» »ఇక్కడకు మీరు వెళితే ...‘శని’...మీ నుంచి దూరంగా వెలుతాడు...

ఇక్కడకు మీరు వెళితే ...‘శని’...మీ నుంచి దూరంగా వెలుతాడు...

Written By: Beldarau Sajjendrakishore

భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుని జీవితం మీద నవగ్రహాలు ప్రభావాన్ని చూపిస్తాయి. నవగ్రహాలలో శని ఒకటి. ఛాయాదేవి మరియు సూర్యదేవుని పుత్రుడు శనిమహా దేవుడు. నవ గ్రహ ప్రభావాల్లో ఇతన్ని విస్మరించలేము. శని మనుష్యుల జీవితావధిలో మూడు సార్లు, మూడు వేర్వేరు రూపాల్లో ప్రవేశిస్తుంది అని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. అవి పుంగుశని, మంకుశని మరియు మరణశని అనే రూపంలో శనీశ్వరుడు ప్రవేసిస్తాడు. పుంగుశని మంచిదని మరియు మంకుశని మరియు మరణశని చెడ్డదని చెప్తారు. మనుష్యుల జన్మకుండలి మరియు క్రిందటి జన్మలపాపఫలాల అనుగుణంగా జరుగుతుంది.

శని మానవజీవితంలో ప్రవేశించినతర్వాత ఏడున్నర లకాలం వుంటాడని నమ్ముతారు. అదేవిధంగా ఆ ఏలినాటిశని వున్న సమయంలో అయ్యే నష్టం, దుష్టపరిణామాలు తగ్గించుకోవటానికి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేతీరాలి. మీకు నమ్మకం లేక పోయినా ఒక్కసారి వీకెండ్ లో అలా వెళ్లి రాండి సరదాగా ఉంటుంది. ఒక వేళ నిజంగానే వాటికి ఆ మహత్యం ఉంటే మీకు మంచే జరుగుతుంది కదా ఒక వేళ లేదంటే కుటుంబ సభ్యులు, మిత్రులతో ఒక వీకెండ్ అలా సరదాగా గడిపినట్టూ ఉంటుంది

1. శ్రీ ఆదికేశ్వర పెరుమాళ్ దేవాలయం

1. శ్రీ ఆదికేశ్వర పెరుమాళ్ దేవాలయం

Image Source:

పెరుంబుదూర్ ఈ దేవాలయం సుమారు 500నుంచి 1000 సంల ముందే నిర్మించారని చెప్పబడినది. ఇది తమిళనాడులోని తిరుప్పరంభూరు పక్కన కలదు. ఈ దేవాలయానికి అనేకమంది భక్తులు వస్తూవుంటారు. విశేషమేమిటంటే మైసూర్ మహారాజు టెంపుల్ కోసం ఒక బంగారు మంటపాన్ని నిర్మించారు. మైసూరు మహారాజుకు ఒకసారి అకాల మరణం భయం పట్టుకుంది. దీంతో రాజ జ్యోతిష్యుల ప్రకారం ఈ దేవాలయాన్ని సందర్శించి మొక్కు తీర్చుకున్నాడు.

2. ఎలా వెళ్ళాలి?

2. ఎలా వెళ్ళాలి?

Image Source:


ఈ దేవాలయం పెరుంగలతూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాంబరం, ముడిచ్చూర్ మీదుగా కూడా వెళ్ళవచ్చును. ఈ దేవాలయానికి మణిమాంగలం ద్వారా సుమారు 45 నిలప్రయాణం ద్వారా చేరుకొనవచ్చును. ఇక్కడ వసతి సౌకర్యం అంతగా బాగుండదు. అందవల్ల దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత దగ్గర్లోని పెరుంగలతూర్ కు వెళ్లి రాత్రి బస చేయడం సబబని నిపుణులు చెబుతున్నారు.

3. ఆపత్సహాయేశ్వరర్ దేవాలయం.

3. ఆపత్సహాయేశ్వరర్ దేవాలయం.

Image Source:


ఆలంగుడి ఇది భారతదేశంలోని తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలోని వలంగైమాన్ తాలూకాలో ఆలంగుడిగ్రామంలో ఈ దేవాలయంవుంది.ఈ దేవాలయం శివునికి అర్పితమైన ఒక హిందూదేవాలయం.ఇక్కడ శివుడు ఆపత్సహాయేశ్వరర్ అని పూజించబడుతున్నాడు.దేవాలయం సుమారు 2ఎకరాల విస్తీర్ణాన్ని కలిగివుంది.16వ శతాబ్దంలో ఇది చోళులచేత నిర్మించబడినదని నమ్ముతారు. ఇక్కడి దేవాలయంలో ఉన్న కొన్ని శిల్పాలు చూడటానికి చాలా చాలా చూడముచ్చటగా ఉంటాయి.

4. ఎలా వెళ్ళాలి?

4. ఎలా వెళ్ళాలి?

Image Source:


ఆలంగుడి కుంభకోణంనుంచి సుమారు 18కిమీ ల దూరంలో వుంది. తమిళనాడు రాష్ట్ర రహదారి 66 నుండి సుమారు అరగంటలో చేరుకోవచ్చు. ఇక్కడ వసతి సౌకర్యం అంతగా బాగుండదు. అందువల్ల దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత దగ్గర్లోని పెరుంగలతూర్ కు వెళ్లి రాత్రి బస చేయడం బాగుంటుంది. అంతే కాక దేవాలయన్ని మిగిలిన రోజుల కంటే శనివారం దర్శించడం ఉత్తమని పెద్దలు చెబుతారు.

5. శ్రీ పెరుమాళ్ దేవాలయం

5. శ్రీ పెరుమాళ్ దేవాలయం

Image Source:


ఈ మహిమాన్విత దేవాలయం కోయంబత్తూర్ జిల్లాలో వుంది. ఈ దేవాలయం శనిదేవునికి అంకితం చేయబడింది. తులసిమాలను సమర్పించి ఇక్కడి శనిభగవంతుడిని ఆరాధిస్తారు. ఈ దేవాలయంలో వందలకొలది భక్తులు ప్రతినిత్యం స్వామి దర్శనానికి వస్తారు. విశేషమేమిటంటే ఈ దేవాలయానికి వచ్చేభక్తులు తులసిమాలను స్వామికి సమర్పించి భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఏలినాటిశని ప్రభావంనుంచి బయటపడుతారని నమ్ముతారు.అంటే జీవితంలో ఉత్తమమైన అభివృద్ధిని శనిదేవుడు కరుణిస్తాడు.

6. ఎలా వెళ్ళాలి?

6. ఎలా వెళ్ళాలి?

Image Source:


కరమడైనుంచి సమీపంలోవున్న కండియూర్ పెరుమాళ్ దేవాలయానికి కోయంబత్తూర్ నుంచి సుమారు 1గంట సేపు ప్రయాణించవలసివుంటుంది. రోడ్డు సౌకర్యం బాగుంది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ బస కొంత బాగానే ఉంటుంది. శనివారం స్వామి వారిని దర్శించుకొని రాత్రి సమయంలో అక్కడే బస చేయడం బాగుంటుంది. తరువాతి రోజు అంటే ఆదివారం చుట్టు పక్కల ప్రాంతాలను చూసి తిరిగి ఇంటికి వెళ్లవచ్చు.

7. పొంగుశనీశ్వరదేవాలయం

7. పొంగుశనీశ్వరదేవాలయం

Image Source:


తిరువరూర్ జిల్లాలోని తిరుకొల్లికడులోని పొంగు శనీశ్వరస్వామిదేవాలయం అత్యంత ప్రసిద్ధమైన దేవాలయం. శనివారం అపారజనసాగరం ఈ దేవాలయానికి వస్తారు. ఈ దేవాలయానికి వచ్చి భక్తితో శనిదేవున్ని ఆరాధిస్తే జీవితంలో అనుకోకుండా సంభవించే నష్టాలను తగ్గించుకొనవచ్చును. ముఖ్యంగా నువ్వులు, నల్లని బట్టతో శని దేవుడిని పూజిస్తారు. దీంతో శని దేవుడు శాంతించి మనల నుంచి దూరంగా వెలుతాడని భక్తులు నమ్ముతున్నారు.

8. ఎలా వెళ్ళాలి?

8. ఎలా వెళ్ళాలి?

Image Source:


మన్నార్ గేడి నుంచి కత్తలై అనే గ్రామం నుంచి కేవలం 20కిమీ ల దూరంలో వుంది. మన్నార్ గుడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లు తోంది. అంతేకాకుండా ఇది తమిళనాట రాజకీయాలకు కూడా నెలవైనది. ఇక విషయానికి వస్తే తిరుకొల్లి కడులో బస అంత సౌకర్యంగా ఉండదు. అందువల్ల ఇక్కడ స్వామి వారిని దర్శించుకుని మన్నారుగుడికి తిరిగి వెళ్లి అక్కడ ఉండటం ఉత్తమం.

9. శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం

9. శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం

Image Source:


శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం తిరువన్నామలై జిల్లాలో వుంది. ఇక్కడ ఏకాదశినాడు విశేషంగా పండుగను ఆచరిస్తారు. ఇక్కడ ముఖ్యంగా శివుడు,నరసింహస్వామి విగ్రహాలున్నాయి. శివుడు, నారాయణుడికి శనీశ్వరుడు ఇచ్చిన మాట ప్రాకారం ఒకే చోట వారిరువురిని దర్శించుకున్న భక్తులకు శనిమహాత్ముడు దూరంగా ఉంటాడు. దీంతో చాలా మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయం మేల్మరువత్తూరుకి వెళ్ళేదారిలో, కేవలం 1గంటలో వెళ్ళవచ్చును.

10. నాగేశ్వరర్ దేవాలయం

10. నాగేశ్వరర్ దేవాలయం

Image Source:


ఈ నాగేశ్వరర్ దేవాలయం నామక్కల్ జిల్లాలో వుంది.తిరువాడియార్ అనే పండుగరోజున విశేషంగా పండుగను ఆచరిస్తారు.ఈ సమయంలో అనేకమంది భక్తులు వస్తారు. నామక్కల్ నుంచి కేవలం 25కిమీ ల దూరంలోవుంది.ఈ దేవాలయం సమీపంలో అనేకదేవాలయాలు వున్నాయి,అవి మారియమ్మన్,రామస్వామి దేవాలయాలు వున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నువ్వుల నూనెతో స్వామివారికి అర్చన చేస్తారు. తద్వారా కష్టాలు తొలిగిపోతాయాని భక్తులు భావిస్తుంటారు.

11. శనీశ్వర దేవాలయం...పావగడ

11. శనీశ్వర దేవాలయం...పావగడ

Image Source:


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉన్న పావగడలో శనేశ్వరుడి దివ్య క్షేత్రం ఉంది. ఇక్కడ ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. తమ దోష నివారణ కోసం ఇక్కడకు దేశం నలుమూలల నుంచి వచ్చి పూజలు చేయిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ శనీశ్వరుడికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలతో పాటు నవధన్యాలతో విశేష పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా జనివారం ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

12. ఎలా చేరుకోవాలి...

12. ఎలా చేరుకోవాలి...

Image Source:


పావగడకు దగ్గర్లో అంటే బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దేశంలోని నలుమూలల నుంచి ఇక్కడకు విమానయాన సేవలు ఉన్నాయి. ఇతి అంతర్జాయతీయ విమానాశ్రయం కావడం వల్ల ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి పావగడకు 157 కిలోమీటర్ల ప్రయాణం. వీకెండ్ గా కూడా ఇక్కడకు ఎక్కువ మంది ఈ శనీశ్వర దేవాలయానికి వస్తుంటారు.

13. రైలు సదుపాలయం...

13. రైలు సదుపాలయం...

Image Source:


ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు ట్యాక్సీలు కూడా దొరుకుతాయి. పావగడకు దగ్గర్లో అంటే హిందూపురంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి పాపగడకు 53 కిలోమీటర్ల దూరం మాత్రమే. పావగడలో రాత్రి బసకు మంచి సౌకర్యాలు ఉన్నాయి. అన్ని తరగతుల వారికి అనువుగా లాడ్జీలు ఉన్నాయి. ఇక కర్ణాటక, ఆంధ్ర శైలి వంటకాల హోటల్స్ కూడా చాలా ఉన్నాయి.