• Follow NativePlanet
Share
» »త్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం దర్శిస్తే అన్నింటా విజయమే

త్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం దర్శిస్తే అన్నింటా విజయమే

Written By: Beldaru Sajjendrakishore

ఇతిహాసాల ప్రకారం బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు ఉన్నారని తెలుసు. త్రిమూర్తులైన ఈ ముగ్గురు కలిసి ప్రతిష్టించిన గణేషుడి విగ్రహం ఒకటి కర్నాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలో కలదు. ఇక అత్యంత అరుదైన గరుడ దేవాలయం కూడా ఇదే జిల్లాలో ఉంది. ఇక హరప్ప, మొహంజదారో కాలం నుంచి కూడా ఇక్కడ బంగారం గనులు ఉన్నాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ జిల్లా కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కలదు. అదెక్కడుందో .. అక్కడికి వెళితే ఏమేమి చూడాలో చూసొద్దాం. 

వేసవిలో నదీ జలాల నురుగుల పై

ఆలయం నీడ ఇక్కడ మనతో పాటు వస్తుంది...ఇక్కడే నృత్యంలో పార్వతి పై శివుడు గెలిచింది.

కోలార్ ... కర్నాటక రాష్ట్రంలో తూర్పు అంచున దక్షిణ భాగంలో ఆంధ్ర మరియు తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కలదు. బంగారు గనులకు దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఈ జిల్లా అద్భుతమైన ఆలయాలు, ట్రెక్కింగ్ ప్రదేశాలు, కోటలు కలిగి ఉన్నది. బెంగళూరు నుండి జాతీయ రహదారి 4 గుండా 68 కి. మీ. దూరం ప్రయాణిస్తే గంటన్నారలో కోలార్ చేరుకోవచ్చు.

1. ఎల్ ఆకారంలో గుడి

1. ఎల్ ఆకారంలో గుడి

1. ఎల్ ఆకారంలో గుడి

Image Source:

కోలార్ ను సందర్శించే ప్రతి యాత్రికుడు కోలా రమ్మ గుడి సందర్శించాల్సిందే ..! సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఈ పార్వతి దేవి ఆలయాన్ని చోళులు 'ఎల్' ఆకారంలో నిర్మించినారు. గుడిలో గ్రానైట్ రాళ్లతో చెక్కిన నమూనాలు, విగ్రహాలు యాత్రికులను మరిపిస్తాయి. శిల్పాలు ఎంతో చూడ ముచ్చటగా ఉంటాయి.

2. సోమేశ్వర ఆలయం

2. సోమేశ్వర ఆలయం

2. సోమేశ్వర ఆలయం

Image Source:


సోమేశ్వర ఆలయం శివుని అవతారాలలో ఒకటిగా భావించే సోమేశ్వరునికి క్రీ.శ. 14 వ శతాబ్ధంలో విజయనగర నిర్మాణ శైలిలో కోలార్ పట్టణానికి మధ్యలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆలయం లోపల పాశ్చాత్య దేశాల నిర్మాణ శైలి ని పోలి ఉండే కళ్యాణ మండపం, స్తంభాలు గమనించవచ్చు. ఇవన్నీ భారతీయతతో పాటు పాశ్చత్య శిల్పకళా చాతుర్యాన్ని మనకు తెలియజేస్తాయి.

4. కోలార్ బెట్టా

4. కోలార్ బెట్టా

4. కోలార్ బెట్టా

Image Source:


కోలార్ పర్వతాలు 'కోలార్ బెట్ట' గా కూడా పిలువబడే కోలార్ పర్వతాలు కోలార్ పట్టణం నుండి కేవలం 2 కి. మీ. దూరంలో కుటుంబసభ్యులకి, స్నేహితులకి, జంటలకి ఒక పిక్నిక్ స్పాట్ గా ఉన్నది. 100 మెట్లు పైకెక్కి కొండ మీదకి చేరుకోగానే పెద్ద మైదానం, నంది నోటి నుండి జాలువారే నీరు, చుట్టూ ప్రకృతిని చూస్తూ ఆనందించవచ్చు.

5. మార్కండేయ కొండ

5. మార్కండేయ కొండ

5. మార్కండేయ కొండ

Image Source:

మార్కండేయ కొండ వోక్కలేరి గ్రామం కోలార్ సమీపంలో యాత్రికులకు అన్వేషించడానికి సూచించబడినది. ఇక్కడ మార్కండేయ ముని తపస్సు చేసిన కొండ ఉన్నది. ముని పేరు మీదనే ఇది మార్కండేయ కొండ గా పిలవబడుతున్నది. యాత్రికులు కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళితే పైన ఒక ఆలయాన్ని, జలపాతాన్ని మరియు చుట్టూ ఉన్న అడవి అందాలను వీక్షించవచ్చు.

 6. ఎల్లోడు కొండ

6. ఎల్లోడు కొండ

6. ఎల్లోడు కొండ

Image Source:

ఆది నారాయణ స్వామి గుడి బాగేపల్లి నుంచి 12 కి. మీ. దూరంలో ఎల్లోడు కొండలపై ఉన్న ఆది నారాయణ స్వామి గుహాలయాన్ని యాత్రికులు తప్పక చూడాలి. గుడిలో ఉద్భావమూర్తి రాతి విగ్రహం ఎటువంటి అలంకరణలు లేకుండా ఉంటుంది. కొండ మీదకి చేరుకోవటానికి 618 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. మాఘ మాసం లో జరిగే రథోత్సవానికి దేశ, విదేశాల నుండి భక్తులు తరలి వస్తారు.

