• Follow NativePlanet
Share
» »శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమే

శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమే

Written By: Beldaru Sajjendrakishore

మూకాంబిక దేవికి అంకితమయిన కొల్లూరు మూకాంబిక దేవి ఆలయం భారత దేశములోని కర్నాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం ఉంది.

అరుదైన గరుడ దేవాలయం ఇక్కడే...

కర్నాటకలో కూడా 1000 స్థంభాల గుడి

వేసవిలో సముద్రపు అలల ఒడ్డున సరదాగా

పచ్చని కోడచాద్రి కొండల పర్వతల నడుమ ఉన్న ఈ ఆలయం ఏటా లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తుంది. ఈ కొల్లూరు మూకాంబిక ఆలయ సందర్శనం వల్ల మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తామని చెబుతారు. ఇందుకు గల కారణాలతో పాటు అలా విజయం సాధించిన వారు ఈ ఆలయ అభివృద్ధికి చేసిన సేవలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1. కౌమాసుర అనే రాక్షసరాజు...

1. కౌమాసుర అనే రాక్షసరాజు...

Image source:


పురాణాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే మిక్కిలి బలవంతుడైన కౌమాసుర అనే రాక్షసరాజు తపస్సు చేసి తానకు చావు లేకుండా వరం ఇవ్వాలని భావిస్తుంటాడు. తన మనోబలంతో ఆ రాక్షసరాజు కోరికను పసిగట్టిన కోల మహర్షి విషయాన్ని సరస్వతికి తెలియజేస్తాడు. దీంతో ఆమె శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో కౌమాసుర ఏమీ కోరుకోలేని విధంగా అతన్ని మూగవాడిని చేస్తుంది.

2. మూకాసురా పేరుతో

2. మూకాసురా పేరుతో

Image source:

అప్పటి నుంచి ఆ రాక్షసరాజును అందరూ మూకాసురా అనే పేరుతో పిలుస్తారు. ఇంత జరిగినా ఆ రాక్షసరాజు తన గర్వం వీడక దేవతలను, యక్షులను హింసించేవాడు. దేవతలను కాక తనను పూజించాలని హుకుం జారీ చేశాడు. యజ్జయాగాదులు నిర్వహించే వారిని హింసించి చంపేవాడు. దీంతో చలించిన మునీశ్వరులు కోల మహర్షి ఆధ్వరంలో పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ బాధలను చెప్పుకున్నారు. దీంతో పార్వతీ దేవి దైవగణంతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.

3. కుడజాద్రి కొండల్లో...

3. కుడజాద్రి కొండల్లో...

Image source:


ఇది జరిగిన చాలా ఏళ్లకు ఆది శంకర కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్నపుడు, దేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై కోరిక అడగమని చెప్పింది. ఆయన దేవిని కేరళలోని ఒక ప్రాంతంలో తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని కోరారు. తద్వారా కేరళ సుభిక్షమవుతుందని ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారికి వారు ఎన్నుకున్న రంగంలో జయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కూడా అడుగుతాడు.

4. అలా పరీక్ష పెడుతుంది...

4. అలా పరీక్ష పెడుతుంది...

Image source:

ఇందుకు అంగీకరించిన దేవి మొదట నీవు వెళ్లాలని నిన్ను తాను వెంబడిస్థానాని అయన తన గమ్యం చేరే వరకు తిరిగి చూడరాదని ఒక పరీక్ష పెడుతుంది. గతంలో మూకాసురుడిని వధించిన ప్రాంతానికి వచ్చిన వెంటనే దేవి ఆగిపోతుంది. దేవి యొక్క గజ్జల శబ్దం వినబడకపోవడంతో, శంకరాచార్యలు హటాత్తుగా తిరిగి చూశాడు. వెంటనే దేవి శంకరను వెంబడించడం ఆపేసి అక్కడ మూకాంబికగా వెలుస్తుంది.

5. సందర్శిస్తే విజయం...

5. సందర్శిస్తే విజయం...

Image source:


దీంతో శంకరాచార్యలు విచారిస్తుండగా పార్వతి దేవి జరిగిన కథమొత్తం చెప్పి ఇక్కడ తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని కోరుతుంది. ఇక్కడికి వచ్చిన వారికి నీవు కోరినట్లే వారు ఎంచుకున్న రంగంలో విజయం సిద్ధిస్తుందని వరమిస్తుంది. అప్పటి నుంచి నేటి వరకూ చాలా మంది రాజులు రాజకీయ నాయకులు ఈ మూకాంబికను దర్శించుకుని కానుకలు సమర్పిస్తున్నారు.

 6. ఏడు ముక్తి స్థలాల్లో ఒకటి....

6. ఏడు ముక్తి స్థలాల్లో ఒకటి....

Image source:


కర్ణాటకలోని 'ఏడు ముక్తి స్థల' యాత్రికా స్థలాలైన కొల్లూర్, ఉడుపి, సుబ్రహ్మణ్య, కుంబాషి, కోటేశ్వర, శంకరనారాయణ మరియు గోకర్ణ లలో మూకాంబిక దేవి ఆలయం ఒకటి. ఈ దేవాలయం కేవలం కర్ణాటక వాసులకే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతోపాటు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున మరియు పచ్చని కోడచాద్రి కొండల చుట్టూ ఉన్న ఈ ఆలయం ఏటా లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తుంది.

7. కొండ శిఖరం పై

7. కొండ శిఖరం పై

Image source:


దేవత యొక్క మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరం (3880') మీద ఉందని, సామాన్య ప్రజానీకానికి కొండ ఎక్కి వెళ్ళటం చాలా కష్టమవడంతో, శంకరాచార్య ఆ దేవాలయాన్ని కోల్లూర్ లో తిరిగి స్థాపించారని ప్రజలు నమ్ముతారు. ఇక్కడి పంచముఖ గణేశ యొక్క శిల్ప నిర్మాణం విశిష్టంగా ఉంటుంది. మూకాంబిక దేవిని శక్తి, సరస్వతి మరియు మహాలక్ష్మి.స్వరూపముగా భావించడంతో, భక్తులకు మూకాంబిక దేవి పై అపార విశ్వాసం ఉంది.

8. పంచలోహ విగ్రహం...

8. పంచలోహ విగ్రహం...

Image source:


శ్రీ చక్ర మీద ఉన్న ఆ దేవత యొక్క పంచలోహ మూర్తిని (ఐదు లోహాల మిశ్రమము) ప్రతిష్టించారు. ఆ దేవత జ్యోతిర్-లింగ రూపంలో శివ మరియు శక్తి ఇద్దరినీ కలుపుకుని ఉంటుంది. ఇక కొల్లూర్ శ్రీ మూకాంబికా దేవాలయములో శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ పార్థేశ్వర, శ్రీ పంచముఖ గణపతి, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ ప్రాణలింగేశ్వర, శ్రీ నంజుండేశ్వర, శ్రీ ఆంజనేయ, శ్రీ వెంకటరమణ, శ్రీ తులసి గోపాలకృష్ణలు తదితర విగ్రహాలను కూడా చూడవచ్చు.

9. నవరాత్రి ఉత్సవాలు...

9. నవరాత్రి ఉత్సవాలు...

Image source:


నవంబరులో జరిగే నవరాత్రి ఉత్సవాలలో, ఆ దేవాలయం భక్తులతో నిండిపోయి ఉంటుంది. నవరాత్రి పండుగలో ఆఖరి రోజున సరస్వతీ మంటపంలో విద్యారంభ లేక చిన్న పిల్లలకు వారి మాతృభాషలో అక్షరాలు నేర్పడం ప్రారంభించడం జరుగుతుంది. అయినా కూడా దేవాలయంలో, మరేదైనా వీలుపడిన రోజున కూడా విద్యారంభ జరుపుకోవచ్చు. భక్తులకు ప్రతి రోజు మధ్యాహ్నము మరియు సాయంత్రము ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుంది.

10. యేసుదాసు...

10. యేసుదాసు...

Image source:


గత 30 సంవత్సరాలుగా యేసుదాసు కొల్లూర్ మూకాంబికా దేవాలయానికి తన పుట్టినరోజున వచ్చి సరస్వతి దేవి కీర్తనలు పాడుతూ వస్తున్నాడు. అతని 60వ పుట్టిన రోజు నుండి ఆ సంగీత ఉత్సవం ప్రారంభమయింది. ఆ తొమ్మిది-దినాల సంగీత ఉత్సవం దేవాలయంలో ప్రతి జనవరిలో మొదలవుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి కూడా ప్రజలు చాలా మంది ఇక్కడకు వస్తుంటారు.

12. అనేక రాజకీయ నాయకులు...

12. అనేక రాజకీయ నాయకులు...

Image source:


గతంలో తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎం.జీ.ఆర్. ఒక కిలో బరువు మరియు రెండున్నర అడుగుల పొడవు ఉన్న ఒక బంగారు కత్తిని బహుకరించారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి అయిన శ్రీ గుండూ రావు అదే రకంలో వెండితో చేసిన కత్తిని బహుకరించారు. మూకాంబికా దేవత యొక్క ముఖ తొడుగు పూర్తి బంగారంతో తయారు చేయబడి, విజయనగర సామ్రాజ్యం వారిచే బహుమతిగా ఇవ్వబడింది. కేలాడికి చెందిన చెన్నమ్మాజీ బహుమతిగా ఇచ్చిన జ్యోతిర్లింగం యొక్క బంగారు ముఖ తొడుగు మరొక ప్రత్యేక ఆభరణము.

13. గరుడు తపస్సు చేసిన చోటు

13. గరుడు తపస్సు చేసిన చోటు

Image source:


మూకాంబికా అరణ్య ప్రాంతములోని కాలభైరవ మరియు ఉమామహేశ్వర ఆలయాల మధ్య ఉన్న చల్లటి నీటి జలమే సౌపర్ణిక నది యొక్క మూలం. తన తల్లి వినుత యొక్క కష్టాలను పోగొట్టమని దేవిని ప్రార్థిస్తూ గరుడ ఈ నది ఒడ్డునే తపస్సు చేశాడని పురాణాలు చెపుతున్నాయి. దేవి అతని ముందు కనిపించినప్పుడు, ఇక్కడ సుపర్ణ అనే తన పేరు పెట్టాలని కోరితే, అప్పటినుండి సౌపర్ణిక అని పేరు ఆ నదికి వచ్చింది. అతను తపస్సు చేసిన స్థలము "గరుడ గుహ" అని పిలవబడే ఒక చిన్న గుహగా ఈ నాటికి కూడా ఉంది.

14. అనేక రోగాలు నయమవుతాయి...

14. అనేక రోగాలు నయమవుతాయి...

Image source:


ఈ పుణ్యనది కోడచాద్రిలో ఉత్పన్నమయి కొల్లూర్ చుట్టూ "సంపర" అనే పేరుతో పడమట వైపు ప్రవహించి, మరవంతేలో "మహారాజస్వామి" (వరాహస్వామి) ఆలయం దగ్గర సముద్రంలో సౌపర్ణిక నది కలుస్తుంది. ఆ నది ప్రవహిస్తున్నప్పుడు 64 వివిధ మూలికలు మరియు వేళ్ళను తనలో పీల్చుకోవడం వలన ఆ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయం అవుతాయని నమ్మకం. అందువలన ఈ నదిలో స్నానం ఆచరించడం చాలా ప్రాముఖ్యం కలిగినది, పుణ్యంగా భావించబడుతుంది

15. వసతి....

15. వసతి....

Image source:


కొల్లూరు లో అనేక లాడ్జింగ్లు ఉన్నాయి. దేవాలయ దేవస్వాం సౌపర్ణిక అనే ఒక వసతిగృహాన్ని నిర్వహిస్తుంది. శ్రీ లలితాంబికా వసతిగృహం, మాతా ఛత్రం వసతి గృహం, గోయంకా వసతి గృహం మొదలగునవి కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద ఈ సదుపాయాలతో దాదాపుగా 400 గదులు ఉన్నాయి. గది అద్దెలు సామాన్య భక్తులకు అందుబాటులోనే ఉంటాయి. ఒంటరి సందర్శకులకు బస్సు స్టాండు సముదాయము యొక్క ఆవరణలోనే ఒక డార్మిటరీ ఉంది. మరొక సదుపాయం అయిన అతిథి మందిర రామకృష్ణ యోగాశ్రమంచే నిర్వహించబడుతుంది.

16. ఎలా వెళ్లాలి...

16. ఎలా వెళ్లాలి...

Image source:


కొల్లూర్ మూకాంబిక మెటల్ రోడ్డు ద్వారా చేరుకునే వీలు కలిగి ఉండి, మంగుళూరు, ఉడుపి, మరియు కుందాపూర్ నుండి నేరు బస్సులు ఉన్నాయి. ఇక కొంకణ్ రైల్వే దారిలోని కుండాపూర్ లేక మూకాంబికా రోడ్డు ( బైన్డూర్) లు అత్యంత చేరువలో ఉన్న రైల్వే స్టేషన్లు. బెంగళూరు నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం ఉంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి