉదయం 4:00 AM - 6:00 AM (2 అభిషేక పూజలు) మరియు 6:30 PM - 8:30 PM (ఒక అభిషేకం పూజ).
  • మహారుద్రాభిషేక సేవ : ఉదయం 10:30 AM - 2:00 PM (కేవలం గురువారాలలో మాత్రమే మరియు ప్రత్యేక దినాలను మినహాయించి).
మలై మహదేశ్వర టెంపుల్ ప్రవేశం

మలై మహదేశ్వర టెంపుల్ ప్రవేశం

చిత్రకృప : Pavithrah

సమీప ఆకర్షణలు : శ్రీ సాలూరు మాత - 1 కి.మీ., శ్రీ కొడుగల్లు క్షేత్రం - 4 కి.మీ., శ్రీ పాదదారే క్షేత్రం - 16 కి.మీ., శ్రీ కొంబుడికి క్షేత్రం - 10 కి.మీ., శ్రీ తప్పసారే క్షేత్రం - 16 కి.మీ., శ్రీ నాగమలే క్షేత్రం - 18 కి.మీ., హొగెనక్కల్ ఫాల్స్ - 50 కి.మీ.

ఇది కూడా చదవండి : బెంగళూరు లో ఈ దేవాలయాలను చూశారా ?

మలై మహదేశ్వర గుడికి ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం : మలై మహదేశ్వర కొండలు చేరుకోవటానికి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరువలో ఉన్నది. 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా టాక్సీలో ప్రయాణించి ఎం ఎం హిల్స్ చేరుకోవచ్చు.

సమీప రైల్వే స్టేషన్ : మైసూర్ రైల్వే స్టేషన్ సమీపాన ఉన్నది. ఇక్కడి నుండి ప్రభుత్వ బస్సుల్లో, టాక్సీ లో ప్రయాణించి మలై మహదేశ్వర ఆలయం చేరుకోవచ్చు.

బస్సు/రోడ్డు మార్గం : చామరాజనగర్, మైసూరు, బెంగళూరు నుండి ఎం ఎం హిల్స్ (మలై మహదేశ్వర కొండలు) కు ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు నిత్యం తిరుగుతాయి. మైసూర్ నుండి ప్రతి గంటకు ఇక్కడికి బస్సులు కలవు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+