Search
  • Follow NativePlanet
Share
» »'భారత నయాగరా' ఎక్కడ ఉందో తెలుసా ?

'భారత నయాగరా' ఎక్కడ ఉందో తెలుసా ?

పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం హొగెనక్కల్. హొగెనక్కల్ కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్ళాలి. దాదాపు దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించదు.

By Mohammad

నయాగరా జలపాతం చూడాలని ఎవరికి ఉండదు !! కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువ. వెళ్ళి చూసిరావాలంటే విమానంలో వెళ్ళాలి ఎంతైనా అమెరికా కదా !! అయినా ఆ జలపాతాన్ని చూస్తే అంతవరకు ఖర్చు చేసిన డబ్బు కానరాదు. ఇది నయాగరా జలపాతం గురించి. మరి మన ఇండియాలో కూడా నయాగరా జలపాతాన్ని తలపించే జలపాతం ఉంది. ఈ జలపాతానికి, నయాగరాకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. చెప్పాలంటే కవలపిల్లలు అనుకోండీ! అందుకే ఈ జలపాతానికి 'భారతీయ నయాగరా' అని పేరు. అదెక్కడో తెలుసుకోవాలంటే చలో బెంగళూరు .. !!

హొగెనక్కల్ జలపాతం కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో ఉంది. ఇది బెంగుళూరు నుండి 180 కిలోమీటర్లు మరియు ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరంలో ఉంది. దీనినే "భారతీయ నయాగరా జలపాతం" అని పిలుస్తారు. కార్బొనటైట్ రాళ్ళు దక్షిణాసియాలోను మరియు ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు.

ఇది కూడా చదవండి : తిరుపతి సమీప జలపాతాలు !!

ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జలపాతం...చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించడం దీని ప్రత్యేకత... ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే హోగెనక్కల్‌ సహజత్వానికి చేరువగా ఉంటుంది. పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం. హోగెనక్కల్‌కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్ళాలి. దాదాపు దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించదు. జలపాతానికి కిలోమీటర్‌ దూరంనుండే ఝుమ్మనే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎత్తు నుండి జాలువారుతున్న నీటి సందడిదే. ముందుకెళ్ళే కొద్దీ శబ్దం ఎక్కువవుతుంది.

పొగరాయి

పొగరాయి

జలపాతం నీరు రాళ్ళమీద పడినప్పుడు లేచిన నీటి తుంపర్లు పొగలాగా కనిపిస్తుంది. కన్నడంలో 'హొగె' అనగా పొగ మరియు 'కల్' అనగా రాయి కలిపి 'హొగెనక్కల్' అనగా పొగలు చిమ్మే రాయి.

చిత్రకృప : Thamizhpparithi Maari

కావేరీ నది

కావేరీ నది

కావేరీ నది హొగెనక్కల్ చేరేసరికి చాలా విశాలంగా తయారై కొండ చరియల మీద పడుతూ చాలా జలపాతాల్ని తయారుచేస్తుంది. వీటిలో కొన్ని సుమారు 20 మీటర్లు ఎత్తుంటాయి.

చిత్రకృప : Akashdpakash

వాతావరణం

వాతావరణం

ఈ జలపాతాన్ని సందర్శించడానికి వర్షాకాలం తర్వాత నదీజలాలు నిండుగా ప్రవహిస్తున్నప్పుడు సరైన సమయం. ఇక్కడి ఉష్ణోగ్రత వేసవిలో గరిష్టం 34, కనిష్టం 23 డిగ్రీలుగా నమోదవుతాయి.

చిత్రకృప : Mithun Kundu

స్నానం

స్నానం

ఈ జలపాతం పరిసరాలలో ప్రత్యేకంగా నిర్మించిన స్నానఘట్టాలున్నాయి. కొన్ని మైళ్ళు విస్తరించిన నదీజలాలు అడవుల గుండా ప్రయాణించి ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లను తాకుతూ ప్రవహిస్తాయి. అందువలన ఈ నీటిలో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు. చుట్టూ ఉండే కొండలు అతి సుందరంగా కనిపిస్తాయి.

చిత్రకృప : Mithun Kundu

బోట్ షికారు

బోట్ షికారు

జలపాతం అందాలు చూడడానికి ఇక్కడ సుమారు 400 తెప్పలున్నాయి. నీటి ప్రవాహం తక్కువగా ఉండే వేసవి కాలంలో మాత్రమే వీటిని అనుమతిస్తారు. ఒక్కొక్క తెప్ప ఎనిమిది మందిని తీసుకొని పోగలదు. ఇవి వెదురుతో తయారుచేసి తడిసిపొకుండా జంతుచర్మం లేదా ప్లాస్టిక్ తో కప్పుతారు.

చిత్రకృప : Ashwin Kumar

విహారం

విహారం

ఈ తెప్పల్ని ఒకే తెడ్డుతో సులువుగా నడుపుతారు. ఈ తెప్పల విహారం ఒక ప్రసిద్ధి చెందిన సాహస క్రీడ అయినప్పటికీ, ఇది పురాతన కాలం నాటి ఒక ప్రయాణ సాధనం. నీటిపై సాహస క్రీడలకు ఆసక్తి కల పర్యాటకులకు ఈ తెప్పల విహారం ఆనందానిస్తుంది.

