• Follow NativePlanet
Share
» »పాము పడగ నీడన కప్ప..ఎంత శత్రువులైనా మిత్రులను చేసే క్షేత్రం

పాము పడగ నీడన కప్ప..ఎంత శత్రువులైనా మిత్రులను చేసే క్షేత్రం

Written By: Beldaru Sajjendrakishore

కర్నాటక రాష్ట్రం చిక్ మగళూరు జిల్లాలో తుంగ నది ఒడ్డున ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం శృంగేరి. చాలా కాలం క్రితం ఇక్కడ ఒక పాము ప్రసవించే కప్పకు తన పడగను నీడ ఇవ్వడం జరిగింది. జాతి వైర్యం కలిగిన కప్ప, పాము ఈ విధంగా ఉండటం చూసిన సద్గురువు ఆది శంకరాచార్యులు ఇక్కడ శారద పీఠాన్ని స్థాపించారు. దీంతో ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఎటువంటి శత్రువులైన మిత్రులుగా మారుతారని భక్తులు విశ్వసిస్తారు.

1,300 ఏళ్లుగా భా...రీ విగ్రహం నీటి పై అలాగే

పురుషాంగ రూపంలో 'లింగ'మయ్య

మీవి కెమరా కళ్లు అయితే ...ఈ ప్రాంతాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి

ఇద్దరూ కలిసి లేదా విడివిడిగా ఈ క్షేత్రాన్ని సందర్శించవచ్చు. ఇక దేశం మొత్తం మీద ఆది శంకరాచార్యులు ఇక్కడ మాత్రమే ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇంతటి విశిష్టతలు కలిగిన ఈ క్షేత్రం గురించిన సమస్త సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

1. అందుకు ఆ పేరు

Image Source:

కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగ నది ఒడ్డున శృంగేరిఉంది. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఋష్యశృంగుడు రోమపాదుడి పాలిస్తున్న అంగ రాజ్యములో అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామము నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. అంతేకాకుండా ఈ ప్రాంతం ఎప్పుడూ వర్షాలతో సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. దీంతో ఆ ప్రాంతం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కొంత పచ్చదనం ఎక్కువగా ఉంటుంది.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

2. పాము పడగ నీడన కప్ప

Image Source:


ధర్మ ప్రచారం కోసం ఆదిశంకరాచార్యులు దేశాటన జరుపుతున్న సమయములో, ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు వస్తాడు. ఆ సమయంలో ప్రసవిస్తున్న ఒక కప్పకు ఒక పాము తన పడగతో నీడ కల్పిస్తుంది. బద్ధ శత్రువులైన పాము, కప్ప మధ్య పరస్పర మైత్రీ భావము చిగురించేలా చేయడానికి స్థలమే కారణమని భావిస్తాడు. ఇంతటి మహత్తు కలిగిన ఈ ప్రాంతంలో తాను నిర్మించదలిచిన నాలుగు మఠాల్లో మెదటి మఠంను నిర్మిస్తాడు. అదే శృంగేరి శారదా పీఠం.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

3. 12 ఏళ్లు గడిపిన ప్రాంతం

Image Source:

ఇక ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి , కంచి, ద్వారకలో మరో మూడు మఠాలను స్థాపించారు. ఇవి ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ఇక ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో శృంగేరి శారద మఠం మెదటిది. దీనినే దక్షిణామ్నాయ మఠంగా చెబుతారు. హిందూ సనాతన ధర్మాలను ఈ పీఠాలు పరిరక్షిస్తూ ప్రచారం చేస్తుంటాయి.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

4.కృష్ణ యజుర్వేదము

Image Source:


మరోవైపు దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ శృంగేరి శారద మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు. ఆయన సన్యాస్యాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

5. ఇతర మతస్తులు ఆదరించారు

Image Source:


