Search
  • Follow NativePlanet
Share
» »'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

కృష్ణా నది భారతదేశంలో ప్రవహించే జీవనది. జీవనది అంటే ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ప్రవహించే నది అని అర్థం. దక్షిణ భారత దేశంలో గోదావరి నది తరువాత రెండవ అతి పెద్ద నది ఈ కృష్ణా.

By Venkatakarunasri

కృష్ణా నది భారతదేశంలో ప్రవహించే జీవనది. జీవనది అంటే ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ప్రవహించే నది అని అర్థం. దక్షిణ భారత దేశంలో గోదావరి నది తరువాత రెండవ అతి పెద్ద నది ఈ కృష్ణా. ఎక్కడో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ లో పుట్టి, ఆంధ్ర ప్రదేశ్ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. పడమర దిక్కున పుట్టి, తూర్పు వైపున ప్రవహించే కృష్ణా నది సుమారు 1300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలా తన ప్రయాణంలో ఎన్నో నగరాలను, పట్టణాలను, ఆధ్యాత్మిక ప్రదేశాలను, పుణ్య స్థలాలను తాకూతూ వెళుతుంది. ఈ పవిత్ర కృష్ణా నది కి 29 ఉపనదులు ఉన్నాయి. వాటిలో కెల్లా పెద్ద ఉపనది తుంగభధ్ర నది. తుంగభధ్ర నది తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఆలంపూర్ వద్ద కృష్ణా నది తో కలుస్తుంది. చిట్టచివర హంసలదీవి వద్ద కృష్ణా నది తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించి బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది.

హిందువుల పవిత్ర నదిగా భావించే కృష్ణా నది తీరాన ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రలలో శ్రీశైలం క్షేత్రం ప్రధానమైనది. అతరువాతనే మిగితా క్షేత్రాలు. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్నాటక, మహారాష్ట్ర లలో ప్రవహించే కృష్ణా నది ఒడ్డున కూడా పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. కృష్ణా నది కి ప్రధాన ఆకర్షణ ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే పుష్కరాలు. ఆ సమయంలో కృష్ణా నది తీరం అంతా భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తుంది. కృష్ణా నది తీరం వెంబడి ఉన్న పుణ్య క్షేత్రాలను ఒకసారి పరిశీలిస్తే ...

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

కృష్ణా నది పుట్టుక

కృష్ణా నది మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి 306 కిలోమీటర్ల ప్రయాణం సాగించి కర్ణాటకలోని బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. కర్నాటక లో 482 కిలోమీటర్ల సుధీర్ఘ ప్రయాణం కావించి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద ప్రవేశిస్తుంది. పిదప ఇదే జిల్లాలోని ఆలంపూర్ ప్రదేశంలో ఆంధ్ర రాష్ట్రాంలోకి ప్రవేశిస్తుంది.

చిత్ర కృప : Saurabhdas

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

కృష్ణా నది పుట్టుక

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాంలోకి ప్రవేశించడమే తరువాయి .... దట్టమైన నల్లమల అడవుల్లోని లోయల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన కృష్ణా శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ప్రవహించి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది. ఇక్కడ నుండి దీవి సీమ లోని హంసల దీవి వద్ద తన ఉగ్రరూపాన్ని చూపించి చివరగా బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోతుంది.

చిత్ర కృప : Prateek Rungta

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

మహబలేశ్వర్, మాహారాష్ట్ర

మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఒక పర్వత ప్రాంతం(హిల్ స్టేషన్). పశ్చిమ కనుమలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ కనుమల్లోనే కృష్ణా నది తో పాటుగా మరో నాలుగు నదులు పుడుతాయి. ఈ ప్రదేశంలో చూడటానికి ముప్పై కి పైగా ఆకర్షణలు ఉన్నాయి. అందమైన లోయలు, అడవులు, నదులు, జలపాతాలు ఇక్కడి పశ్చిమ కనుమల అందాల్ని మరియు మహాబలేశ్వర్ అందాల్నిమరింతగా పెంచాయి.

చిత్ర కృప : Nilesh Khedekar

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

సాంగ్లీ, మహారాష్ట్ర

సాంగ్లీ మహారాష్ట్రలోని ప్రసిద్ధ పట్టణం. ఈ పట్టణాన్ని డ్రామాల పుట్టినిల్లు అనేవారు. ఇక్కడ తప్పక చూడవలసినవి ఆలయాలు, జంతు ప్రదర్శనశాలలు. ఇక్కడి ఆలయాల్లో గణపతి ఆలయం, సంగమేశ్వరుని ఆలయం బాగా ప్రశస్తి చెందినవిగా స్థానికులు చెబుతారు. అంతేకాక ఈ ప్రాంతంలోనే రామలింగ, దత్తదేవ ఆలయాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Shreesaipratik

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

బెల్గాం, కర్నాటక

కర్నాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో గల ఐనాపూర్ గ్రామం వద్ద కృష్ణా నది ప్రవేశిస్తుంది. బెల్గాం పురాతనమైన పట్టణం. అందమైన సాహ్యాద్రి కొండలు, అరేబియా సముద్రం, జలపాతాలు, పచ్చిక బయళ్లు మరియు ఆలయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ చెప్పుకోదగ్గ రెండు ఆలయాలు చిక్క బాసడి, కమల్ బాసడి.

చిత్ర కృప : Sandeep Badavanache

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

కుదలసంగమ, కర్నాటక

కర్నాటక రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కుదలసంగమ ఒకటి. ఇది పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసినది. ఇక్కడ ప్రముఖంగా చూడవలసినది ఆలయాలు. ఈ ఆలయాలలో సంగమనాథ ఆలయం, బాసవేశ్వరుని ఐక్య లింగ ఆలయం ప్రధానమైనవి. సంగమనాథ ఆలయం చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.

చిత్ర కృప : Rupak Sarkar

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

జలదుర్గ, కర్నాటక

జలదుర్గ కర్నాటక రాష్ట్రంలోని రైచూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ కృష్ణా నది పరవళ్ళుతొక్కుతూ పై నుండి జలపాతంలా కిందకు పడుతుంది. దీనికి గల మరో పేరు జలదుర్గ జలపాతం. ఇక్కడ చూడవలసినది జలదుర్గ కోట. ఇది సముద్రమట్టానికి కొన్ని వందల అడుగుల ఎత్తులో నిర్మించినారు. ఈ కొండ మీద నుండి లోయలో ప్రవహించే కృష్ణా నదిని తనివితీరా చూడవచ్చు.

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

తంగడి, తెలంగాణ

తంగడి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా(పాలమూరు జిల్లా)లో గల ఒక గ్రామం. ఇక్కడే కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. దక్షిణ భారత దేశంలో రాక్షస తంగడి యుద్ధం ఇక్కడే జరిగిందని కొందరి అభిప్రాయం.

చిత్ర కృప : mahaboobnagar.nic.in

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

కురుపురం, మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది తీరాన ఉన్న కురుపురం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడికి భక్తులు వారాంతంలో తరచూ వస్తుంటారు. శని, ఆది వారాల సమయంలో, పండుగ సమయాల్లో యాత్రికులు ఇక్కడికి వచ్చి వనభోజనాలు సైతం చేస్తుంటారు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటూ యాత్రికులను ఆకర్షిస్తున్నది.

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

'కృష్ణమ్మ' ఒడిలో పవిత్ర క్షేత్రాలు !

గద్వాల, మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లా లో గల గద్వాల ఒక ప్రముఖ పట్టణం మరియు రెవిన్యూ డివిజన్. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది గద్వాల కోట మరియు అందులోని చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం. గద్వాల కోట పూర్తిగా మట్టితో నిర్మించినారు. దీనితో పాటు ఇక్కడ చూడవలసిన మరో ఆకర్షణ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్.

చిత్ర కృప : Gadwal Fort

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+