చిత్రకృప : Ashwin Kumar

లెక్కపెట్టలేనన్ని జలపాతాలు

లెక్కపెట్టలేనన్ని జలపాతాలు

అక్కడ ఒకటి, రెండు కాదు, లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతుంటాయి. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం గొప్ప థ్రిల్లింగ్‌ ఇచ్చే సాహసం.

చిత్రకృప : Xtraordinarykid

నీటిలో ఔషధ గుణాలు

నీటిలో ఔషధ గుణాలు

హోగేనక్కల్‌ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్‌కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు. ఇక్కడి వాళ్లకు ఇది కుటీర పరిశ్రమ.

చిత్రకృప : Soham Banerjee

తప్పక రుచి చూడాల్సిందే

తప్పక రుచి చూడాల్సిందే

హోగెనక్కల్‌ ట్రిప్‌లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఆ రుచి మరెక్కడి చేపకూ రాదు. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంత సేపు ఉన్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది.

చిత్రకృప : Praveen

నయాగారా ఆఫ్‌ ఇండియా

నయాగారా ఆఫ్‌ ఇండియా

హోగేనక్కల్‌ జలపాతాలు బెంగళూరు నుండి 180 కి.మీ ల దూరంలో తమిళనాడు ధర్మపురి జిల్లాలో కావేరి నది మీద ఉంది. దీనిని `నయాగరా ఫాల్స్ ఆఫ్‌ ఇండియా' అని కూడా పిలుస్తారు. ఈ జలపాతాల నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయి మరియు ప్రత్యేక బోటు రైడ్‌‌సకి ప్రాచుర్యం సంతరించుకున్నది. ఈ ప్రాంతంలో కనిపించే కార్బోనేట్‌ శిలలు ఆసియా లోనే కాదు, ప్రపంచంలోకల్లా అతిపురాతనమైనవని భావిస్తారు.

చిత్రకృప : Sankara Subramanian

సాహస క్రీడలకు

సాహస క్రీడలకు

వేసవికాలంలో, ఈ జలపాతాల నీరు బలమైన ప్రవాహాలు లేని సమయంలో, ప్రత్యేక కొరకిల్స్ (రౌండ్‌ పడవలు) ప్రయాణించేందుకు ప్రయాణికులు తీసుకుంటారు. అప్పుడే పట్టుకున్న తాజా చేపలను కొరకిల్స్ లో కొనుక్కోవొచ్చు. ఇక్కడ త్రాగే నీటి పాకెట్లను మరియు స్నాక్స్ ను, ఇంకా అనేక రకాల వస్తువులను అమ్ముతుంటారు.

చిత్రకృప : GoDakshin

పెన్నాగరం

పెన్నాగరం

ఈ గ్రామము దట్టమైన అడవి మధ్యలో హొగెనక్కల్ జలపాతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ పట్టుపురుగుల కోసం పెంచే మల్బారి తోటలను, స్థానికులు టెర్రాకొట్టతో తయారుచేసే విగ్రహాలను (స్థానికులు వీటిని ఐయనార్స్) చూడవచ్చు. వారానికొకసారి జరిగే కన్నులపండుగగా ఉంటుంది.

చిత్రకృప : Thamizhpparithi Maari

సుబ్రమణ్యశివ స్మారక చిహ్నం

సుబ్రమణ్యశివ స్మారక చిహ్నం

సుబ్రమణ్య శివ ధైర్యవంతుడు, గొప్ప దేశభక్తుడు. ఇతను తమిళనాడు ప్రాంతానికి చెందినప్పటికీ ఈ ప్రాంతంలోని యువకులకు స్వాతంత్య్ర ఉద్యమ పోరాటం లో ముందుండి నడిపించాడు. దెబ్బలు తిన్నాడు. జైలుకు పోయాడు. అయన మరణించిన తర్వాత జ్ఞాపకార్థంగా ఒక స్మారకచిహ్నాన్ని పెన్నాగరం గ్రామము లోనే ఏర్పాటు చేశారు.

చిత్రకృప : Thamizhpparithi Maari

హొగెనక్కల్ జలపాతానికి ఎలా చేరుకోవాలి ?

హొగెనక్కల్ జలపాతానికి ఎలా చేరుకోవాలి ?

హొగెనక్కల్ జలపాతానికి చేరుకోవటానికి సరైన మార్గం బెంగళూరు. బెంగళూరు నుండి హొగెనక్కల్ జలపాతానికి సులభంగా చేరుకోవచ్చు.

బెంగళూరు నుండి వయా హోసూరు, క్రిష్ణగిరి, ధర్మపురి మీదుగా హొగెనక్కల్ జలపాతానికి చేరుకోవచ్చు. బెంగళూరు నుండి ఈ జలపాతం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ జలపాతానికి సమీప విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కూడా బెంగళూరే !!

చిత్రకృప : Ashwin Kumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X