1782 నుంచి 1799 వరకూ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరీ శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరీ మీద కూడా దాడిచేసి ఊరినీ, పీఠాన్ని కూడా దోచుకున్నారు. స్వామివారికి, వారి శిష్యులకు అన్నవస్త్రాలకే లోటువచ్చింది. టిప్పుసుల్తాన్ ఈ సంగతి తెలుసుకుని వారికి ఆహారపదార్థాలు, బట్టలు, ధనం, మరెవరైనా దోచుకోబోతే అడ్డుకుందుకు సైన్యాన్ని ఇచ్చి పంపారు.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

6. శారదాంబ దేవాలయం

Image Source:


శారదాదేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వసానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు నెలకొల్పారని చెబుతారు. ఉన్నదని చెబుతారు. మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని స్థలపురాణం. మెదట ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14 వ శతాబ్దములో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి మరియు బంగార విగ్రహ ప్రతిష్ఠ చేసారని చరిత్ర బట్టి తెలుస్తోంది.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

7. ద్రవిడ శైలిలో

Image Source:

ఆలయ పరిసరాలు 20 వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడింది. అగ్నిప్రమాదము జరగడంతో పాత దేవాలయపు స్థానములో కొత్తదేవాలయము నిర్మించారు. జీర్ణోద్ధారణ జరిగిన ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

8. విద్యాశంకర దేవాలయం

Image Source:

శారదా శృంగేరి మఠానికి పదవ పీఠాధిపతైన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత పీఠాధిపతి భారతి కృష్ణ తీర్థుల ఆధ్వర్యంలో 1357-58 మిగిలిన నిర్మాణం జరిగింది. విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్క రాయలకు గురువు. ఈ ఆలయం నిర్మాణం హొయసల శైలిలో జరిగింది. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

9. పన్నైండు రాశులు

Image Source:

స్వామికి ఇరుప్రక్కల వినాయకుడు, అమ్మవారు ఉంటారు. ఈ దేవాలయం లోపలి మండపంలోని స్థంబాలపై 12 రాశులు చెక్కి ఉంటాయి. ఆలయ నిర్మాణం, గవాక్షాల ఏర్పాటు (కిటికీ ఏర్పాటు) సూర్య కిరణాలు నెలల ప్రకారం ఆయా రాశుల మీద పడేటట్లు చేయబడింది. ఇంకో విశేషం ఏమంటే మండపంలోని స్తంభాలపై ఉన్న గుండ్రపు రాళ్ళు గోళాకారంగా సింహపు నోటి నుండి బయటకు జారునట్లుగా చెక్కారు. ఇవి సింహం నోటిలో ఉన్నట్లు ఉంటాయి కాని గోళం అంచులు సింహం నోటికి తగిలి తగలనట్లు ఉండి జారిపడతాయి అనిపించేటట్లుగా అత్యద్భుతంగా చెక్కారు

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

10. తుంగ భద్ర నది ఒడ్డున

Image Source:


శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉంది. తుంగ నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం, దాని ప్రక్కన ఆ ఆలయానికి అనుసంధానం ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పూజా మూర్తులకు అవసరమైన జలాలన్ని ఇక్కడ నుండే తెస్తారు. తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు. తుంగానదిలో అసంఖ్యాకంగా చేపలు నది ఒడ్డుకు వస్తుంటాయి, భక్తులు చేపలకు అటుకులను ఆహారంగా వేస్తారు. తుంగానది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది, అందువలన ఇక్కడ ఈత కొట్టవద్దని హెచ్చరికలు ఉంటాయి.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

11. కెరె ఆంజనేయ

Image Source:


ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆలయం శ్రీ ఆంజనేయ దేవాలయం. ఇది కర్ణాటకలోని శృంగేరి లో కలదు. దక్షిణ భారతదేశంలో పడమటి కర్నాటక రాష్ట్రంలో పడమటి కనుమల్లో మల్నాడు ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో ఆది శంకరరాచార్యుల వారు ప్రతిష్టించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు. కేరే అంటే కన్నడలో సరస్సు అని అర్ధం.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

12. అందుకే ఆ పేరు

Image Source:


సరస్సు ఒడ్డునే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది కనుక కేరే ఆంజనేయ దేవాలయం అన్న పేరు వచ్చింది. శ్రీ శంకరాచార్యులు భారత దేశం మొత్తం శృంగేరిలో ఒక్కచోటే శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. ఇంత ప్రత్యేకం కనుకనే దేవాలయానికి అంతటి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి. కేరే ఆంజనేయ స్వామి దేవాలయం ఇప్పుడున్నకొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

13. 12 మెట్లు ఎక్కాలి...

Image Source:

చిన్న దేవాలయం అయినా చాలా అందంగా ఉంది. ప్రకృతి దృశ్యాలకు మధ్య ఉంది. కేరే ఆంజనేయ స్వామిని దర్శించాలి అంటే 27 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. శృంగేరికి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ కేరే ఆంజనేయ స్వామిని దర్శించి, ఆ తర్వాత మిగతా దైవ దర్శనం చేస్తారు. ఆంజనేయస్వామి ఈ క్షేత్ర పాలకుడు కావటమే దీనిలోని విశేషం. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి దక్షిణ దిశాగా దర్శన మివ్వటం ఒక ప్రత్యేకత.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

14. విభిన్న రూపం

Image Source:

స్వామి ఎడమ చేతిలో తామర పుష్పాన్ని ధరించి ఉంటాడు. కుడి చేయి అందరిని దీవిస్తున్నట్లు ఉండటం విశేషం. స్వామి వాలం శిరస్సు పైకి వ్యాపించి ఉంటుంది. తోక చివర చిన్న గంట కట్టి ఉంటుంది. కాలికి నూపురం ఉంటుంది. చేతికి కేయూరం ధరించి ఉంటాడు. ఆయన నేత్రాలు కృపా సింధువులై భక్త జనాల పై కరుణా కటాక్షాలు వర్షిస్తున్నట్లు విశాలంగా, తేజో పుంజాలను వెదజల్లేవిగా కనిపిస్తాయి.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

15. అనేక ఉత్సవాలు

Image Source:

కేరే ఆంజ నేయస్వామికి వైదిక మంత్రాలతో పూజ చేస్తారు. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శనివారాలలో కన్నుల పండుగగా దీపోత్సవం నిర్వహించటం ఇక్కడి రివాజు. ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు వరకు, సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. దీనితో పాటు కాల భైరవ, వన దుర్గ, కాళికాంబ దేవాలయాలు దర్శించతగినవి.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

16. చూడదగిన ప్రాంతాలు...

Image Source:

శృంగేరి సమీప పర్యాటక స్థలాలు అగుంబే - 28 కిలోమీటర్లు, కుద్రేముఖ్ - 52 కిలోమీటర్లు, కర్కల - 60 కిలోమీటర్లు, భద్ర - 75 కిలోమీటర్లు, హొరనాడు - 78 కిలోమీటర్లు, చిక్కమగళూరు - 86 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిని సందర్శిస్తే వసతి సదుపాయాలు : శృంగేరి లో ధార్మిక సత్రాలు అధికం. వీటితో పాటు లాడ్జీలు, హోటళ్ళు కూడా యాత్రికులకు అందుబాటులో ఉంటాయి.

పాము పడగ నీడన కప్ప

పాము పడగ నీడన కప్ప

17. ప్రయాణ ఎలా...

Image Source:

శృంగేరి ఎలా చేరుకోవాలి ? వాయు మార్గం : శృంగేరికి దగరలో మంగళూరు విమానాశ్రయం 100 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ ద్వారా శృంగేరి చేరుకోవచ్చు. రైలు మార్గం : శృంగేరి కి దగ్గరలో ఉడుపి, చిక్కమగళూరు రైల్వే స్టేషన్లు కలవు. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులలో ప్రయాణించి శృంగేరి చేరుకోవచ్చు. బస్సు మార్గం : బెంగళూరు, ఉడుపి, చిక్కమగళూరు, మంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల నుండి శృంగేరి క్షేత్రానికి ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు లభిస్తాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి