Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడకు వెళితే బ్రహ్మచారులకు వివాహం...దంపతులకు వెంటనే సంతానం

ఇక్కడకు వెళితే బ్రహ్మచారులకు వివాహం...దంపతులకు వెంటనే సంతానం

తిరుప్పరంకుండ్రం కు సంబంధించిన కథనం. Tirupparankunram Murugan Temple is a Hindu temple and one of the Six Abodes of Murugan, located at Tirupparankunram

By Beldaru Sajjendrakishore

తాజా కథనాల కోసం 1.త్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం దర్శిస్తే అన్నింటా విజయమే

పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయనుకోండి. అదే ఆడపిల్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె, ఆమె కుటుంబం ఎంత బాధలో ఉంటుందో ఆ పైవాడికెరుక. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఆ తల్లితండ్రులు. మరి కొందరికి వివాహం అయినా కూడా కొన్ని కారణాల వల్ల శోభనం జరగక వాయిదా పడుతూ ఉంటుది. ఇందుకు శారీరక మానసిక బాధలు కారణం.

ఇలాంటి వారు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్లి అవుతుందని చెబుతారు. అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి కలిగే సంతానం ఆరోగ్య వంతంగా, బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు. ఈ పుణ్యక్షేత్రం మదురైకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సదరు క్షేత్రం గురించిన పూర్తి వివరాలతో పాటు మదురై గురించి కుప్లంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

1. మధురైకు 9 కిలోమీటర్ల దూరంలో

1. మధురైకు 9 కిలోమీటర్ల దూరంలో

1. మధురైకు 9 కిలోమీటర్ల దూరంలో

Image Source:


తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.

2. వారిరువురూ విష్ణు కుమార్తెలు

2. వారిరువురూ విష్ణు కుమార్తెలు

2. వారిరువురూ విష్ణు కుమార్తెలు

Image Source:

ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది. మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన సుందర వల్లి, దేవయానీ అమ్మలు. వీరు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు. మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు. మన పురాణములలో చెప్పే ఆఖ్యానములకు అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి. అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు. వాటిలోని సూక్ష్మములను తెలుసుకోవాలని పురాణాలు చెబుతాయి.

3. వారే తమను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు

3. వారే తమను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు

3. వారే తమను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు

Image Source:

అయితే ఒక రోజు సుందరవల్లి, దేవయానీ (అమృత వల్లి) అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. అప్పుడు స్వామి అమృత వల్లితో "నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను" అని అభయం ఇస్తారు. అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి.

4. ఇంద్రుడిని వద్దకు వెళ్లి

4. ఇంద్రుడిని వద్దకు వెళ్లి

4. ఇంద్రుడిని వద్దకు వెళ్లి

Image Source:

తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి ఇంద్రుడిని కలిసి " నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది" అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది.

5. ఐరావతం పెంచింది కాబట్టి

5. ఐరావతం పెంచింది కాబట్టి

5. ఐరావతం పెంచింది కాబట్టి

Image Source:

ఆమెకు పెళ్ళి చేసుకునే వయసు వచ్చే వరకు అన్నీ తానై సాకుతుంది. అమృత వల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో "యానై" అంటే ఏనుగు). అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు. తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు. అది వల్లీ కళ్యాణ ఘట్టం. వేరే అఖ్యానంలో వివరిస్తాను.

6. సుర పద్మం అనే రాక్షసుడిని వధించి

6. సుర పద్మం అనే రాక్షసుడిని వధించి

6. సుర పద్మం అనే రాక్షసుడిని వధించి

Image Source:

ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు. వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది. ఈ క్రమంలో తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు.

7. అలా శాప విమోచనం కలుగుతుంది

7. అలా శాప విమోచనం కలుగుతుంది

7. అలా శాప విమోచనం కలుగుతుంది

Image Source:

స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, తిరిగి వారి రూపం వచ్చి, వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు.

8. ఇంద్రుడు వారికి తెలియజేస్తాడు

8. ఇంద్రుడు వారికి తెలియజేస్తాడు

8. ఇంద్రుడు వారికి తెలియజేస్తాడు

Image Source:

అక్కడే ఉన్న బ్రహ్మకి, శ్రీ మహా విష్ణువుకి ఇంద్రుడు తన ఈ కోర్కెని తెలియజేస్తాడు . బ్రహ్మ నారాయణుడు కూడా చాలా సంతోషించి దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యునికి తెలుపుతారు, స్వామి అంగీకరిస్తారు. అటు పై సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది.

9. ఇలా వరమిస్తారు

9. ఇలా వరమిస్తారు

9. ఇలా వరమిస్తారు

Image Source:

అంతే కాకుండా ఇక్కడకు వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిస్తారు. అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం, బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెబుతారు. దీంతో ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.

10. ఒకే కొండ రాతిని తొలిచి

10. ఒకే కొండ రాతిని తొలిచి

10. ఒకే కొండ రాతిని తొలిచి

Image Source:

ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది. ఆలయం లోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. అక్కడ అందరూ వెన్న ముద్దలతో అమ్మ వారికి పూజ చేస్తారు. మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది.

11. మెట్ల పై వెలితే గర్భాలయం

11. మెట్ల పై వెలితే గర్భాలయం

11. మెట్ల పై వెలితే గర్భాలయం

Image Source:

ఇంకా లోపలి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వాహనం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు, ఆయనకి ఎడమవైపు దేవయానీ అమ్మ, కుడి వైపు నారద మహా ముని క్రిందకి కూర్చుని ఉంటారు.

12. ఇక్కడ అభిషేకం చేయరు

12. ఇక్కడ అభిషేకం చేయరు

12. ఇక్కడ అభిషేకం చేయరు

Image Source:

ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేకాక, అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు "కర్పగ వినాయగర్" అనే పేరుతో ఉంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు.

13. ఈ క్షేత్రమును చేరే మార్గములు

13. ఈ క్షేత్రమును చేరే మార్గములు

13. ఈ క్షేత్రమును చేరే మార్గములు

Image Source:

తిరుచెందూర్ తమిళనాడు లోని మధురై సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్ ద్వారా: చెన్నై - 450 Km, బెంగళూరు - 470 Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. రైలు ద్వారా: చెన్నై నుంచి మధురైకి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. (ఉదాహరణకి వైగై ఎక్స్ ప్రెస్, ఇది మన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లాంటి ట్రైన్. చెన్నైలో మధ్యాహ్నం 12.45 కి బయలుదేరి మధురై రాత్రి 8.50 కి చేరుకుంటుంది.

14. విమానం ద్వారా

14. విమానం ద్వారా

14. విమానం ద్వారా

Image Source:

విమానము ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (470 Km), అది కాక జాతీయ విమానాశ్రయము మధురై లోనే మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 Km దూరంలో ఉంది. వసతి సదుపాయము ఈ క్షేత్రము మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.

16. మదురై గురించి

16. మదురై గురించి

16. మదురై గురించి

Image Source:

మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు - రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది.

17. రెండు బంగారు గోపురాలు

17. రెండు బంగారు గోపురాలు

17. రెండు బంగారు గోపురాలు

Image Source:

ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక. ఎత్తైన ఆలయ గోపురం 51.9 metres (170 ft) ఎత్తు ఉంది.

18. వెయ్యి స్థంభాల గుడి

18. వెయ్యి స్థంభాల గుడి

18. వెయ్యి స్థంభాల గుడి

Image Source:

మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని వేయి స్తంభాల మంటపం తిరునల్వేలి లోని పురాతన నెల్లయప్పార్ ఆలయం నమూనాగా నిర్మించబడింది. ఆయిరం కాల్ మండపం లేదా వేయి స్తంభాల మంటపం 985 (1000కి బదులుగా) చెక్కిన స్తంభాలను కలిగి ఉన్నాయి. దీన్ని సాంస్కృతికంగా అతి ముఖ్యమైన స్థలంగా గుర్తించారు, దీన్ని భారతీయ పురావస్తు సర్వే విభాగం వారు నిర్వహిస్తున్నారు.

19. అరియనాథ ముదలియార్ చేత నిర్మితం

19. అరియనాథ ముదలియార్ చేత నిర్మితం

19. అరియనాథ ముదలియార్ చేత నిర్మితం

Image Source:

వేయి స్తంభాల మంటపం 1569 లో అరియనాథ ముదలియార్‌చే నిర్మించబడింది. ఇతడు మొట్టమొదటి మదురై నాయక రాజు అయిన విశ్వనాధ నాయకుడి ప్రధానమంత్రి మరియు సేనాధిపతిగా ఉండేవాడు. ఇతడు పాలెగాళ్ల వ్యవస్థ, దేశంలో ఇది భూస్వామ్య సంస్థకు సమానమైనట్టిది, ఇది పలు పాళ్యంలు లేదా చిన్న ప్రాంతాలుగా విభజించబడేది, ప్రతి పాళ్యం కూడా పాళయక్కార్ లేదా ఉప అధికారిచేత పాలించబడేది.

20. ఇక్కడే శివపార్వతుల కళ్యాణం

20. ఇక్కడే శివపార్వతుల కళ్యాణం

20. ఇక్కడే శివపార్వతుల కళ్యాణం

Image Source:

ఈ మంటపంలోనే ఆలయ కళా వస్తుప్రదర్శన శాల ఉంది, ఇక్కడ 1200 సంవత్సరాల పురాతన చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, ఛాయాచిత్రాలు, చిత్తరువులు ఇతర వస్తువులు ప్రదర్శింబడుతున్నాయి. ఈ మంటపం వెలుపల, పశ్చిమం వైపుగా, సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడి ప్రతి స్తంభాన్ని తట్టినప్పుడు ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తుంది. మంటపం దక్షిణం వైపున కల్యాణ మంటపం ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో చిత్తిరై పండుగ కాలంలో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తుంటారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+