7. రామ లింగేశ్వర గుడి

7. రామ లింగేశ్వర గుడి

7. రామ లింగేశ్వర గుడి

Image Source:

రామలింగేశ్వర గుడి కోలార్ కు 10 మైళ్ళ దూరంలో ఉన్న అవని(దక్షిణ గయ) గ్రామం రామలింగేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందినది. సమయముంటే ఇక్కడే సీతాదేవి ఆలయం, శారదా పీఠం చూడవచ్చు. పురాణాల ప్రకారం ఇక్కడే వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిందని, రామునికి అతని కుమారులకు ఇక్కడే యుద్ధం కూడా జరిగిందని స్థానికుల నమ్మకం.

8. కోటిలింగేశ్వర ఆలయం

8. కోటిలింగేశ్వర ఆలయం

8. కోటిలింగేశ్వర ఆలయం

Image Source:

దేశంలో ప్రసిద్ధిచెందిన కోటి లింగేశ్వర ఆలయం కోలార్ లోని కమ్మసాన్ధ్ర గ్రామంలో కలదు. గుడిలో శివలింగం 108 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. అలాగే శివలింగానికి అభిముఖంగా ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తున్న నంది విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి నాడు జరిగే విశిష్ట పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

9. కురుదుమలె

9. కురుదుమలె

9. కురుదుమలె

Image Source:

కురుదుమలె ప్రదేశం కోలార్ కు 35 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ త్రిమూర్తులైన శివుడు, విష్ణువు, బ్రహ్మ కలిసి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టించినారు. ఈ విగ్రహం సుమారు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినట్లు అక్కడ వేయించిన శాశనాల ద్వారా తెలుస్తుంది. అలాగే సమీపంలో సోమేశ్వర దేవాలయాన్ని కూడా సమయముంటే దర్శించండి. కాగా, ఇక్కడి విగ్రహాన్ని దర్శించుకుంటే అన్నింటా విజయం సిద్ధిస్తుందని చెబుతుంటారు. అందువల్లే రాజకీయ నాయకులు తమ నామినేషన్ల సమయంలో ఇక్కడికి తప్పకుండా వెళ్లి స్వామి వారి ఆశిర్వాదం తీసుకుంటారు.

11. సంతానం లేని వారు

11. సంతానం లేని వారు

11. సంతానం లేని వారు

Image Source:

సాధారణంగా ఈ దేవాలయానికి సంతానం లేని దంపతులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి తప్పక సంతానం కలుగుతుందని స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు సైతం నమ్ముతుంటారు. ఈ దేవాలయం ఆవరణంలోనే భక్తిభావం ఉట్టిపడే హనుమంతుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం సరిగ్గా గరుడ విగ్రహానికి ఎదురుగా ఉంటూ ఒకదానికొకటి చూస్తున్నట్లు ఉంటాయి.

12. అవని

12. అవని

12. అవని

Image Source:

భారత దేశంలోని సీత దేవాలయాల్లో అవని ఒకటి. వాల్మీకి ఇక్కడే ఉండేవాడు. సీత కుశ లవులకు ఇక్కడే జన్మనిచ్చినట్లు పురణాలు చెబుతున్నాయి. లవ కుశలకు జన్మనిచ్చిన గదిని ఇప్పటికీ మనం చూడవచ్చు. లవ కుశులకు శ్రీరాముడికి యుద్ధం జరిగినది ఇదే గ్రామంలో అని తెలుస్తోంది. ఇక్కడే జాంబవంతుని దేవాలయం కూడా ఉంది. ఇక్కడే శ్రీ క`ష్ణుడికి జాంబవంతుడు శమంతక మణిని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.

13. బంగారు గనులు

13. బంగారు గనులు

13. బంగారు గనులు

Image Source:

హరప్పా, మోహంజోదారో నాగరికత కాలం నుంచే కోలార్ గనుల్లో బంగారంను తవ్వకాల ద్వారా వెలికితీసేవారు. ఆతరువాత గుప్తులు కాస్త లోపలికి తవ్వకాలు జరిపి బంగారం బయటికి తీసేవారు. చోళులు, టిప్పుసుల్తాన్ లు, విజయనగర రాజులు, బ్రిటీష్ వారు కూడా తవ్వకాలు జరిపారు. చివరికి ముడి ఖనిజంలో బంగారు శాతం తగ్గడంతో 2001 లో శాశ్వతంగా మూసేసారు.

14. కోలార్ చేరుకోవటం ఎలా ?

14. కోలార్ చేరుకోవటం ఎలా ?

4. కోలార్ చేరుకోవటం ఎలా ?

Image Source:

కోలార్ చేరుకోవటానికి బెంగళూరు నుండి చక్కటి రోడ్డు మార్గం కలదు. రైలు, విమాన మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం 65 కి. మీ. దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కోలార్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. దేశ, విదేశాల నుండి ఇక్కడికి విమాన సౌకర్యాలు ఉన్నాయి. ట్యాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించి కోలార్ చేరుకోవచ్చు.

 15. రైలు మార్గం

15. రైలు మార్గం

15. రైలు మార్గం

Image Source:

కోలార్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇది పట్టణం నుండి 2 కి. మీ. దూరంలో కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కలుపబడింది. అటోలలో ప్రయాణించి కోలార్ చేరుకోవచ్చు. రోడ్డు మార్గం కోలార్ గుండా జాతీయ రహదారి 4 వెళుతుంది. రాష్ట్ర సర్వీస్ బస్సులు మరియు ఇతర ప్రవేట్ సర్వీస్ బస్సులు బెంగళూరు, చిక్కబల్లాపూర్ ప్రాంతాల నుండి నిత్యం కోలార్ కు బయలుదేరుతుంటాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి