Search
  • Follow NativePlanet
Share
» »నమక్కల్ లో ఈ దేవాలయాలను చూశారా ?

నమక్కల్ లో ఈ దేవాలయాలను చూశారా ?

ఈ సిటీ కి దాని పేరు నామ గిరి నుండి వచ్చింది. నామగిరి అంటే నగర మధ్యన కల ఒక ఏక శిల. నమక్కల్ తమిళ్ నాడు లోని కొంగు నాడులో ఒక భాగంగా వుండేది.

By Mohammad

ఇండియా లోని దక్షిణ భాగం లో తమిళనాడు లో కల నమక్కల్ ఒక నగరం మరియు పాలనా ప్రాంత జిల్లా. ఒక మంచి పర్యాటక ప్రదేశం. నమక్కల్ అనేక మందికి వివిధ రంగాలలో ఆసక్తి కలిగే ఆకర్షణలు అందిస్తుంది. ఈ నగరం ప్రఖ్యాతి చెందిన చారిత్రక నగరం, ఒక విద్యావంతుల నగరం, ఒక కోడి ఉత్పత్తుల నగరం మరియు రవాణా సిటీ. నమక్కల్ చరిత్ర 7 వ శతాబ్దం నాటిది.

చరిత్ర లోకి ఒకసారి తొంగి చూస్తె....

ఈ సిటీ కి దాని పేరు నామ గిరి నుండి వచ్చింది. నామగిరి అంటే నగర మధ్యన కల ఒక ఏక శిల. నమక్కల్ తమిళనాడు లోని కొంగు నాడులో ఒక భాగంగా వుండేది. ఈ పట్టణం అడియమాన్ తెగ కు చెందిన గుణశీలచే పాలించబడింది. రంగనాథ స్వామి టెంపుల్ మరియు నరసింహ స్వామి టెంపుల్ లను గుణశీల రాజు నిర్మించాడు. తర్వాత ఈ రాజ్యం చోళుల ఆధీనంలోకి మరియు తర్వాత 14వ శతాబ్దం వరకూ హోయసలుల పాలనలోకి వచ్చింది. వీరి తర్వాత విజయనగర్ రాజులు, మదురై నాయాకులు, బీజాపూర్ సుల్తాన్ లు, గోల్కొండ మైసూరు రాజులు, మరాఠాలు, హైదర్ అలీ మరియు చివరకు బ్రిటిష్ వారు ఈ నగరాన్ని పాలించారు. ప్రాంత సంస్కృతి పై ప్రతి పాలకుడు తనదైన ముద్ర వేసాడు.

ఇది కూడా చదవండి : మహాబలిపురం ... పల్లవుల అద్భుత సృష్టి !!

నమక్కల్ లోను మరియు చుట్టుముట్ల కల ఆకర్షణలు

నమక్కల్ లో పర్యాటకులకు అనేక ప్రదేశాలు కలవు. వాటిలో ఆంజనేయ టెంపుల్, నరసింహ టెంపుల్, కూలిప్పత్తి మురుగన్ టెంపుల్, తాత గిరి మురుగన్ టెంపుల్, తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్ మరియు ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్ వంటివి ప్రధానమైనవి.

నమక్కల్ దుర్గం కోట మరొక ప్రధాన ఆకర్షణ. రాక్ ఫోర్ట్ మరియు నైనా - మలై లు కూడా టూరిస్ట్ కేంద్రాలే.

నమక్కల్ ఆంజనేయ టెంపుల్

నమక్కల్ ఆంజనేయ టెంపుల్

యాత్రికులకు, పర్యాటకులకు ఇక్కడ కల ఆంజనేయ టెంపుల్ తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ టెంపుల్ సుమారు 1500 ఏళ్ల నాటిది. నమక్కల్ కోట దిగువ భాగంలో కలదు. నరసింహ టెంపుల్ కు సుమారు వంద మీటర్ల ఎదురుగా కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఇది 13 అడుగుల ఎత్తు కలది. ఆంజనేయ విగ్రహం లార్డ్ నరసింహకు అభిముఖంగా వుంటుంది.

చిత్రకృప : Chitrinee

నమక్కల్ రాక్ ఫోర్ట్

నమక్కల్ రాక్ ఫోర్ట్

రాక్ ఫోర్ట్ ఒక కొండపై వుంటుంది. దీనికి చేరాలంటే కష్టపడి ఒక అరగంట పాటు కొండ ఎక్కాలి. ఈ కోట ప్రసిద్ధి చెందినది, మరియు దేశం లోని కోటలు అన్నిటి లోకి సురక్షితమైనది. సుమారు 75 మీటర్ల ఎత్తున కలదు. ఈ కోటను 9 వ శతాబ్దంలో నిర్మించారు.

చిత్రకృప : Thamizhpparithi Maari

కూలిప్పటి మురుగన్ టెంపుల్

కూలిప్పటి మురుగన్ టెంపుల్

కూలిప్పటి మురుగన్ టెంపుల్ నమక్కల్ నుండి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఇది తురయార్ మార్గం లో కలదు. ఒక కొండ పై కల ఈ ప్రదేశం స్థానికులకు పర్యాటకులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. పురాతన ఈ టెంపుల్ కు తప్పక వెళ్ళ వలసినదే.

చిత్రకృప : kurumban

నామగిరి లక్ష్మి నరసింహ టెంపుల్

నామగిరి లక్ష్మి నరసింహ టెంపుల్

శ్రీ నరసింహ టెంపుల్ కొండ దిగువ భాగంలో కలదు. ఇది పురాతన టెంపుల్. దీనిని అడియామన్ తెగ రాజు గుణశీల నిర్మించాడు. ఇక్కడ నరసింహ విగ్రహం రాతితో చేయబడినది. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ నరసింహ టెంపుల్ కు అనేక మంది భక్తులు వచ్చి ఆశీస్సులు పొందుతారు. ఇది ఒక వైష్ణవ క్షేత్రం.

చిత్రకృప : Balajijagadesh

ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్

ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్

ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్ కొల్లి కొండల దిగువ భాగంలో కలదు. ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ ను రైతుల దేముడుకి అంకితం చేసారు. ఇక్కడి దేముడి విగ్రహం బహిరంగంగా ఒక మర్రి చెట్టు కింద వుంటుంది. చాలా మంది భక్తులు ఈ టెంపుల్ కు ఆదివారాలు వస్తారు.

చిత్రకృప : kurumban

నైనా మలై

నైనా మలై

నైనా మలై నమక్కల్ సిటీ కి 10 కి.మీ.ల దూరంలో కల ఒక చిన్న కొండ. తిరుమలై పట్టి గ్రామానికి సమీపంగా వుంటుంది. నైనా మలై కొండపై వెంకట చలపతి టెంపుల్ కలదు. దీనిని చేరాలంటే , 2500 మెట్లు ఎక్కాలి. అయినప్పటికీ భక్తులు శనివారాలు ఇతర పండుగ దినాలలో అధిక సంఖ్య లో ఈ టెంపుల్ దర్శిస్తారు.

చిత్రకృప : kurumban

తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్

తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్

తిరుచెంగోడు అర్ధనారేశ్వర టెంపుల్ నమక్కల్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక శివ టెంపుల్. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తున కలదు. అర్ధనారేశ్వర్ విగ్రహం లో శివ మరియు పార్వతి లు కలవు. విగ్రహం సగం పురుష మరియు సగం మహిళగా కనపడుతుంది.

చిత్రకృప : Ravindraboopathi

నమక్కల్ దుర్గం కోట

నమక్కల్ దుర్గం కోట

నమక్కల్ దుర్గం కోటను 16 వ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఇది నామగిరి కొండలపై కలదు. ఈ కోట ఇపుడు పురాతన విష్ణు టెంపుల్ శిధిలాలు కలిగి వుంది. నామ గిరి హిల్స్ కు ఇరువైపులా నరసింహస్వామి మరియు రంగనాథ స్వామిల కొండ గుహ టెంపుల్స్ కలవు.

చిత్రకృప : Ravindraboopathi

తాతగిరి మురుగన్ టెంపుల్

తాతగిరి మురుగన్ టెంపుల్

తాతగిరి మురుగన్ టెంపుల్ నమక్కల్ నుండి ముతూ గాపట్టి వెళ్ళే మార్గం లో పది కి.మీ.ల దూరంలో కలదు. దీనిని ఒక చిన్న కొండపై నిర్మించారు. మహర్షి కిరుపానంద వారియర్ ఈ టెంపుల్ ను ప్రశాంతత కొరకు తరచుగా దర్సిన్చేవాడని చెపుతారు.

చిత్రకృప : yoursloving.sunil59

నమక్కల్ ఎలా చేరుకోవాలి ?

నమక్కల్ ఎలా చేరుకోవాలి ?

సమీప ఎయిర్ పోర్ట్ : తిరుచిరప్పల్లి - 74 కి.మీ.

సమీప రైల్వే స్టేషన్లు : సేలం మరియు కరూర్ రైల్వే స్టేషన్లు

బస్సు మార్గం : చెన్నై, సేలం, కరూర్ నుండి నమక్కల్ కు బస్సులు తిరుగుతాయి.

చిత్రకృప : Rsrikanth05

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+