Search
  • Follow NativePlanet
Share
» »ఈ సీజ‌న్‌లో భార‌త్‌లోని మంచు ప్ర‌దేశాలను సంద‌ర్శించాల్సిందే..

ఈ సీజ‌న్‌లో భార‌త్‌లోని మంచు ప్ర‌దేశాలను సంద‌ర్శించాల్సిందే..

శీతాకాలంలో సందర్శించాల్సిన ప్రదేశాల కోసం చూస్తున్నట్లయితే, భార‌త‌దేశంలోని ఈ ప్ర‌దేశాలు ఎంతో అనువైన‌వి. హిమపాతాన్ని చూడాలని ఇష్టపడితే వారికి ఇక్క‌డ ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. శీతాకాలంలో ఈ ప్రదేశాల దృశ్యం ఎంతో అందంగా ఉంటుంది. ఫోటోగ్రఫీకి కూడా ఈ ప్ర‌దేశాలు ఎంతో అనువైన‌వ‌నే చెప్పుకోవ‌చ్చు. భారతదేశంలోని కొన్ని ప్రదేశాలు సంద‌ర్శించేందుకు డిసెంబర్-జనవరి ఉత్తమ సీజన్. కాబట్టి ఈ స‌మ‌యాల్లో ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు.ఈ నెలలో ఈ ప్రదేశాలలో భారీ హిమపాతం ఉంటుంది. దీని కారణంగా ఇక్కడ ప్ర‌తి ప్ర‌దేశం వీక్షించేందుకు ఎంతో భిన్నంగా ఉంటుంది. హిమపాతం కారణంగా, అనేక రకాల సాహస కార్యకలాపాలు కూడా ఇక్కడ ప్రారంభమవుతాయి. అలాంటి కొన్ని గొప్ప ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

tawangsela-pass

తవాంగ్

ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్‌లలో నివసించే ప్రజల కోసం, సిమ్లా, మనాలి వంటి వినోదాన్ని ఆస్వాదించేందుకు సమీప ప్రదేశాలు. కానీ,, ఇక్కడ ప‌ర్యాట‌కులు వేసవి నుండి చలికాలం వరకు వెళ్లి హిమపాతం చూడాలని ప్లాన్ చేసుకోవచ్చు. భార‌త్‌లోని ఇత‌ర ప్రాంతాలు వారు మాత్రం త‌ప్ప‌కుండా ఈ సీజ‌న్‌లో త‌వాంగ్ సంద‌ర్శ‌న‌కు సిద్ధం కావొచ్చు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఎప్పుడైనా ఇక్కడి ప్ర‌దేశాల‌ను చుట్టేయొచ్చు.ఈ నెలల్లో ఇక్కడ భారీ హిమపాతం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య ప్రాంతంలో వున్న తవాంగ్ ఒక‌ బౌద్ధమత ప్రాంతంగా విరాజిల్లుతుంది. ఇక్కడ పడే మంచు హిమపాతం పర్యాటకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ ప్రదేశానికి టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా వస్తూనే వుండ‌డం విశేషం. ఈ ప్ర‌దేశంలో బౌద్ధులు అధికంగా నివ‌సిస్తుంటారు.

auliindia

ఔలి

శీతాకాలంలో పిల్లలతో కలిసి విహారించాల‌ని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒక గొప్ప గమ్యస్థానమ‌నే చెప్పుకోవాలి. ఇక్కడకు రావడం ద్వారా పిల్లలు చాలా ఆనందిస్తారు. ఇక్కడ హిమపాతంతో పాటు స్కీయింగ్ కూడా ఉంది. దాని కోసం ఇక్క‌డ ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా ఇస్తారు. ఈ ప్ర‌దేశాన్ని సందర్శించ‌డం ద్వారా ఆసియాలోనే అతి పొడవైన కేబుల్ కారు మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత సరస్సును కూడా చూడవచ్చు. ఔలికి ఉత్త‌రాన బద్రీనాథ్ ఆల‌యం ఉంది. ఇది హిందువులకు అత్యంత ప‌విత్ర‌మైన పుణ్య‌క్షేత్రం. ఈ సీజ‌న్‌లో ఈ ప్ర‌దేశమంతా పూర్తిగా మంచుతో క‌ప్ప‌బ‌డి ఉంటుంది. ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించేందుకు డిసెంబ‌ర్ నుండి ఫిబ్ర‌వరి నెల ఉత్త‌మ‌మైన‌ది. ఈ ప్ర‌దేశం స్థానిక తెగ‌ల‌తో ప్ర‌సిద్ధిచెందింది.

gulmarglandscape

గుల్మార్గ్

కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్ర‌తి సీజ‌న్‌లో భిన్నంగా క‌నిపిస్తుంటుంది. కాబట్టి శీతాకాలంలో కాశ్మీర్ కోసం ఎందుకు ప్లాన్ చేయకూడదు. హిమపాతం చూడాలనుకునేవారు త‌ప్ప‌కుండా గుల్మార్గ్‌కి వెళ్లాల్సిందే. అందమైన దృశ్యాలు, మంచుతో కప్పబడిన పర్వతాలను చూసేందుకు డిసెంబర్ నుండి జనవరి వరకు ఉత్తమ సమయం. శీతాకాలంలో మాత్రం ఈ ప్రాంతంలోని దారులన్నీ మంచుతో నిండిపోయి ఉంటాయి. ఇళ్లపైకప్పులపైకి పాకిన తీగలు పూలతో ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంటాయి. ఇంకా ఇక్క‌డ‌, ఆరుబయట ఉండే ఆపిల్‌ తోటల‌న్నీ మంచుతో నిండి ఉంటాయి. అక్కడున్న వాళ్ల సంగతేమో కానీ, ఈ అద్భుత‌మైన దృశ్యాల‌ను చూసేందుకు పర్యాటకులు గుల్మార్గ్ ప‌య‌ణానికి సిద్ధ‌మ‌వుతుంటారు. కాశ్మీర్‌లోని అత్యంత అందమైన ప్రాంతాల్లో గుల్మార్గ్‌ ఒకటి. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌లో ప్రతీ ఏడాది ఈ వింటర్ సీజన్లో పర్యాటకుల తాకిడి ఎక్కువ‌గానే ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+