Search
  • Follow NativePlanet
Share
» »విలాస‌వంత‌మైన‌ రైలు ప్ర‌యాణం కోరుకునేవారి కోసమే ఈ ఐదు లగ్జరీ రైళ్లు!

విలాస‌వంత‌మైన‌ రైలు ప్ర‌యాణం కోరుకునేవారి కోసమే ఈ ఐదు లగ్జరీ రైళ్లు!

విలాస‌వంత‌మైన‌ రైలు ప్ర‌యాణం కోరుకునేవారి కోసమే ఈ ఐదు లగ్జరీ రైళ్లు!

భారతదేశంలో విలాస‌వంత‌మైన రైలు ప్ర‌యాణానికి ఫిబ్రవరి, మార్చి నెలలు అనువుగా ఉంటాయి. ఈ రెండు నెలల్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ప‌ర్యాట‌క ఔత్సాహిక‌లు ఎక్కువ‌గా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తారు.

మీరు కూడా రాబోయే రోజుల్లో విలాస‌వంత‌మై రైలు ప్ర‌యాణం ద్వారా భారతదేశాన్ని సందర్శించాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఈ ఐదు లగ్జరీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆ విలాస‌మైన రైళ్ల ప్ర‌త్యేక‌త‌లు, విశేషాలు తెలుసుకుందామా?

ప్యాలెస్ ఆన్ వీల్స్

ప్యాలెస్ ఆన్ వీల్స్

ప్యాలెస్ ఆన్ వీల్స్ లగ్జరీ రైళ్లలో ముఖ్య‌మైన‌దిగా చెప్ప‌బ‌డుతోంది. దీనిని 1982లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రైలు సర్వీసులో ఉంది. 2009 సంవత్సరంలో ప్యాలెస్ ఆన్ వీల్స్ సేవలు మరియు సౌకర్యాలలో ప్రత్యేక మార్పులు చేయబడ్డాయి. 2010లో ప్యాలెస్ ఆన్ వీల్స్ అత్యంత సౌకర్యవంతమైన రైళ్ల జాబితాలో నాలుగ‌వ‌ స్థానంలో నిలిచింది. అధునాత సౌక‌ర్యాల‌తో సేవ‌లందిస్తోన్న ఈ రైలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

రైలులో మొత్తం 14 కోచ్‌లు ఉంటాయి. వాటికి రాచ‌రిక నేప‌థ్యం ఉన్న రాష్ట్రాల పేరు పెట్టారు. ఈ రైలులో ప్రయాణ రుసుము 5 లక్షల నుండి 10 లక్షల రూపాయ‌ల‌ వరకు ఉంటుంది. ఇది ఢిల్లీ నుండి రాజస్థాన్ వరకు వెళుతుంది. ఈ సమయంలో రైలు అన్ని ప్రధాన ప‌ర్యాట‌క ప్రదేశాలలో ఆగుతుంది.

మహారాజా ఎక్స్‌ప్రెస్

మహారాజా ఎక్స్‌ప్రెస్

మీరు రాయల్ స్టైల్‌లో రైలులో ప్రయాణించాలనుకుంటే, ఖచ్చితంగా మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించండి. ఇందులో వైఫై, లైవ్ టీవీ, మినీ బార్, ఎయిర్ కండిషనింగ్, రాయల్ ఫుడ్ సహా అనేక ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించబడ్డాయి. ఈ రైలు ఛార్జీ కూడా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ రైలు ఢిల్లీ నుండి ఆగ్రా వరకు వెళుతుంది.

రాయల్ ఓరియంట్

రాయల్ ఓరియంట్

మీరు బడ్జెట్‌లో రాయల్ రైడ్ కావాలనుకుంటే, రాయల్ ఓరియంట్ సరైన రైలు. ఈ రైలు ధర 1 లక్ష నుండి 1.5 లక్షల రూపాయ‌ల‌ మధ్య మాత్రమే ఉంటుంది. రాజపుత్ర సంస్థానాలకు ఈ రైళ్లు నడిచాయి. రాయల్ ఓరియంట్ ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు ప్రయాణిస్తుంది. ఇందులో ఆహారం, పానీయం సహా ఇతర ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తారు.

గోల్డెన్ చారియట్

గోల్డెన్ చారియట్

ఈ స్వర్ణ రథాన్ని కర్ణాటకకు గర్వకారణంగా పిలుస్తారు. ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. హంపిలోని ప్రసిద్ధ విఠల్ దేవాలయం పేరు మీద ఈ స్వర్ణ రథానికి పేరు పెట్టారు. ఇందులో 19 కోచ్‌లు ఉన్నాయి. అదే సమయంలో, రైలులో ప్రపంచ స్థాయి రెస్టారెంట్ మరియు బార్ ఉన్నాయి. ఇది కాకుండా, రైలులో జిమ్ మరియు స్పా సెంటర్ కూడా ఉంది. ఇది కర్ణాటక నుండి గోవా వరకు వెళుతుంది. రైలు ఛార్జీలు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటాయి.

దక్కన్ ఒడిస్సీ

దక్కన్ ఒడిస్సీ

పై రైళ్లు కాకుండా, మీరు దక్కన్ ఒడిస్సీలో రాయల్ స్టైల్‌లో ప్రయాణించవచ్చు. ఈ రైలు అందం చూడగానే ఎవ్వ‌రైన మంత్ర‌ముగ్దులు కావాల్సిందే. రైలు లోపల ఫర్నీచర్ ఎంతో విలాస‌వతంగా త‌యారు చేయ‌బ‌డింది. రైలు ఛార్జీలు రూ.5 లక్షల నుంచి రూ.12 వరకు ఉంటాయి. ఈ రైలుతో మీరు రాజస్థాన్, గుజరాత్ మరియు మహారాష్ట్రలకు ప్రయాణించవచ్చు.

More News

Read more about: indias luxury trains delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+