Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారతదేశంలోని ఈ చారిత్రక ప్రదేశాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి

దక్షిణ భారతదేశంలోని ఈ చారిత్రక ప్రదేశాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి

దక్షిణ భారతదేశంలోని ఈ చారిత్రక ప్రదేశాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి

భారతదేశం అంటేనే చారిత్రాత్మక స్మారక కట్టడాల నిల‌యం. అందులోనూ దక్షిణ భారతదేశంలో చాలా ప్రాముఖ్యత పొందిన నిర్మాణాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ప్రదేశాలు శతాబ్దాలుగా ఎన్నో మ‌రుపురాని క్షణాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి. స్మారక చిహ్నాలు నిత్యం చ‌రిత్ర‌ను గుర్తు చేస్తాయి. దక్షిణ భారతదేశంలోని ఈ కట్టడాలు సుందరమైన నిర్మాణ‌శైలి నిత్యం సంద‌ర్శ‌క‌ల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేస్తాయి. అలాంటి డిజైన్‌ల‌తో ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశంలోని ఈ చారిత్రక ప్రదేశాలు మిమ్మల్ని తప్పకుండా ఆకర్షిస్తాయి.

చార్మినార్

చార్మినార్

మీరు హైదరాబాద్‌కు వెళ్లి ఉంటే, చార్మినార్ గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ చారిత్రక ప్రదేశం దానితో ముడిపడి ఉన్న అనేక విష‌యాలు మిమ్మ‌ల్ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. అప్పట్లో నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ప్లేగు వ్యాధి నిర్మూలనను గుర్తించేందుకు చార్మినార్ నిర్మించబడిందని ప్ర‌చారంలో ఉంది. 1591లో సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా చతురస్రాకారంలో దీనిని నిర్మించారు. ఇందులో నాలుగు స్తంభాలు క్లిష్టమైన చెక్కడాలతో మరియు పై అంతస్తులో ఒక మసీదు ఉంది. ఇది 425 సంవత్సరాలకు పైగా న‌గ‌ర‌వాసుల‌ను ప‌ల‌కరిస్తూ ఉంది. ఉదయం 9 నుండి సాయంత్రం 5:30 వరకు దీనిని సంద‌ర్శించే అవ‌కాశం ఉంది.

బెలూమ్ గుహలు

బెలూమ్ గుహలు

గుహ నిర్మాణాలు, గ్యాలరీలు, పొడవైన మార్గాలు మరియు మంచినీటితో కూడిన విశాలమైన నీటిమడుగులకు ప్రసిద్ధి చెందాయి. చిత్రావతి నది కోతకు గురై ఈ గుహలు ఏర్పడ్డాయి. ఇవి 10,593.8 అడుగుల పొడవు కలిగి ఉంటాయి. భారత ఉపఖండంలోని అతిపెద్ద గుహలలో ఒకటిగా పేరుగాంచాయి కూడా. ఈ గుహలు భౌగోళికంగా మరియు చారిత్రాత్మకంగా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇందులో బౌద్ధ పూర్వ యుగం నుండి అనేక బౌద్ధ అవశేషాలు దాగి ఉన్నాయి. ఉదయం 10 నుండి సాయంత్రం 4:30 వరకు అనుమ‌తి ఉంటుంది. చేరుకునేందుకు సుల‌భ‌త‌ర‌మైన చిరునామా.. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా, కొలిమిగుండ్ల, ఆంధ్రప్రదేశ్.

హంపి

హంపి

శిథిలాల నగరంగా పిలువబడే హంపి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య పాలనలో వైభవంగా ఉండేది. దేవాలయాలు, ఏకశిలా శిల్పాలు మరియు స్మారక చిహ్నాలు ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క ప్రధాన ఆకర్షణలు. మధ్యయుగ కవి-సంగీతకర్త పురందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని విట్టల దేవాలయంలో ఏటా నిర్వహించబడే పురందర ఉత్సవానికి కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మీరు సందర్శించే సైట్‌ను బట్టి సమయాలు మారుతూ ఉంటాయి.

స్థానం : హంపి (పట్టణం), విజయనగర జిల్లా, కర్ణాటక

మైసూర్ ప్యాలెస్

మైసూర్ ప్యాలెస్

అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. మైసూర్ ప్యాలెస్ ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించబడిన మూడు-అంతస్తుల నిర్మాణం. ప్యాలెస్ చతురస్రాకారపు టవర్లను కలిగి ఉంది. గోపురాలతో కప్పబడిన కార్డినల్ పాయింట్లు అందంగా డిజైన్ చేయబడ్డాయి. దర్బార్ హాల్, కళ్యాణమంటపం ప్యాలెస్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. నైపుణ్యంతో చెక్కిన తలుపులు, రత్నాలతో కప్పబడిన బంగారు సింహాసనం, పెయింటింగ్‌లు మరియు గోపురం పైకప్పులు గమనించదగినవి. ఈ ప్యాలెస్‌లో జయ మార్తాండ, జయరామ, బలరామ మరియు వరాహ అనే నాలుగు ప్రవేశాలు ఉన్నాయి.

సమయాలు : ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు (ఆదివారం నుండి శనివారం వరకు)

స్థానం : సయ్యాజీ రావు రోడ్, అగ్రహార, చమ్‌రాజ్‌పుర, మైసూరు, కర్ణాటక

More News

Read more about: charminar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+