Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు లో ఈ దేవాలయాలను చూశారా ?

బెంగళూరు లో ఈ దేవాలయాలను చూశారా ?

By Mohammad

బెంగళూరు భారతదేశ ఐటి రంగానికి హృదయం వంటిది. భారతదేశ సిలికాన్ వ్యాలీ గా ఖ్యాతి గాంచిన బృహత్ బెంగళూరు ను సందర్శించే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా బెంగళూరు మరియు దాని చుట్టుప్రక్కల ప్రదేశాలను చూడటానికే లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారంటే నమ్మశక్యం కావట్లేదు కదూ !! బెంగళూరు లో చూడటానికి అనేక వినోద, మత, విజ్ఞాన ప్రదేశాలు ఉన్నాయి. ఇవేకాదు రెస్టారెంట్లు, హోటళ్ళు, ఆకాశాన్ని తాకే భవనాలు, టవర్లు, విద్యాలయాలు మొదలైనవి ఉన్నాయి.

ఇది కూడా చదవండి : బెంగళూరు ప్యాలెస్, కర్ణాటక !

బెంగళూరు లో చూడటానికి దేవాలయాలు అనేకం కలవు. వాటిలో ప్రత్యేకంగా చూడవలసినవి, ప్రసిద్ధి గాంచినవి కొన్నే ఉన్నాయి. బెంగళూరు మొత్తంలో వెయ్యికి పైగా పాత, కొత్త దేవాలయాలు కలవు. అయినప్పటికీ బెంగళూరు వచ్చే యాత్రికులు ఇబ్బంది పడకుండా ఏ దేవాలయం చూడాలి ? ఎలా చేరుకోవాలి ? అనేది మీ నేటివ్ ప్లానెట్ అందిస్తున్నది. చూసి తరించండి.

ఇది కూడా చదవండి : బెంగళూరు : మీకు తెలియని వారాంతపు విహార ప్రదేశాలు !

చొక్కనాథస్వామి ఆలయం

చొక్కనాథస్వామి ఆలయం

బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్, దోంలూర్ దగ్గర చొక్కనాథస్వామి దేవాలయం ఉన్నది. దీనిని క్రీ.శ.10 వ శతాబ్దంలో చోళులు మహావిష్ణువు కొరకు నిర్మించి అంకితం చేశారు. 20 ఏళ్ళ కిందట దేవాలయం స్లాబ్ పునః నిర్మించబడింది. గుడి స్తంభాలపై విష్ణుమూర్తి దశావతారాలను అందముగా చెక్కారు.

చిత్రకృప : Sagar Sakre

బుల్ టెంపుల్

బుల్ టెంపుల్

బుల్ టెంపుల్ బసవనగుడి లో కలదు. ఇందులో ప్రధాన దైవం నంది. నంది శివుని వాహనం. ఈ దేవాలయాన్ని 1537 లో కెంపె గౌడ నిర్మించాడు. నంది విగ్రహం కొలతలు 15 ఎత్తు * 20 వెడల్పు కలిగి ఉంటుంది. దీనిని ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ప్రతి ఏడాది చివర్లో (నవంబర్ -డిసెంబర్) వేరుశెనగ పండగ పెద్ద ఎత్తున జరుగుతుంది.

చిత్రకృప : John Hoey

దొడ్డ గణేశా టెంపుల్

దొడ్డ గణేశా టెంపుల్

దొడ్డ గణేశా టెంపుల్ కూడా బసవనగుడి లోనే కలదు. ఇది బుల్ టెంపుల్ పక్కనే ఉన్నది. కన్నడ లో దొడ్డ అంటే పెద్దది అని. పేరుకుతగ్గటే ఇక్కడ పెద్ద రాతిమీద వినాయక ప్రతిమను చెక్కినారు. విగ్రహం 18 ఎత్తు * 16 పొడవు కొలతలను కలిగి ఉంటుంది. సత్యగణపతి లేదా శక్తి గణపతి మహిమకలవాడని చెబుతారు.

చిత్రకృప : Mallikarjunasj

గవి గంగాధరేశ్వర టెంపుల్

గవి గంగాధరేశ్వర టెంపుల్

పరమ శివుడికి అంకితం చేయబడిన గవి గంగాద రేశ్వర దేవాలయం ను 'గవిపురం కేవ్ టెంపుల్' అని కూడా పిలుస్తారు. ఇండియన్ రాతి నిర్మాణానికి ఇదిఒక ఉదాహరణ. టెంపుల్ లోని గర్భగుడిలో ప్రతిఏటా ఒక నిర్దిష్ట కాలమానం ప్రకారం సూర్యకిరణాలు విగ్రహంపై పడతాయి. ఆ బృహత్ దృశ్యాన్ని చూడటానికి భక్తులు అధికంగా వస్త్తారు. ఇక్కడే అరుదుగా కనిపించే అగ్నిదేవుని విగ్రహం కూడా కలదు.

సందర్శనవేళలు : ఉదయం 07:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మరియు సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:30 వరకు.

చిత్రకృప : Pavithrah

ఇస్కాన్ టెంపుల్

ఇస్కాన్ టెంపుల్

ఇస్కాన్ ఆలయం బెంగుళురు లో తప్పక దర్శించవలసిన దేవాలయం. ఇది యశ్వంతపుర ఏరియాలో, ఓరియన్ మాల్ చేరువలో రాజాజీనగర్ లో కలదు. శ్రీ రాధా కృష్ణ చంద్ర టెంపుల్ గా ప్రసిద్ధికెక్కిన ఈ దేవాలయం హరే కృష కొండ పై పదకొండు ఎకరాల స్థలంలో (ప్రస్తుతం) నిర్మించబడింది. ఇక్కడ బంగారుపూతతో ఉన్న ధ్వజస్థంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిఎత్తైనది. అంతేకాదు 36*18 చ.అ. వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది.

టైమింగ్స్ : 4:15 AM - 5:00 AM, 7:15 AM - 1:00 PM, 4:00 PM - 8:20 PM.

చిత్రకృప : Akshatha Inamdar

శివ ఆలయం

శివ ఆలయం

శివ ఆలయం ఎయిర్ పోర్ట్ రోడ్ లో కలదు. 65 అడుగుల ఎత్తు కలిగిన శివుని ప్రతిమ లోటస్ లో కూర్చొని ఉన్న తీరు భక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది. పండుగలు, సెలవు దినాలలో నాలుగు లక్షల మంది ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారని అంచనా. విగ్రహం వెనుక హిమాలయాలు, గంగా నది భక్తులను యిట్టె ఆకర్షిస్తుంది.

టైమింగ్స్ : 6:00 AM - 8:00 PM.

చిత్రకృప : John Hoey

బనశంకరి టెంపుల్

బనశంకరి టెంపుల్

బనశంకరి అమ్మన్ టెంపుల్, కనకపురా రోడ్ లో కలదు. ఈ గుడిని 1915 లో బనశంకరి అమ్మన్ కు అంకితం చేశారు. రాహుకాల దోషాలను నివారించడంలో అమ్మవారికి సాటిలేరు ఎవ్వరూ !! సంవత్సరంలో అన్ని దినాలు గుడి తలుపులు భక్తుల కొరకు తెరిచే ఉంచుతారు. 13 సెప్టెంబర్, దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

టైమింగ్స్ : 6:00 AM - 8:00 PM.

చిత్రకృప : Rangakuvara

వెంకటరామన్ స్వామి టెంపుల్

వెంకటరామన్ స్వామి టెంపుల్

బసవనగుడి లోని విశ్వేశ్వరపురం వద్ద ఈ దేవాలయం ఉన్నది. ఇక్కడి ప్రధాన దైవం లార్డ్ వెంకటరామ. దేవాలయంను ద్రవిడ నిర్మాణ శైలిలో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. గుడి గోడపై బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర చిత్రాలు చూడవచ్చు. ఈ గుడి కట్టి 300 సంవత్సరాలైనప్పటికే ఇప్పటికీ వన్నెతగ్గకుండా భక్తులను ఆకర్షిస్తుంది.

టైమింగ్స్ : 6:00 AM - 8:00 PM.

చిత్రకృప : Omshivaprakash

సుగ్రీవ వెంకటేశ్వర ఆలయం

సుగ్రీవ వెంకటేశ్వర ఆలయం

బాలేపేట్ లోని ఈ దేవాలయంలో సుగ్రీవ మరియు వెంకటేశ్వర విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అలాగే ఆరు అడుగుల ఎత్తులో సుగ్రీవుడు ఉన్నాడు.

టైమింగ్స్ : 6:00 AM - 8:00 PM.

చిత్రకృప : Dineshkannambadi

కన్యక పరమేశ్వరి టెంపుల్

కన్యక పరమేశ్వరి టెంపుల్

కన్యక పరమేశ్వరి ఆలయం కుమార పార్క్ లో కలదు. ఇక్కడి ప్రధాన దైవం కన్యక పరమేశ్వరి. గోడలమీద మార్బుల్ పనితనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాటి మీద భాగవతం, వాసవి పురాణాలకు సంబంధించిన నీతివాక్యాలను చెక్కినారు.

చిత్రకృప : SrinivasBY

ధర్మరాయ ఆలయం

ధర్మరాయ ఆలయం

పాత బెంగళూరులోని ధర్మరాయ దేవాలయం తప్పక సందర్శించదగినది. ఇక్కడ ప్రతిఏటా ఏప్రియల్ మాసంలో కరగ అనే ప్రాచీన ఉత్సవం జరుగుతుంది. అందులో పాల్గొనే వ్యక్తి స్త్రీ వేషం ధరించి ఊరేగింపుగా వస్తాడు. పాండవులకు అంకితం చేయబడిన దేవాలయం ఇది. బహుశా !! భారతదేశంలో ఇటువంటి దేవాలయం ఎక్కడా కనిపించదేమో !!

చిత్రకృప : Thigala shri

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more